చిమన్‌రావ్ పాటిల్

చిమన్‌రావ్ రూపచంద్ పాటిల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు ఎరండోల్ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

చిమన్‌రావ్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 అక్టోబర్ 24 - 2024 నవంబర్ 22
ముందు అన్నాసాహెబ్ డా. సతీష్ భాస్కరరావు పాటిల్
తరువాత అమోల్ పాటిల్
నియోజకవర్గం ఎరండోల్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2009 - 2014
ముందు గులాబ్ రఘునాథ్ పాటిల్
తరువాత అన్నాసాహెబ్ డా. సతీష్ భాస్కరరావు పాటిల్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన
సంతానం అమోల్ పాటిల్[1]
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

చిమన్‌రావ్ రూపచంద్ పాటిల్ శివసేన పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2009 శాసనసభ ఎన్నికలలో ఎరండోల్ శాసనసభ నియోజకవర్గం నుండి శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి అన్నాసాహెబ్ డాక్టర్ సతీష్ భాస్కరరావు పాటిల్‌పై 3298 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి అన్నాసాహెబ్ డాక్టర్ సతీష్ భాస్కరరావు పాటిల్‌ చేతిలో 1983 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

చిమన్‌రావ్ పాటిల్ 2019 శాసనసభ ఎన్నికలలో ఎరండోల్ శాసనసభ నియోజకవర్గం శివసేన అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్‌సీపీ అభ్యర్థి అన్నాసాహెబ్ డాక్టర్ సతీష్ భాస్కరరావు పాటిల్‌పై 18002 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

మార్చు
  1. The Times of India (20 October 2024). "Erandol Sena MLA wants ticket for his son". Archived from the original on 27 November 2024. Retrieved 27 November 2024.
  2. The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  3. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.