కీర్తి సురేష్

సినీ నటి

కీర్తీ సురేష్ భారతీయ నటి. మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించారు.[1] నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి. 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేశారు ఆమె. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి, వెండితెరకు తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ పాత్రల్లో నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు ఆమె. ఆ తరువాత తమిళ్, తెలుగు చిత్రాలు కూడ నటించేందుకు సిద్ధమయ్యారు.

కీర్తి సురేష్ నాయర్
Keerthy Suresh at Thodari Audio Launch.jpg
జననం అక్టోబర్ 17, 1992
చెన్నై
క్రియాశీలక సంవత్సరాలు 2000-2002; 2013 - ప్రస్తుతం
వెబ్‌సైటు www.keerthysuresh4u.com

తొలినాళ్ళ జీవితంసవరించు

కీర్తీ తల్లిదండ్రులు మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, మలయాళ నటి మేనక. మేనక నిజానికి తమిళ ప్రాంతానికి చెందినవారు.[2][3]  కీర్తీ అక్క రేవతీ సురేష్ వి.ఎఫ్.ఎక్స్ స్పెషలిస్ట్. షారుఖ్ ఖాన్ నిర్మాణ  సంస్థ రెడ్ చిల్లీస్ లో పనిచేశారు రేవతి.[4][5] నాలుగో తరగతి వరకు  తమిళనాడులోని చెన్నైలో చదువుకున్నారు కీర్తి.[6] ఆ తరువాత చదువు తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయలో సాగింది. తిరిగి చెన్నైకు పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చారు. స్కాట్లాండ్ లో నాలుగు నెలల పాటు ఒక కోర్సు చదివిన కీర్తి, లండన్లో రెండు నెలల ఇంట్రెన్ షిప్ లో చేరారు. సినిమాల్లోకి నటిగా రాకపోయి ఉంటే డిజైనింగ్ లో ఉండేదాన్ని అని ఒక ఇంటర్వ్యూలో వివరించారు కీర్తి.[7]

నటించిన చిత్రాలుసవరించు

సూచిక
  ఇంకా విడుదలవని సినిమాలను సూచిస్తుంది:
సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2000 పైలట్స్ మళయాళం బాల్య నటి
2001 అచనయికిస్టం బాల్య నటి
2002 కుబేరన్ సిద్దార్దన్ కూతురు బాల్య నటి
2013 గీతాంజలి గీత, అంజలి కథానాయికిగా తొలి చిత్రం
2014 రింగ్‌ మాస్టర్ కార్తీక
2015 దర్బోని దేవి
ఇదు ఎన్న మాయం మాయ తమిళం తొలి పరిచయం(తమిళం)
2016 నేను శైలజ శైలజ తెలుగు తొలి పరిచయం(తెలుగు)
రజిని మురుగన్ కార్తిగ దేవి తమిళం
తొడరి \ రైల్ (తెలుగు) సరోజ తమిళం తెలుగులో రైల్ గా అనువాదమైంది
రెమో కావ్య తమిళం తెలుగులో రెమోగా అనువాదమైంది
2017 బైరవా మలర్‌విళి తమిళం తెలుగులో ఏజెంట్ భైరవ గా అనువాదమైంది
నేను లోకల్ కీర్తి తెలుగు
పాంబు సట్టై వేణి తమిళం
2018 అజ్ఞాతవాసి సుకుమారి తెలుగు
తానా సేర్న్ద కూట్టమ్ మధు తమిళం తెలుగులో గ్యాంగ్ గా అనువాదమైంది
మహానటి సావిత్రి తెలుగు[8] [9]
నడిగైయర్ తిలగమ్ తమిళం
సామి స్క్వేర్ దియా తమిళం తెలుగులో సామి 2 గా అనువాదమైంది
సండ కోళి 2 దుర్గా దేవి తమిళం తెలుగులో పందెం కోడి 2 గా అనువాదమైంది
సర్కార్ నీల తమిళం తెలుగులో అదే పేరుతో అనువాదమైంది
2020 మిస్ ఇండియా తెలుగు
2021 రంగ్ దే అనుపమ తెలుగు
2021 మరక్కార్ మళయాళం\ తెలుగు
2022 సర్కారు వారి పాట తెలుగు

మూలాలుసవరించు

  1. "Characters Which Has Scope To Perform Excites Me, Says Keerthi Menaka". www.filmibeat.com. Retrieved 18 November 2014.
  2. "Menaka was treated like a queen".
  3. "Want to play memorable roles like mom". malayalam.filmibeat.com. Retrieved 18 November 2014.
  4. Menaka was treated like a queen. The New Indian Express. URL accessed on 18 November 2014.
  5. One for the family. The Hindu. URL accessed on 18 November 2014.
  6. Gupta, Rinku (7 April 2015). "Mayas Role Is Very Close to My Heart". The New Indian Express. Retrieved 8 December 2015.
  7. Keerthy Suresh. Keerthy Suresh Height, Weight, Age, Affairs, Wiki & Facts. StarsFact: (10 November 2016). URL accessed on 13 November 2016.
  8. https://www.hindustantimes.com/regional-movies/savitri-biopic-pre-look-poster-of-mahanati-released-on-women-s-day/story-VSI8Sn1n7AJuBR5BCIi2AP.html
  9. "Savitri biopic: Pre-look poster of Mahanati released on Women's Day". 8 March 2017. Retrieved 21 May 2018.