సూర్యాపేట జిల్లా

సూర్యాపేట జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[1] 2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.[2]. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది. జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ జిల్లా నల్గొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సరిహద్దులను పంచుకుంటుంది.

భౌగోళికంసవరించు

 
సూర్యాపేట జిల్లా

జిల్లా విస్తీర్ణం 3,374.41 చదరపు కిలోమీటర్లు (1,302.87 చ. మై.)[3] గా ఉంది.

జనాభాసవరించు

  తెలుగు (83.28%)
  లంబాడి (11.24%)
  ఉర్దూ (4.97%)
  ఇతర (0.51%)

2011 భారత జనగణన ప్రకారం ఈ జిల్లాలో 1,099,560 మంది జనాభా ఉన్నారు.[4] 2011 లెక్కల ప్రకారం 83.28% మంది తెలుగు, 11.24% లంబాడి, 4.97% ఉర్దూ మొదటి భాషగలవారు ఉన్నారు.[5]

ముఖ్య పట్టణాలుసవరించు

మార్కెటింగ్ యార్డుసవరించు

రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు సూర్యాపేటలో ఉంది.

జిల్లాలోని మండలాలుసవరించు

 
సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం
 
పిల్లలమర్రి దేవాలయం,సూర్యాపేట్

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (5)

రవాణా సౌకర్యాలుసవరించు

పుణే నుండి విజయవాడ వెళ్ళు జాతీయ రహదారి (సంఖ్య 65) ఈ జిల్లా గుండా వెళుతుంది.ఈ జిల్లాకు రైలుమార్గ సౌకర్యం లేదు.

సంస్కృతి, పర్యాటకంసవరించు

జిల్లా ప్రముఖులుసవరించు

  1. సినీ నటులు కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, వేణు మాధవ్ సూర్యాపేట జిల్లాకు చెందినవారు.
  2. ఆర్మీ కల్నల్, మహా వీర్ చక్ర అవార్డు గ్రహీత బి. సంతోష్ బాబు (గల్వాన్ వ్యాలీ ఘర్షణలో మరణించాడు)

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. "తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2018-09-18.
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
  4. "New districts". Andhra Jyothy.com. 8 October 2016. Archived from the original on 25 డిసెంబరు 2018. Retrieved 8 October 2016.
  5. 2011 Census of India, Population By Mother Tongue

వెలుపలి లంకెలుసవరించు