బొటన వేలు
బొటనవేలు చేతి వేళ్ళలో మొదటిది. ఇది చూపుడు వేలు పక్కన ఉంటుంది. [A] మనిషి నిలబడి ఉన్నప్పుడు (ఈ స్థితిలో అరచేయి ముందు వైపుకు ఉంటుంది), బొటనవేలు బయటికి ఉంటుంది. వైద్య పరిభాషలో బొటనవేలును పోలెక్స్ (కాలి బొటనవేలును హేలక్స్ అంటారు).
బొటన వేలు | |
---|---|
వివరములు | |
ప్రిన్సెప్స్ పోలిసిస్ ఆర్టెరీ | |
చేతి వెనుక భాగంలో సిరల అమరిక | |
రేడియల్ నరానికి చెందిన అరచేతి వెనుకభాగం లోని వేళ్ళ నరాలు, మీడియన్ నరానికి చెందిన అరచేతిలోని వేళ్ళ నరాలు | |
Infraclavicular lymph nodes[1] | |
Identifiers | |
TA | A01.1.00.053 |
FMA | 24938 |
Anatomical terminology |
ఎదురుబొదురుగా, పక్కపక్కనే
మార్చుమానవ శరీర నిర్మాణ శాస్త్రంపై దృష్టి సారించిన శరీర నిర్మాణ శాస్త్రజ్ఞులు, ఇతర పరిశోధకులు అభిముఖత్వానికి (బొటన వేలు మిగతా వేళ్ళకు ఎదురుబొదురుగా ఉండగలగడం) వందలాది నిర్వచనాలు ఇచ్చారు.[2] కొంతమంది శరీర నిర్మాణ శాస్త్రజ్ఞులు[3] బొటనవేలు, చిటికెన వేలును తాకడాన్ని అప్పోజిషన్ (అభిముఖత్వం) అంటారు. బొటనవేలు, మిగిలిన ఇతర వేళ్లకు ఆనుకోవడాన్ని యపోజిషన్ అంటారు. ఈ రెండు చలనాలను నియంత్రించే కడరాలకు శరీర నిర్మాణ శాస్త్రజ్ఞులు అపోనెన్స్ పోలీసిస్ అని అపోనెన్స్ డిజిటి మినిమి అనీ పేర్లు పెట్టారు).
ఇతర పరిశోధకులు మరొక నిర్వచనాన్ని ఉపయోగిస్తారు, [2] అప్పోజిషన్-యప్పోజిషన్‌లను ప్లెక్షన్-ఎబ్డక్షన్, ఎక్స్టెన్షన్-అడక్షన్ ల మధ్య ప్రస్థానంగా సూచిస్తారు.
ఒక అవయవాన్ని దాని తటస్థ స్థానానికి తిరిగి తరలించడాన్ని రీపోజిషన్ అంటారు. ఒక భ్రమణ కదలికను ప్రదక్షిణగా సూచిస్తారు.
ప్రైమాటాలజిస్టులు, చేతి పరిశోధనలో మార్గదర్శకులూ అయిన జాన్ నేపియర్, ప్రూడెన్స్ నేపియర్ లు అభిముఖత్వాన్ని ఇలా నిర్వచించారు: "బొటనవేలు గుజ్జు ఉపరితలాన్ని మిగతావేళ్ళ దూరపు ఎముకలకు పూర్తిగా ఆనుకుని గానీ – లేదా పూర్తిగా వ్యతిరేకంగా గానీ – ఉంచగలగడం". అంటే, వేలూ వేలూ ఎదురుబొదురుగా ఉండాలంటే, బొటనవేలు దాని పొడవైన అక్షం చుట్టూ తిరగ గలగాలి.[4] మానవ బొటన వేలికి ఉన్న విశిష్టతను ఈ నిర్వచనం వివరిస్తుంది.
