చిలుకూరు మండలం

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం


చిలుకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన మండలం.[1] చిలుకూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన జగ్గయ్యపేట నుండి 30 కి. మీ. దూరంలో, కోదాడ - హూజూర్‌నగర్ మార్గంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

చిలుకూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, చిలుకూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°57′43″N 79°54′44″E / 16.961905°N 79.912291°E / 16.961905; 79.912291
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం చిలుకూరు (సూర్యాపేట జిల్లా)
గ్రామాలు 4
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,225
 - పురుషులు 19,754
 - స్త్రీలు 19,471
అక్షరాస్యత (2011)
 - మొత్తం 58.58%
 - పురుషులు 69.49%
 - స్త్రీలు 47.43%
పిన్‌కోడ్ 508206

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,225 - పురుషులు 19,754 - స్త్రీలు 19,471. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 108 చ.కి.మీ. కాగా, జనాభా 39,225. జనాభాలో పురుషులు 19,754 కాగా, స్త్రీల సంఖ్య 19,471. మండలంలో 10,682 గృహాలున్నాయి.[3]

నల్గొండ జిల్లా నుండి మార్పు మార్చు

లోగడ చిలుకూరు మండలం, నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చిలుకూరు మండలాన్ని (1+03) నాలుగు గ్రామాలతో కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా,కోదాడ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. బేతవోలు
  2. కొండాపురం
  3. చిలుకూరు
  4. పాలె అన్నారం

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
  4. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-24.

వెలుపలి లంకెలు మార్చు