చిత్రా విశ్వేశ్వరన్

చిత్ర విశ్వేశ్వరన్ ఒక భారతీయ భరత నాట్య నర్తకి, ఆమె చిదంబరం అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అన్న నాట్య కళాశాలను చెన్నైలో నిర్వహిస్తూన్నారు.

చిత్రా విశ్వేశ్వరన్ సియాటెల్ లో చేస్తున్న ప్రదర్శన
కేరళలో చిత్రా విశ్వేశ్వరన్ ప్రదర్శన

ఆమె భారత ప్రభుత్వం నుంచి 1992లో పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు .

జీవితము , శిక్షణ మార్చు

విశ్వేశ్వరన్ తన మూడవ ఏట నుంచి తన తల్లి రుక్మిణి పద్మనాభన్ తో కలసి నాట్యం చేసేవారు.ఆమె తండ్తి ఇండియన్ రైల్వేస్ లో ఇంజనీర్ గా చేసేవారు.కాబట్టి విశ్వేశ్వరన్ తన కుటుంబంతో లండన్ వెళ్లారు.ఆమె అక్కడ సంగీతం బాలట్ నేర్చుకున్నారు.తరువాత కోల్కతలో ఆమె మనిపూరి, కటక్ నేర్చుకున్నారు.ఆమెకు పది వయసు వచ్చినప్పుడు తిరువిదైమరదుర్లొని దేవదాశీ అయిన ట్.ఎ.రాజ్యలక్ష్మి దగ్గర శిక్షణలో చేరింది.ఆమె అరంగేట్ర, తొలి ప్రదర్శన రాజ్యలక్ష్మి దగ్గర చెరిన పది నెలలకే జరిగింది. తరువాత దాదాపు పది సంవత్సరాలు రాజ్యలక్ష్మి దగ్గర శిక్షణ పొందారు.