చుక్కంబొట్ల రామ్మోహన్
చుక్కంబొట్ల రామ్మోహన్ తెలంగాణ రాష్ట్రనానికి చెందిన ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు. ఆయన విప్లవ రచయితల సంఘం మాజీ కార్యవర్గ సభ్యుడు.
చుక్కంబొట్ల రామ్మోహన్ | |
---|---|
జననం | 1948 |
వృత్తి | ఉపాధ్యాయుడు, ఉద్యమకారుడు |
జీవిత భాగస్వామి | భారతి |
పిల్లలు | హరిప్రసాద్, సుజన్‌కుమార్, శ్రీకాంత్ |
తల్లిదండ్రులు | చుక్కంబొట్ల కృష్ణయ్య, సుభద్రమ్మ[1] |
జననం, విద్యాభాస్యం
మార్చురామ్మోహన్ 1948లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని (ప్రస్తుత వనపర్తి జిల్లా), పాన్‌గల్ మండలం, గోపాల్‌పేట సంస్థానంలోని మఖ్త గ్రామం కదిరెపాడులో చుక్కంబొట్ల కృష్ణయ్య, సుభద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పాఠశాల విద్యాభ్యాసమంతా వనపర్తి, కొల్లాపూర్, మహబూబ్‌నగర్‌లలో పూర్తి చేశాడు.
వృత్తి జీవితం
మార్చురామ్మోహన్ 1969లో ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా వృత్తి జీవితం ప్రారంభించి అనంతరం పదోన్నతితో మెదక్ జూనియర్ కళాశాలకు బదిలీ తరువాత హైదరాబాద్ నగరంలోని సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుడిగా పని చేసి 2006 జూన్‌లో ఉద్యోగానికి పదవీ విరమణ చేశాడు.
మరణం
మార్చుచుక్కంబొట్ల రామ్మోహన్ 2022 మార్చి 9న హైదరాబాద్, వనస్థలిపురం, సత్యసాగర్ కాలనీలోని ఆయన స్వగృహంలో మరణించాడు. ఆయనకు భార్య భారతీ (2003లో క్యాన్సర్‌తో మరణించింది), హరిప్రసాద్, సుజన్‌కుమార్, శ్రీకాంత్ ముగ్గురు కుమారులు ఉన్నారు.[2][3][4]
మూలాలు
మార్చు- ↑ Andhra Jyothy (10 March 2022). "పాలమూరు 'మానవతా పతాక'". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Andhra Jyothy (10 March 2022). "విరసం నేత రామ్మోహన్ కన్నుమూత". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ 6tvnews (9 March 2022). "విరసం నేత రాంమోహన్ సార్ ఇక లేరు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (8 March 2022). "ఉద్యమాల ఉపాధ్యాయుడు.. రామ్మోహన్ ఇక లేరు". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.