చిత్రకూట్
చిత్రకూట్ ఉత్తర ప్రదేశ్ లోని చిత్రకూట్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది జిల్లాకు ముఖ్యపట్టణం కూడా. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.
చిత్రకూట్ ధామ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°12′N 80°54′E / 25.2°N 80.9°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | చిత్రకూట్ |
Elevation | 137 మీ (449 అ.) |
Population (2011) | |
• Total | 66,426 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 210205 |
టెలిఫోన్ కోడ్ | 05198 |
Vehicle registration | UP-96 |
చరిత్ర సవరించు
చిత్రకూట్ పట్టణం ఒకప్పుడు బాందా జిల్లాలో ఉండేది. 1997 మే 6 న ప్రభుత్వం బాందా జిల్లా నుండి చిత్రకూట్ జిల్లాను రూపొందించింది. ఈ నగరాన్ని కొత్త జిల్లాకు ముఖ్యపట్టణంగా నియమించారు.
భౌగోళికం సవరించు
చిత్రకూట్ జిల్లాకు ఉత్తరాన కౌశాంబి, దక్షిణాన సత్నా (ఎంపి), రేవా (ఎంపి), తూర్పున ప్రయాగ్రాజ్, పశ్చిమాన బాందా జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. చిత్రకూట్ మందాకిని నది ఒడ్డున ఉంది. భూభాగం పర్వత ప్రాంతం.
జనాభా సవరించు
2011 జనగణన ప్రకారం చిత్రకూట్ జనాభా 66,426. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46% ఉన్నారు. చిత్రకూట్ అక్షరాస్యత 67%, ఇది జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ; పురుషుల అక్షరాస్యత 75%, స్త్రీ అక్షరాస్యత 58%. జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.[1]
రవాణా సవరించు
చిత్రకూట్ జాతీయ రహదారి 76 పై ఉంది. ఈ నగరానికి బాందా, ప్రయాగరాజ్, సత్నా, రేవా, కౌశాంబి లకు రోడ్డు సౌకర్యం ఉంది.
చిత్రకూట్ రైల్వేస్టేషను మాణిక్‌పూర్ - ఝాన్సీ / కాన్పూర్ ప్రధాన మార్గంలో ఉంది. ఇక్కడి నుండి ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, భోపాల్, రాయ్‌పూర్, జబల్‌పూర్, కాన్పూర్, ఖజురాహో, లక్నో, దుర్గ్, వారణాసి లకు రైళ్ళు నడుస్తాయి
చిత్రకూట్ కు అత్యంత సమీపం లోని విమానాశ్రయం 106 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రయాగరాజ్ (అలహాబాద్) లో ఉంది. [2]
మూలాలు సవరించు
- ↑ "Chitrakoot Dham City Population Census 2011 - Uttar Pradesh". www.census2011.co.in. Retrieved 2018-01-26.
- ↑ "Airstrips of Civil Aviation Department, Uttar Pradesh". Archived from the original on 14 March 2014. Retrieved 24 May 2013.