ఆగస్టు 6 1991న చుండూరు, ఆంధ్రప్రదేశ్ గ్రామంలో దళితులపై అగ్రకులస్తులు(రెడ్డి)చేసిన దాడి, హత్యాకాండలను చుండూరు ఘటనగానూ, చుండూరు హత్యాకాండగానూ అభివర్ణిస్తారు.[1][2]

హత్యాకాండ

మార్చు

1991 ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరు గ్రామంలో అగ్రవర్ణాల వారు దళితవాడపై దాడి చేసి, వేట కొడవళ్ళతో, గొడ్డళ్లతో, బరిసెలతో దళితులను వెంటాడి, వేటాడి చంపారు. ఆ మారణ కాండలో ఎనిమిది మంది దళితులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి, గోనెసంచుల్లో మూటగట్టి, రాళ్ళు కట్టి తుంగభద్రలో పడే శారు. ఇద్దరు అన్నదమ్ములను మల్లెతోటలోనే చంపి భూమిలో తొక్కేశారు. ఒకరిని సజీవంగానే సంచులలో కుక్కి కాలువలో పడేశారు.

న్యాయస్థానం తీర్పు

మార్చు

ఈ ఘోరంపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం కారణంగా ఏర్పాటైన ప్రత్యేక కోర్టు 16 ఏళ్ల సుదీర్ఘ విచారణ తదుపరి, 2007లో తీర్పును వెలువరించింది. ఇది అరుదైన వాటిలో కెల్లా అత్యంత అరుదైన కేసు కాదంటూ నిందితులకు మరణశిక్ష గాక, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ప్రత్యేక కోర్టు చేసిన ఈ వ్యాఖ్య నేరం తీవ్రతను తగ్గించేసింది.[3] ఏడేళ్ల తర్వాత ఏపీ హైకోర్టు ప్రాసిక్యూషన్ నేరాన్ని నిరూపించడంలో విఫలమైందంటూ నిందితులందరినీ విడుదల చేయాలని తీర్పు చెప్పింది. ఈ కేసులో 21 మంది నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాకుండా ఇదే కేసులో 35 మందికి విధించిన ఏడాది జైలు శిక్షను కూడా న్యాయస్థానం రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది.[4]

ఆ తీర్పు మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతోపాటు చుండూరు ఘటనలో మరణించినవారి బంధువులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు 2014 జూలై 30 నాడు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడంతోపాటు ఈ కేసులో నిందితులందరికీ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.[5][6]

ఇతర పఠనాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. Upper Caste Violence: Study of Chunduru Carnage - Economic and Political Weekly Vol. 26, No. 36 (Sep. 7, 1991), pp. 2079-2084
  2. "The Hindu : Andhra Pradesh News : Briefly". hindu.com. Archived from the original on 27 జూన్ 2014. Retrieved 11 April 2015.
  3. ఉరికంబానికీ ఉంది వివక్ష - మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు)
  4. చుండూరు ఊచకోత నిందితులకు శిక్ష రద్దు చేసిన హైకోర్టు!!మంగళవారం, 22 ఏప్రియల్ 2014
  5. చుండూరు కేసులో సుప్రీం కోర్టు స్టే, Jul 30, 2014
  6. "చుండూరు కేసులో సుప్రీంకోర్టు స్టే". Archived from the original on 2014-08-01. Retrieved 2016-05-20.

ఇతర లింకులు

మార్చు