చివుకుల అప్పయ్యశాస్త్రి

చివుకుల అప్పయ్యశాస్త్రి సంస్కృతాంధ్ర పండితులు, పత్రికా సంపాదకులు.

వీరు సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరణ కోసం పరితపించారు. వీరు "దివ్యవాణి" అనే ఆధ్యాత్మిక వారపత్రికను నడిపారు. సంస్కృతం నుండి గర్గ భాగవతాన్ని ఉదాత్తమైన రసవంతమైన శైలిలో తెలుగులోకి అనువదించారు. శ్రాద్ధ ప్రక్రియ అర్ధవంతమని వీరు సప్రమాణంగా నిరూపించారు. దీనిపట్ల ప్రజలకు ప్రత్యయాన్ని కలిగించుటకై తీవ్రంగా కృషిచేశారు. వీరు "వేంకటేశ విన్నపాలు" అను శతకమును రచించారు.