చిన్ని 2022లో విడుదలైన తెలుగు సినిమా. అమెజాన్ సమర్పణలో స్క్రీన్ సీన్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి బ్యానర్‌పై 'సాని కాయిధ‌మ్' అనే తమిళ చిత్రాన్ని 'చిన్ని' పేరుతో తెలుగులోనూ విడుదల చేయనున్నారు. కీర్తి సురేష్, సెల్వ రాఘవన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అరుణ్‌ మాతేశ్వరన్‌ దర్శకత్వం వహించిగా, ఈ సినిమా టీజర్‌ను ధనుష్ ఏప్రిల్‌ 22న విడుదల చేయగా[2], సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో మే 6న విడుదలైంది.[3]

చిన్ని
దర్శకత్వంఅరుణ్ మాతేశ్వరన్
నిర్మాతసిద్ధార్థ్ రావిపాటి
తారాగణంకీర్తి సురేష్
సెల్వ రాఘవన్‌
ఛాయాగ్రహణంయామిని యజ్ఞమూర్తి
కూర్పునాగూరాన్
సంగీతంసామ్ సి.ఎస్
పంపిణీదార్లుఅమెజాన్ ప్రైమ్ వీడియో
విడుదల తేదీ
2022 మే 6 (2022-05-06)[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

సఖినేటి పల్లికి చెందిన ఒక కానిస్టేబుల్ చిన్ని(కీర్తి సురేష్). ఆమెను 24హత్యలు చేసినందుకు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆమెకు తోడుగా ఉన్నా రంగయ్య(సెల్వ రాఘవన్‌) ను కూడా అరెస్ట్ చేస్తారు. అసలు వీరిద్దరూ ఎవరు..? ఎందుకు ఇన్ని హత్యలు చేయాల్సి వచ్చింది. కానిస్టేబుల్ చిన్నికి జరిగిన అన్యాయం ఏంటి? ఎవరిమీద ఆమె పగ తీర్చుకుంటుంది..? అనేదే మిగతా సినిమా కథ.[4][5]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: స్క్రీన్ సీన్ మీడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రై. లి
  • నిర్మాత: సిద్ధార్థ్ రావిపాటి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అరుణ్‌ మాతేశ్వరన్‌
  • సంగీతం: సామ్ సి.ఎస్
  • సినిమాటోగ్రఫీ: యామిని యజ్ఞమూర్తి

మూలాలు మార్చు

  1. Prajasakti (22 April 2022). "ఓటీటీలో 'చిన్ని'". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  2. Eenadu (27 April 2022). "'చిన్ని'.. ప్రతీకార కథ". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  3. Sakshi (22 April 2022). "నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్‌ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  4. Eenadu (27 April 2022). "పేరు చిన్ని.. చేసిన హత్యలు 24". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
  5. Eenadu (6 May 2022). "రివ్యూ: చిన్ని". EENADU. Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
  6. HMTV (30 June 2021). "దోపిడి దొంగగా మారిన మహానటి". Archived from the original on 27 April 2022. Retrieved 27 April 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=చిన్ని&oldid=3817330" నుండి వెలికితీశారు