చీకోలు సుందరయ్య

చీకోలు సుందరయ్య చిత్తూరు జిల్లా, బుచ్చినాయుడు ఖండ్రిగ మండలం, కుక్కంబాకం గ్రామంలో 1955, డిసెంబరు 10న జన్మించాడు. [1] హైదరాబాదులోని ప్రముఖ సాహిత్య సంస్థ రంజని తెలుగు సాహితీ సమితికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు.

చీకోలు సుందరయ్య
Ch Sundaraiah.jpg
జననంచీకోలు సుందరయ్య
(1955-12-10) 1955 డిసెంబరు 10 (వయసు 67)
కుక్కంబాకం, చిత్తూరు జిల్లా
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధిరచయిత, సాంస్కృతిక కార్యకర్త
Notable work(s)శేషేంద్రశిఖరం
ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్.
వెన్నెల దుఃఖం
పీవీ మన ఠీవి
మతంహిందూ

విశేషాలుసవరించు

ఇతడు తిరుపతి ఎస్.వి. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, వి.ఆర్. లా కాలేజీలో న్యాయశాస్త్రం చదివాడు. ప్రైవేటుగా ఎం ఏ సోషియాలజీ చేశాడు. 36 సంవత్సరాలు హైదరాబాదులోని ఏజీ ఆఫీసులో ఉద్యోగించి 2015లో రిటైర్ అయ్యాడు. 30 సంవత్సరాలు పత్రికలతో అనుబంధం కొనసాగించాడు. పల్లకి, స్రవంతి, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఈనాడు దినపత్రిక, తెలుగువెలుగు మొదలైన పత్రికలలో రచనలు చేశాడు. ఈనాడులో ఆదివారం ఈనాడు, వసుంధర, ప్రతిభ మొదలైన ప్రత్యేక పేజీలలో విస్తృతంగా అనేక పేర్లతో వ్రాశాడు. సుమారు 1000 ఇంటర్వ్యూలు చేశాడు. తేజ, జయంతి అనే పత్రికలను నిర్వహించాడు. ఇతడు 30 సంవత్సరాలు ఎ జి ఆఫీసులో రంజని తెలుగు సాహితీ సమితి కార్యదర్శిగా, అధ్యక్షునిగా సేవ చేశాడు. ఆ సంస్థ తరఫున 50 గ్రంథాలు ప్రచురించాడు వాటిలో విశ్వకవిత, అమ్మ, మా ఊరు, దాంపత్యం వంటి కవితా సంకలనాలు, శేషేంద్ర శిఖరం, పాటల పూదోట వేటూరి, సినిమా చూద్దాం రండి, విమర్శకులు మెచ్చినవి, మంచి కథ, నచ్చిన కథ, మెచ్చిన కథ, బహుమతి కథ వంటివి విశేష ప్రాచుర్యం పొందాయి. 1984లో రంజని కుందుర్తి కవితల పోటీ ప్రారంభించాడు. 1984 నుంచి 2015 వరకు పోటీలో ఎంపికైన కవితలతో పది పుస్తకాలు తెచ్చాడు. జంట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వచన కవులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే రంజని విశ్వనాథ పద్య కవితా పోటీలు నిర్వహించాడు. రంజని నందివాడ భీమారావు కథల పోటీలు, రంజని రాయప్రోలు రామకృష్ణయ్య కథల పోటీలు ప్రారంభించి ఎన్నో ఏళ్ళు నిర్వహించాడు. రంజనితో పాటు కవన వేదిక అనే సంస్థను నడుపుతున్నాడు. అలాగే నాయన ఫౌండేషన్, లావణ్య ఆర్ట్స్ థియేటర్ వంటి సంస్థలతో ఇతనికి అనుబంధం ఉంది. జంట నగరాల లోనే కాక జిల్లాల్లోనూ ఎన్నో కార్యక్రమాలలో పాల్గొన్నాడు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, బుక్ ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి సన్మానం వంటివి పొందాడు. ఆకాశవాణి, ఈటీవీ, ఎన్టీవీ చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఢిల్లీ లోని నేషనల్ బుక్ ట్రస్టుకి 5 సంవత్సరాలు సలహాదారుగా ఉన్నాడు. పదవీ విరమణ తర్వాత డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కొంతకాలం పనిచేసి తరువాత స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీలో తన సేవలను అందిస్తున్నాడు.[2]

రచనలుసవరించు

 1. శేషేంద్రశిఖరం (సాహిత్యం-వ్యక్తిత్వం) (సంపాదకత్వం)
 2. నివాళి (కుందుర్తి సాహిత్యం, వ్యక్తిత్వాలపై రచయితల వ్యాసాలు)
 3. ప్రజలు.. ప్రభుత్వం.. ఒక ఐ.ఎ.ఎస్.
 4. వెన్నెల దుఃఖం
 5. బహుమతి కథ - 1 (సంపాదకత్వం)
 6. బహుమతి కథ - 2 (సంపాదకత్వం)
 7. బహుమతి కథ - 3 (సంపాదకత్వం)
 8. సినిమా చూద్దాం రండి
 9. అమ్మ (అమ్మపై 118 హృదయ స్పందనలు) (సంపాదకత్వం)
 10. మా ఊరు (సంపాదకత్వం)
 11. మంచి కథ (సంపాదకత్వం)
 12. మెచ్చిన కథ - 1 (సంపాదకత్వం)
 13. నచ్చిన కథ (సంపాదకత్వం)
 14. స్వర్ణరంజని (సంపాదకత్వం)
 15. వెండి వెలుగులు (సంపాదకత్వం)
 16. ఒక నులివెచ్చని స్పర్శ (సంపాదకత్వం)
 17. కిరణం (సంపాదకత్వం)
 18. ఆకాంక్ష (రంజని - కుందుర్తి అవార్డు కవితలు) (సంపాదకత్వం)
 19. పీవీ మన ఠీవి
 20. అద్దంలో ఆభరణం
 21. విశ్వకవిత

మూలాలుసవరించు

 1. వెబ్ మాస్టర్. "రచయిత: చీకోలు సుందరయ్య వివరాలు". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 26 January 2022.
 2. వెబ్ మాస్టర్. "చీకోలు సుందరయ్య". జనహిత. Retrieved 27 January 2022.