చుంకత్ జోసెఫ్ వర్కే

భారతీయ రాజకీయవేత్త


చుంకత్ జోసెఫ్ వర్కే, KSG (1891 – 1953), భారతీయ ప్రొఫెసరు, పాత్రికేయుడు, మద్రాస్ ప్రెసిడెన్సీలో విద్యా మంత్రి. [1] [2] [3]

జీవిత విశేషాలు

మార్చు

వర్కే 1891లో సైరో-మలబార్ క్యాథలిక్ కుటుంబంలో జన్మించాడు. అతను మంగళూరు లోని సెయింట్ అలోసియస్ కాలేజీలో ప్రొఫెసరుగా పనిచేసాడు. ఆల్ ఇండియా కాథలిక్ లీగ్‌కు (ఇప్పుడు ఆల్ ఇండియా కాథలిక్ యూనియన్‌) కార్యదర్శిగా కూడా పనిచేసాడు. 1937-42 కాలంలో మద్రాసు శాసనసభలో పశ్చిమ తీర భారతీయ క్రైస్తవ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించాడు. వర్క్జే, ది కాథలిక్ ఎడ్యుకేషనల్ రివ్యూ వ్యవస్థాపక-సంపాదకుడుగా కూడా పనిచేసాడు. సి. రాజగోపాలాచారి నేతృత్వంలోని భారత జాతీయ కాంగ్రెసు 1937 ఎన్నికలలో విజయం సాధించి మద్రాసు ప్రెసిడెన్సీలో అధికారాన్ని చేపట్టినపుడు, వర్కే విద్యాశాఖ కార్యదర్శి అయ్యాడు. 1939లో సుబ్బరాయన్ తర్వాత విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ సంవత్సరం కాంగ్రెసు మంత్రివర్గానికి రాజీనామా చేసే వరకు ఆయన ఆ పదవిలో ఉన్నాడు. పోప్ పియస్ XI అతన్ని నైట్ ఆఫ్ సెయింట్ గ్రెగోరీగా (KSG) నియమించాడు. [4] [5]

మూలాలు

మార్చు
  1. Burnand, Francis Cowley (1941). The Catholic who's who and yearbook. Vol. 34. Burns & Oates. p. 504.
  2. Farias, Kranti K (1999). The Christian impact in South Kanara. Church History Association of India. p. 274.
  3. The who's who in Madras: A pictorial who's who of distinguished personages, princes, zemindars and noblemen in the Madras Presidency, Issue 9. Pearl Press. 1940. p. 277.
  4. "Indian Papal Knight".
  5. Justice Party golden jubilee souvenir, 1968. Justice Party. 1968. p. 58. ISBN.