పిండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పిండి, పొడి లేదా చూర్ణం ఆహారధాన్యాల నుండి తయారుచేసే మెత్తని పదార్ధము. ఇది ప్రపంచంలోకెల్లా ప్రధాన ఆహారమైన రొట్టికి మూలం. అమెరికా, ఐరోపా ఖండాలలో గోధుమ పిండి ముఖ్యమైనది. జొన్న పిండి ప్రాచీనమైన మెసపుటోమియా, లాటిన్ అమెరికా సంస్కృతులలో ముఖ్యమైనది. ఈ ధాన్యాలను మిల్లు లేదా పిండి మరలో ఆడించి పిండిగా చేస్తారు. కొన్నింటిలో పొట్టును వేరుచేయాల్సి ఉంటుంది.
పిండి చేసిన గింజలలో ముఖ్యంగా పిండి పదార్ధాలు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు లేదా పాలీసాకరైడ్లు వీనిలో ప్రధానమైనవి.
భాషా విశేషాలు
మార్చుపిండి [ piṇḍi ] pinḍi. తెలుగు n. Flour. బియ్యములోనగు వాని పొడి. సంస్కృతం n. A multitude. సమూహము. వెన్నెల పిండి ఆరపోసినట్టుగా నున్నది there is bright moonlight. తెలికపిండి a residue of sesamum seeds after the oil is extracted, oil-cake. ఈ మాట పిండికిని పడును పిడుగుకును పడును this is equivocal, it is neither chalk nor cheese. పిండిబలపము a whitish kind of slate stone. పిండిరాయి a soft kind of stone; also a mica or slate. బలపము, పిండి మిరియము a sauce made of herbs and chillies mixed with rice flour. పేలపిండి flour of parched grain. పిండికూర or పిండిబొద్దికూర pinḍi-kūra. n. A kind of vegetable. పిండిదొండ pinḍi-donḍa. n. The herb called Acrua lanata. (Watts.) H. iv. 12. పిండివంటలు pinḍi-vanṭalu. n. Pastry, cakes.
పిండిలో రకాలు
మార్చు- గోధుమ పిండి :
- మైదా పిండి
- వరి పిండి :
- శెనగ పిండి :
- నువ్వు పిండి :
- కంది పొడి
- నువ్వుల పొడి
- కారం పొడి
పిండి ఉపయోగాలు
మార్చు- ప్రతి రోజూ మనం తినే రొట్టెలు, చపాతీ, పూరీ, పరాఠా మొదలైనవి చేసుకోవాలంటే గోధుమ పిండి అవసరం.
- రకరకాల అట్లు లేదా దోసెలు కొన్నింటికి మూలమైనది పిండి. కొన్ని అట్లు ఒకటి కంటే ఎక్కువ పిండి రకాలు కలిపి చేస్తారు.
- పిండి వంటలు అన్నింటికి పిండి ఒక మూల పదార్థం.
- కొన్ని రకాల పొడుల్ని మసాలా దినుసులతో ఉప్పు, కారం కలిపి ఉపాహారంగా నంచుకోవడానికి వాడుతాము. నువ్వుల పొడి, కంది పొడి, మొదలైనవి.
తయారుచేయు విధానం
మార్చు- ముందుగా పిండి చేయాల్సిన ఆహార ధాన్యాల్ని కావలసినన్నింటిని తడి లేకుండా ఎండబెట్టాలి. రాళ్ళు లేకుండా ఏరుకోవాలి. కొన్నింటిని ముందుగా కడగవలసి వుంటుంది.
- రోలు, రోకలి ఉపయోగించి దంచుకొని, మధ్య మధ్యలో పిండి జల్లెడతో జల్లించి పిండిని, నూకల్ని వేరుచేసుకోవచ్చును. ఇలా మళ్ళీ మళ్ళీ దంచుకొంటుంటే మొత్తం గింజలన్నీ పిండిగా మారిపోతాయి. కొద్దిగా మిగిలిపోవచ్చును.
- ఈ ఆధునిక కాలంలో పిండి మరలో కావలసిన వాటిని శుభ్రం చేసుకున్న తర్వాత క్షణాల్లో పిండిగా మార్చవచ్చును.
- కొన్ని సందర్భాలలో పిండి నుండి పొట్టును వేరుచేయడానికి సన్నని జల్లెడ పట్టించాల్సి వస్తుంది.