చిలకపాటి సీతాంబ

చిలకపాటి సీతాంబ ప్రముఖ రచయిత్రి, గృహలక్ష్మి స్వర్ణకంకణము గ్రహీత.

చిలకపాటి సీతాంబ
జననంఅక్టోబరు 18 1900
కలికివాయి, నెల్లూరు జిల్లా
నివాస ప్రాంతంకలికివాయి, నెల్లూరు జిల్లా
ఇతర పేర్లుపర్ణశాల సీతాంబ
మతంహిందూమతం
భాగస్వాములుచిలకపాటి వేంకట నరసింహాచార్యులు
తండ్రిపర్ణశాల రాఘవాచార్యులు
తల్లిపర్ణశాల మంగమ్మ

జీవిత సంగ్రహంసవరించు

నెల్లూరు జిల్లాలోని కలికివాయి గ్రామంలో రాఘవాచార్యులు, మంగమ్మ దంపతులకు అక్టోబరు 18, 1900 తేదీన జన్మించారు. వారిది సంస్కృతాంధ్రపండితుల కుటుంబం. ఈమె భర్త వేంకట నరసింహాచార్యులు కూడా పండితులు. ఆకాలములో స్త్రీల ఆచారవ్యవహారములపై ఆంక్షలున్నా, సీతాంబగారి విద్యావికాసము కొనసాగినది.

విద్యసవరించు

తండ్రి, బావగారయిన విద్యారణ్య పంచానన శ్రీమాన్ విక్రాల రామచంద్రాచార్యులవద్ద సంస్కృత వ్యాకరణ పరిజ్ఞానము, కావ్యనాటక పరిచయమును అభ్యసించారు. భర్త చిలకపాటి వేంకట నరసింహాచార్యులు ఈ కవయిత్రి ప్రతిభావిశేషాలకు మరింతగా దోహదం చేసేరు. ఈమెకు సంస్కృత పాండిత్యము విశేషముగా ఉన్నా, ఆంధ్రకవితాస్వాదనమునందే ఆసక్తి ఎక్కువ.

సాహిత్యకృషిసవరించు

 • పద్మినీపరిణయకావ్యము
 • సముద్రమధనము(విష్ణుమాయావిలాసము)నాటకము
 • దిలీప నాటకము
 • అరవింద నవల
 • శూర్పణఖ (ఏకాంకిక)
 • కష్టజీవి (మరికొన్ని కలిపిన సంకలనం)
 • సీతారామాయణమను శతకము(అముద్రితము, అలభ్యము)

కదాచితుగా రాసిన పద్యాలు -

 • 1. శ్రీ తల్పగిరి రంగనాయక స్తుతి
 • 2. కృతజ్ఞతాపంచరత్నములు
 • 3. యశోద పుత్రవాత్సల్యము
 • 4. రాధాకృష్ణవిలాసము
 • 5. దసరా

ఇతర విశేషాలుసవరించు

ఈమె ఆశుకవిత్వము చెప్పగలదు. ఒకనాడీమె భర్తయు మరియొక పండితుడు హనుమన్నాటకములోని ఒక శ్లోకము గురించి ప్రస్తావించుకొనుచుండగా తలుపుచాటున నుండి విని దానికి తెలుగు పద్యమును వ్రాసి వారికి పంపినది.

 
కమఠపృష్ఠ కఠోరమిదం ధనుః
మధురమూర్తి రసౌ రఘునందనః
కధమధిజ్య, మనేక విధీయతాం
అహహ శాతఫణః ఖలు దారుణ

సీతాంబగారి అనువాదము
 
తేటగీతి :
కమఠపృష్ఠ కఠోరమీ కార్ముకంబు
సరస సుకుమారుడీ రామచంద్రమూర్తి
ఎటులనెక్కిడ నేర్చునో యేమి యౌనొ
కటకటా యేమి శపథంబు కన్నతండ్రి.

పురస్కారాలుసవరించు

మూలాలుసవరించు

 • గూడ సుమిత్రాదేవి. గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీతలు. సిద్ధాంతగ్రంథం. 1988