చిలుకూరి పాపయ్యశాస్త్రి

క్లుప్తంగా

మార్చు

శ్రీ చిలుకూరి పాపయ్య శాస్త్రి గారు రమారమి 1910-20 ల మధ్య కాలమని అంతర్జాల శోధనలో తెలుస్తుంది. ఆయన గోదావరి జిల్లా వారు. వారు ప్రముఖ సంస్కృత, తెలుగు సాహిత్య పండితులు. తెలుగు సంస్కృత-సాహిత్యానికి నిఘంటువులు రాసి ఆంగ్లమునకు అనువదించారు. వారు ప్రసిద్ధమైన గ్రంథము శ్రీనాధ కృతికి సమీక్ష[1] కూడా వ్రాశారు. ఇందులో భీమేశ్వర పురాణములోని కొన్ని స్థలాల వైశిష్ట్యము వివరించారు, ఇంకొన్ని భీమ ఖండంలోని సప్తగోదావరావతరనము కావ్యములు సమీక్షించి వివరముగా వ్రాయబడినవి. వారు ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక (ది జర్నల్ అఫ్ తెలుగు అకాడెమి), కాకినాడ విభాగంలో పనిచేసారు. ఈయన చాలా సంపుటాలతో వందల సంచికల వరకు 1905-05-12 కాలంలో ప్రచురితం అయిన వాటిని తిరిగి విశ్లేషించటం జరిగింది. ఈ ఆంధ్ర సాహిత్యపరిషత్పత్రిక ప్రచురణ నకల్లు పబ్లిక్ (డిజిటల్) లైబ్రరీ అఫ్ ఇండియాలో ఉన్నాయి. వేమూరి వెంకట్రావు గారు రాసిన "యాన్ ఇంట్రొడక్షన్ టు తెలుగు గ్రామర్ " పుస్తకానికి పాపయ్య శాస్త్రి గారు వ్రాసిన " ఆంధ్ర లక్షణ సారము " అనే గ్రంథము సూచన ప్రాయము. తెలుగు నేర్చుకోవాలనుకొనేవారికి తెలుగు భాష వ్యాకరనమును ఆంగ్లమాధ్యమములో వ్రాసిన పుస్థకము ఇది.

మూలాలు

మార్చు
  1. చిలుకూరి పాపయ్యశాస్త్రి (1939). శ్రీనాథ కృతి సమీక్ష.