చెంగల్వ కాళయ

తెలుగు కవి

చెంగల్వ కాళయ లేదా చెంగల్వ కాళకవి 17వ శతాబ్దానికి చెందిన తెలుగు కవి. ఈతడు విజయ రాఘవ నాయకుని ఆస్థాన కవి పండితుడు. ఈతని ప్రసిద్ధ రచన రాజగోపాలవిలాసము. దీనిని విజయరాఘవనాయకుని కంకితముగా ఇచ్చెను.[1]

రచనలు

మార్చు

రాజగోపాలవిలాసము

మార్చు

ఈకవి రచించిన రాజగోపాలవిలాసము కావ్యములో కాళకవి తన వంశానికి చెందిన వివరాలను తెలియజేశారు.

సీ.⁠
శ్రీవత్సగోత్రుండు శ్రీకర పాకనా
                 టార్వేల బంధుజనాతీశాయి
కాళియ మంత్రిపుంగవునకు గంగమాం
                 బకు నుదయించు తపఃఫలంబు
రణరంగగంధవారణ బిరుదాంకిత
                 స్వకులజ శ్రీకంఠ సచివమౌళి
పార్వతీపరిణయ ప్రముఖప్రబంధని
                 బంధధురంధరప్రౌఢఫణితి

⁠గీ.⁠
యైన చెంగల్వ వేంకటయ్యయును రావి
నూతల తిరుమలయ్య తనూజ కృష్ణ
మాంబ మును గన్ననిధి కాళహస్తి గిరిశ
కలితలలితోక్తి భారవి కాళసుకవి

పై పద్యమువలన నితడు పాకనాటి యా త్వేల ని యో గి బ్రహ్మణుండనియు, వీరి తాత కాళయమంత్రి అనియు, నాన్నమ్మ గంగమాంబ యనియు, అతని తల్లి దండ్రులు కృష్ణమాంబ, వెంకటయ్య అనియు తెలియుచున్నది. ఇతని తండ్రి వెంకటయ్య రణరంగ గంధ వారణ బిరుదాంకితుడనియు, పార్వతీపరిణయమనే గ్రంథ కర్త అయియు తెలియు చున్నది. అతను శ్రీకంఠునకు మంత్రి అయియు తెలియు చున్నది.

ఈ కవి తల్లి రావినూతల తిరుమలయ్య కుమార్తె అనియు తెలియుచున్నది.

మూలాలు

మార్చు
  1. చెంగల్వ కాలకవి, ఎన్ వెంకట రావు (1951). రాజగోపాల విలాసము.