ఇతర ప్రైమేట్లలో
మార్చు- బొటనవేలి అమరికను బట్టి ప్రైమేట్లలో ఆరు రకాలున్నాయి: [6]
- బొటన వేళ్ళు లేనివి: స్పైడర్ మంకీ, కోలోబస్
- ఎదురుబొదురు కాలేని బొటనవేళ్లు: టార్సియర్‌లు (ఇవి ఆగ్నేయాసియా దీవుల్లో కనిపిస్తాయి), మార్మోసెట్‌లు (ఇవి కొత్త ప్రపంచపు కోతులు)
- మిధ్యా-ఎదురుబొదురు బొటనవేళ్లు: అన్ని స్ట్రెప్‌సిర్రైన్‌లు (లెమర్స్, పోటోస్, లోరైసెస్), సెబిడే (కాపుచిన్, స్క్విరెల్ కోతులు, ఇవి కొత్త ప్రపంచపు కోతులు )
- ఎదురుబొదురు బొటనవేళ్లు: కోలోబస్ మినహా పాత ప్రపంచ కోతులు (సిర్కోపిథెసిడే), గొప్ప కోతులన్నీ
- పొడవైన ఎదురుబొదురు బొటనవేళ్ళు: గిబ్బన్‌లు (లేదా చిన్న కోతులు)
- ఇంకా వర్గీకరణ కానివి: ఇతర కొత్త ప్రపంచపు కోతులు (టామరిన్స్, అయోటిడే: నైట్ లేదా గుడ్లగూబ కోతులు, పిథెసిడే: టైటిస్, సాకిస్, ఉకారిస్, అటెలిడే: హౌలర్, ఉన్ని కోతులు)
వైవిధ్యాలు
మార్చుమానవ బొటనవేలు థంబ్స్-అప్ సంజ్ఞలో ఉన్నప్పుడు మొదటి, రెండవ (దగ్గరి, దూరపు) ఎముకల మధ్య కోణం 0° కూ, దాదాపు 90° కూ మధ్య మారుతూ ఉంటుంది.[7]
వైవిధ్యం అనేది ఆటోసోమల్ రిసెసివ్ లక్షణం, దీనిని హిచ్‌హైకర్స్ థంబ్ అని పిలుస్తారు. హోమోజైగస్ క్యారియర్‌లలో ఇది 90° కి దగ్గరగా ఉంటుంది.[8] ఏది అయితే, బొటనవేలు కోణం నిరంతరం మారుతూ ఉంటుంది కాబట్టి ఈ సిద్ధాంతం వివాదాస్పదమైంది.[7]
బొటన వేలికి ఉండే ఇతర వైవిధ్యాలు: బ్రాచైడాక్టిలీ టైప్ D (పుట్టుకతోటే బొటనవేలి దూరపు ఎముక పొట్టిగా ఉంటుంది), త్రిఫలాంజియల్ బొటనవేలు (అంటే బొటనవేలికి రెండు బదులు మూడు ఎముకలు ఉంటాయి), పాలీసిండాక్టిలీ (ఆరవ వేలు (పాలీడాక్టిలీ), వేళ్ళు కలిసిపోయి ఉండడం (సిండాక్టిలీ) ఈ రెండూ ఉండే స్థితి).
పట్టులు
మార్చుచేతి పట్టుపై జాన్ నేపియర్ పరిశోధన చేసాడు. చేతి కదలికలకు సంబంధించిన శరీర నిర్మాణ శాస్త్ర ప్రాతిపదికపై ఆధారపడి నేపియర్ రెండు ప్రాథమిక ప్రిహెన్సిల్ పట్టులను ప్రతిపాదించాడు: బిగువైన పట్టు, ఖచ్చితత్వపు పట్టు.[9][10] పట్టులో బొటనవేలు, ఇతర వేళ్ల స్థానాలను బట్టి వాటిని ఇకా నిర్వచించవచ్చు:
- బిగువైన పట్టు అంటే బొటనవేలుతో ఒక వస్తువుపై వేళ్లు (కొన్నిసార్లు అరచేతిని కూడా) బిగించి వత్తిడిని కలిగించడం. బిగువైన పట్టుకు ఉదాహరణలు సుత్తిని పట్టుకోవడం, అరచేతిని వేళ్లనూ రెంటినీ ఉపయోగించి కూజాను తెరవడం, పుల్‌అప్ వ్యాయామం చెయ్యడం.
