చూపుడు వేలు, మానవుని చేతి వేళ్ళలో రెండవది. ఇది బొటన వేలుకూ, మధ్య వేలుకూ మధ్య ఉంటుంది. చేతి వేళ్ళన్నిటి లోకీ ఈ వేలు అత్యంత దక్షత, కుశలత కలిగినది, సున్నితమైనదీ. అయితే ఇది అన్నిటికంటే పొడవైనదేమీ కాదు; మధ్య వేలు కంటే పొట్టిగా ఉంటుంది, ఉంగరపు వేలు కంటే పొట్టిగా గానీ పొడవుగా గానీ ఉండవచ్చు. దీన్ని జుట్టనవేలు, జుత్తనవేలు, తర్జని, ప్రదేశిని, మెండీడు అని కూడా అంటారు.

చూపుడు వేలు
చూపుడు వేలు తెరచి ఉన్న మానవ ఎడమచేయి
వివరములు
చూపుడు వేలి రేడియల్ ధమని,
అరచేతిలో వేళ్ళ ధమనులు,
అరచేతి వెనుక వైపున వేళ్ళ ధమనులు
అరచేతి వేళ్ళ సిరలు, అరచేతి వెనుక వైపున వేళ్ళ సిరలు
Dorsal digital nerves of radial nerve, proper palmar digital nerves of median nerve
Identifiers
TAA01.1.00.054
FMA24946
Anatomical terminology

"చూపుడు వేలు" అంటే చూపించడానికి వాడే వేలు. మానవ శరీర నిర్మాణ పరంగా అది రెండవ వేలు.

చూపుడు వేలికి రెండు మూడు కణుపులు ఉంటాయి. దీనిలో కండరాలు ఉండవు. కానీ ఎముకలలో ఉండే స్నాయువుల ద్వారా చేతి కండరాలు దాన్ని నియంత్రిస్తాయి.

ఉపయోగాలు

మార్చు
 
ఒక వ్యక్తి వాదన సమయంలో స్త్రీని చూపుతున్నాడు

చూపుడూ వేలును ఒక్కదాన్నే తెరిచి పట్టుకుని ఒకటి అంకెను సూచించడానికి ఉపయోగిస్తారు. ఇలా చూపుడు వేలిని తెరిచి పట్టుకోవడం హెచ్చరికను, బెదిరింపునూ కూడా సూచించవచ్చు. ఈ సందర్భంలో దాన్ని తర్జని అని అంటారు. ఇలా చూఫుడు వేలిని ఒక్కదాన్నే తెరిచి అటూ ఇటూ ఆడించడం (వేలిని మాత్రమే ఊపడం) కూడా బెదిరించడానికి సూచిక.

చూపించడం

మార్చు

చూపుడు వేలితో ఓ వస్తువునో, వ్యక్తినో, స్థలాన్నో పదార్థాన్నో సూచించడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించవచ్చు.[1]

ఒక సంవత్సరం వయసున్న పిల్లలు, ఆసక్తి, కోరిక, సమాచారంతో వంటి ఒక మాదిరి సంక్లిష్టమైన ఆలోచనలను తెలియపరచడానికి వేళ్ళతో సూచించడం ప్రారంభిస్తారు. మానవ శిశువులు ఇలా సూచించడం మనస్సు సిద్ధాంతాన్ని, ఇతర వ్యక్తులు ఏమి ఆలోచిస్తున్నారో అర్థం చేసుకోగల సామర్థ్యాన్నీ చూపిస్తుంది. ఈ సంజ్ఞ మానవ భాష అభివృద్ధికి ఒక ఆధారం కావచ్చు.

మానవేతర ప్రైమేట్లకు, ఇతరులు ఏమి ఆలోచిస్తున్నారనే దాని గురించి తమ ఆలోచనలను రూపొందించుకునే సామర్థ్యం లేదు కాబట్టి, వేళ్ళతో చూపడాన్ని చాలా తక్కువ సంక్లిష్టంగా మాత్రమే ఉపయోగిస్తాయి.[2] అయితే, కార్విడ్‌లు, కుక్కలు, ఏనుగులు వేలు చూపడాన్ని అర్థం చేసుకుంటాయి.

కొన్ని సంస్కృతులలో, ప్రత్యేకించి ఆగ్నేయాసియాలోని మలయ్‌లు, జావానీయులు [3] చూపుడు వేలును ఉపయోగించి చూపడాన్ని అసభ్యంగా పరిగణిస్తారు. దానికి బదులుగా బొటనవేలును ఉపయోగిస్తారు.

భారతదేశంలో

మార్చు

భారతీయ సంస్కృతిలో చూపుడు వేలిని, బొటన వేలినీ కలిపి మిగతావేళ్ళను తెరిచి పట్టుకోవడాన్ని జ్ఞానానికి, ఉపదేశానికి, గురువుకూ గుర్తుగా సూచిస్తారు. హిందూమతంలో, యోగాభ్యాసాల్లో, భారతీయ శాస్త్రీయ నృత్యరీతుల్లో దీన్ని చిన్ముద్ర అంటారు.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Gary Imai. "Gestures: Body Language and Nonverbal Communication" (PDF). Archived from the original (PDF) on March 31, 2010. Retrieved 12 November 2009.
  2. Day, Nicholas (26 March 2013). "Research on babies and pointing reveals the action's importance". Slate. Retrieved 25 April 2013.
  3. Scott, David Clark (12 April 1990). "A Thumb Points the Way in Java". The Christian Science Monitor. ...figures in some reliefs can be seen pointing - with their thumbs. 'Pointing with the index finger is a terrible thing to do. It means death or violence. People used their thumb for polite pointing and it's still the same today,' notes Jan Fontein, curator of the exhibition of ancient Indonesian sculpture sponsored by Mobil Indonesia...