దివ్యవాణి (వారపత్రిక)
దివ్యవాణి ఆధ్యాత్మిక వారపత్రిక. మండపేట నుండి శ్రీ మెహెర్ చైతన్య నికేతన్ తరఫున ఈ వారపత్రిక వెలువడింది. కె.వి.సూర్యనారాయణ ప్రచురణకర్త. నిడదవోలు లోని మెహెర్ ప్రెస్‌లో ముద్రించబడింది. స్వామి సూర్యప్రకాష్ మెహెరానంద ఈ పత్రికకు గౌరవ సంపాదకునిగా వ్యవహరించాడు. కె.వి.సూర్యనారాయణ, డి.వి.ఎన్.మూర్తి సహ సంపాదకులు. అవతార్ మెహెర్ బాబా బోధనలు ఈ పత్రిక ప్రచారం చేసింది.
సంపాదకులు | స్వామి సత్యప్రకాష్ మెహెరానంద |
---|---|
వ్రాయసగాళ్ళు | కె.వి.సూర్యనారాయణ, డి.వి.యన్. మూర్తి |
వర్గాలు | వారపత్రిక |
రూపం | టాబ్లాయిడ్ |
ముద్రణకర్త | శ్రీ మెహెర్ చైతన్య నికేతన్ ట్రస్ట్, మండపేట |
మొదటి సంచిక | 1978, అక్టోబరు 15 |
భాష | తెలుగు |
ఈ పత్రిక తొలి సంచికలో ఈ క్రింది విధంగా ఉంది. “అవతార్ మెహెర్ బాబా వారి సేవకు అంకితమై స్వామి సూర్యప్రకాశ్ మెహెరానందజీ సంపాదకులుగా ఒక దశాబ్దికి పైగా అవిరళ కృషి సల్పిన దివ్యవాణి మెహెర్ చైతన్య నికేతన్ ట్రస్ట్ (మెహెర్-మండపేట) ఆధ్వర్యంలో తెలుగు వారపత్రికగా పునరుద్ధరింపబడి....”
దీనిని బట్టి ఈ పత్రిక అదే పేరుతో 1978కు ముందే ఒక దశాబ్దం పాటు వెలువడిందని తరువాత వారపత్రికగా 1978లో పునరుద్ధరించబడిందని తెలుస్తున్నది.
15-10-1975 సంచికలో ఈ క్రింది అంశాలు ఉన్నాయి.
- సిద్ధపురుషుని ద్వారా జ్ఞానోదయం - మెహెర్‌బాబా వారి మహోపదేశం
- పునరంకితం (సంపాదకీయం)
- దక్షిణాదిని గల సద్గురువు
- కర్మ రహస్యం: బీజ జాగృతి
- గురుర్బ్రహ్మ నమామ్యహం
- స్మృతి - విస్మృతి
- వార్తలు
- పుస్తక పరిచయము : సమాధాన సరళి మొదటి భాగం
- నవజీవన పరమార్థం
మూలాలు
మార్చు[permanent dead link] ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడెమీ ఆర్కీవ్స్‌లో మొదటి సంచిక మూలప్రతి]