- వేళ్ళ కొసలు, బొటనవేలు ఒకదానికొకటి నొక్కినప్పుడు ఖచ్చితత్వపు పట్టు అంటారు. ఖచ్చితమైన పట్టుకు ఉదాహరణలు - పెన్సిల్‌తో రాయడం, చేతివేళ్లతో మాత్రమే సీసా మూతను తెరవడం, అరచేతికి తగలకుండా బంతిని పట్టుకోవడం.
బొటనవేలు ఎదురుబొదురుగా ఉండడానికీ, ఖచ్చితమైన పట్టుకూ సంబంధం అంతగా లేదు. కొన్ని జంతువుల్లో పాక్షికంగా-ఎదురుబొదురు బొటనవేళ్ళు ఉన్నప్పటికీ వాటికి ఖచ్చితత్వపు పట్టు ఉంటుంది (ఉదాహరణకు టఫ్టెడ్ కాపుచిన్స్ ). [11] అయితే, ఖచ్చితమైన పట్టులు సాధారణంగా పెద్ద కోతులలో మాత్రమే కనిపిస్తాయి. ఈ విషయంలో మానవులకు ఉన్న సామర్థ్యం కంటే వీటి సామర్థ్యం గణనీయంగా తక్కువగా ఉంటుంది.[12]
మానవ పరిణామం
మార్చుమానవులలో పూర్తిగా ఎదురుబొదురుగా ఉండే బొటనవేలు పరిణామం సాధారణంగా హోమో సేపియన్స్‌కు ముందున్న హోమో హబిలిస్‌తో ముడిపడి ఉంది.[13] అయితే, ఇది హోమో ఎరెక్టస్ (సుమారు 10 లక్షల సంవత్సరాల క్రితం) నుండి వివిధ మధ్యంతర దశలలో పరిణామం చెందుతూ వచ్చింది.
ఆధునిక మానవుల ముంజేయి, చేతి కండరాలు ప్రత్యేకమైనవి. అయినప్పటికీ, అవి ఆటాపోమార్ఫిక్‌గా ఉంటాయి, అంటే ప్రతి కండరం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ మానవేతర ప్రైమేట్లలో కనిపిస్తుంది. ఎక్స్‌టెన్సర్ పోలిసిస్ బ్రీవిస్, ఫ్లెక్సర్ పోలిసిస్ లాంగస్ ల వలన ఆధునిక మానవుల బొటనవేలికి గొప్ప నైపుణ్యాలు, బలమూ ఉంటాయి.
ఇవి కూడా చూడండి
మార్చుగమనికలు
మార్చు- ↑ In some countries and cultures, the thumb is considered a finger. Elsewhere, it is considered a 'digit' due to the few features it has in difference with the other four digits, such as the larger gap, missing phalanx and horizontal curling movement.
మూలాలు
మార్చు- ↑ మూస:NormanAnatomy
- ↑ 2.0 2.1 van Nierop et al. 2008
- ↑ Brown et al. 2004
- ↑ "Primates FAQ: Do any primates have opposable thumbs?". Wisconsin Regional Primate Research Center. Retrieved 20 November 2010.
- ↑ "The Thumb is the Hero". The New York Times. January 11, 1981. Retrieved 20 November 2010.
The "fishing rod" a chimp strips of leaves and pokes into a termite nest to bring up a snack is as far as he'll ever get toward orbiting the planets.
- ↑ Ankel-Simons 2007
- ↑ 7.0 7.1 "Myth's of Human Genetics: Hitchhiker's Thumb". Retrieved 7 November 2012.
- ↑ "Thumb, Distal Hyperextensibility of". OMIM. NCBI. Retrieved 5 February 2010.
- ↑ Slocum & Pratt 1946 , McBride 1942
- ↑ Napier 1956
- ↑ Costello & Fragaszy 1988
- ↑ Young 2003 , Christel, Kitzel & Niemitz 2004 , Byrne & Byrne 1993
- ↑ Leakey, Tobias & Napier 1964 : "[In Homo habilis] the pollex is well developed and fully opposable and the hand is capable not only of a power grip but of, at least, a simple and usually well developed precision grip."