చిప్కో ఉద్యమం
చిప్కో ఉద్యమం అనేది అటవీ సంరక్షణ ఉద్యమం. 1970లో చమోలి జిల్లా (ఉత్తరాఖండ్) లోని గోపేశ్వర్‌లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ (అప్పట్లో ఈ ప్రాంతం ఉత్తరప్రదేశ్లో భాగం) సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరూ ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకొని చెట్లను నరకాలనుకుంటే వాటితోపాటు మమ్మల్నీ నరకండి అని హెచ్చరించారు. దీంతో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని ఉత్తరాఖండ్ అడవుల్లో నివసించే గిరిజనులు (ముఖ్యంగా బిష్ణోయ్ తెగ మహిళలు) ఆ ప్రాంతంలోని అడవులను (నరికివేయకుండా) కాపాడుకోవడానికి చేపట్టారు. తొలుత వృక్షాలను రక్షించే ఉద్యమంగా ప్రారంభమై తర్వాత ఆర్థిక ఉద్యమంగా మారి చివరకు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంగా రూపుదిద్దుకుంది. ఈ ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు.[1]
ఉద్యమ వివరాలు
మార్చుఉద్యమ నిర్మాణం
మార్చుచిప్కో అనే పదం హిందీ నుంచి వచ్చింది. దీని అర్థం అతుక్కుపోవడం లేదా ఆలింగనం చేసుకోవడం. ప్రజల హక్కులను అటవీ సంపదను పరిరక్షించి, దానికి శాస్త్రీయంగా కొత్త రచన చేయడమే చిప్కో ఉద్యమ లక్ష్యం. 1973లో చమోలి జిల్లా (ఉత్తరాంచల్) లోని గోపేశ్వర్‌లో 300 వృక్షాలను నరికేందుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ సైమన్ కంపెనీకి అనుమతిచ్చింది. దీనికి ఆ గ్రామ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఒక్కొక్కరూ ఒక్కో చెట్టును ఆలింగనం చేసుకొని చెట్లను నరకాల నుకుంటే వాటితోపాటు మమ్మల్నీ నరకండి అని హెచ్చరించారు. దీంతో చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమాన్ని ఉత్తరాంచల్ అడవుల్లో నివసించే గిరిజనులు ( బిష్ణోయ్ తెగ మహిళలు ) ఆ ప్రాంతంలోని అడవులను కాపాడుకోవడానికి చేపట్టారు. ఇది ప్రాచీన భారతీయ సంస్కృతి నుంచి ఉద్భవించింది. చారిత్రకంగా, తాత్వికంగా, గాంధేయ సత్యాగ్రహ విధానాల్లో నడిచింది. అందువల్ల ఈ ఉద్యమాన్ని అడవి సత్యాగ్రహం అని కూడా అంటారు. బ్రిటిషర్లు రూపొందించిన అటవీ చట్టం -1927 వల్ల పల్లె ప్రజల హక్కులకు భంగం వాటిల్లడం, గ్రామీణులు జీవనోపాధి కోల్పోవడం, అడవులను వాణిజ్యావసరాల కోసం విపరీతంగా కొల్లగొట్టడంతో ఈ ఉద్యమం దేశమంతా వ్యాపించింది. 1970 దశకంలో సుందర్‌లాల్ బహుగుణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ఊపందుకుంది. చండీప్రసాద్ భట్ అనే మరో పర్యావరణవేత్త ఆయనకు సహకరించడంతో ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యావరణ ఉద్యమంగా పేరొందింది. ఉద్యమంలో భాగంగా సుందర్‌లాల్ బహుగుణ 1981-83 మధ్య కాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో దాదాపు 500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీని కలిసి హిమాలయ ప్రాంతాల్లో చెట్ల నరికివేతను నిషేధించాలని కోరారు. ఫలితంగా అక్కడ 15 ఏళ్ల పాటు చెట్ల నరికివేతను నిషేధిస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచింది.[2]
ఉద్యమకారులు
మార్చుఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ చిప్కో ఉద్యమం. "పర్యావరణ పరిరక్షణ :చిప్కో ఉద్యమం". blog.vikasadhatri.org. Archived from the original on 29 మార్చి 2018. Retrieved 26 March 2018.
- ↑ "పర్యావరణ ఉద్యమాలు". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 26 March 2018.[permanent dead link]