విజయరాఘవ నాయకుడు

విజయరాఘవ నాయకుడు (సా.శ.1633-1673 లో) తంజావూరు రాజ్య పాలకూడయ్యెను .ఇతడును తండ్రివలే స్వయముగా కవి. కవి పండిత పోషకుడు,[1] రసికాగ్రగణ్యుడును.ఇతని సభామందిరం విజయరాఘవ విలాసం. ఇతడును సంగీత నాట్య కళాప్రియుడు. ఇతని ఆస్థానంలో నాట్యకతైలు కేళికలు, పదాలు, దరువులు, పేరణులు మొదలగు అనేక నాట్య విశేషాలను అభినయించేడివారు[2]. జోల, సువ్వాల, ధవళ పదాలు, ఏలలు మొదలగునవియు గానం చేయబడుచుండెడివి.అనేకములగు యక్షగానాలు  ప్రదర్శింప బడుచుండెడివి.విజయరాఘవుడును, ఇతని కవులను  పెక్కు యక్షగానాలను రచించిరి .పదకవితాపితామహుడు  క్షేత్రయ్య ఇతని ఆస్థానంనకు వచ్చి పదరచన చేసి కొన్నింటిని ఈ విజయరాఘవునికి అంకితమిచ్చాడు. రంగాజమ్మ, కామరసు, వేంకటపతి, సోమయాజి, చంద్ర రేఖ, కృష్ణాజీ, చెంగల్వ కాళకవి ఇతని ఆస్థానకవులు.

బిరుదులు

మార్చు

మన్నారు దాసుడు, చతుర్విధ కవితా నిర్వాహక సార్వభౌముడు అన్నవి ఇతని బిరుదులు.

రచనలు

మార్చు

విజయరాఘవ నాయకుడు బహు గ్రంథకర్త . ఇతని రచనలు:

  1. రాజగోపాల విలాసము,
  2. చెంగమల వల్లీ పరిణయము,
  3. గోవర్ధనోద్దరణము,
  4. రతి మన్మథ విలాసము,
  5. రాస క్రీడ,
  6. నవనీతచోరము,
  7. పారిజాతాపహరణము,
  8. రుక్మిణీ కళ్యాణము,
  9. రాధామాధవ వివాదము,
  10. ధనాభిరామము,
  11. సత్యభామా వివాహము,
  12. ఉషాపరిణయము,
  13. కాళియమర్థనము,
  14. రఘునాథాభ్యుదయము,
  15. ప్రహ్లాద చరిత్ర,
  16. పూతనాహరణము,
  17. విప్లనారాయణ చరిత్ర,
  18. సముద్రమథనము,
  19. కృష్ణవిలాసము,
  20. ప్రణయ కలహాము,
  21. కంస విజయము,
  22. జానకి కళ్యాణము,
  23. పుణ్యక  వత్రము.

అను ఇరువది మూడు యక్షగానాలను, రఘునాథ నాయకాభ్యుదయం, మోహినీ  విలాసం, పాదుకా సహస్రం  అను మూడు ద్విపదకావ్యములను, గోపికా గీతలు, భ్రమర గీతలు అను ఆంధ్రానువాదాలను, ఫల్గుణోత్సవం అను రగడలు, చౌపదాలతో కూడిన గ్రంథంను, రాజగోపాల దండకంను, వీర శృంగార సాంగత్యం, సంపంగిమన్నారు సాంగత్యం అను కావ్యాలను, వీనితోపాటు వేడికోళ్ళు, విన్నపములు, దరువులు, ఏలలు, సుకీర్తనములు మొదలగు వానిని రచించెను .దీనినిబట్టి చూడగా విజయరాఘవుడు సామాజ్ర్యమునేకొక  కవితా సామ్రాజ్యమును కూడా ఏకచ్ఛత్రాధిపత్యముగా ఏలినట్లు గమనింపగలము. ఈ రచనలలో కాళియమర్థనము, ప్రహ్లాదచరిత్రము, పూతనాహరణము. విప్లనారాయణ చరిత్రము, రఘునాథ  నాయకాభ్యుదయము, రఘునాథాభ్యుదయములు  మాత్రమే లభించుచున్నవి. ఇతడును ఎనిమిది భాషలందు  పండితుడు .ఇతని  సాహితీ సార్వభౌమత్యమునకు  చిహ్నముగా పాదమునకు రాయపెండారము అలంకరింపబడి  ఉండినదని కాళకవి రాజగోపాల విలాసమును బట్టి  తెలిసికొనవచ్చును . ఇతని సభలో శారదాధ్వజము  “ చామరానిల కందళ చరితమగును” ఒప్పుచుండెడిదట.విజయరాఘవుని రెండు మూడు కృతులను సంగ్రహముగ పరిచయము కావించుకొందము.

కాళియ మర్థనం

మార్చు

కాళియ మర్థనము: ఇందలికథ భాగవతమున ప్రసిద్ధిము, గోభిలుడు, గోప్రళయుడు  అను ఇద్దరు మునులు విజయరాఘవుని ఇలవేల్పాయిన రాజగోపాలస్వామిని కాళిందీ నాట్యమును చూడ కూతూహలముగా ఉన్నవాని ప్రార్థింపగా . ఆ రాజగోపాలుడు బాలకృష్ణుడై  కాలిందీతటమున నాట్యముచేసి కాళియ సర్పమును మర్ధించుట – ఇతడు నగరమునకు తిరిగివచ్చిన తరువాత సఖీజనము నీరాజనాదులను అర్పించి సత్కరించుట, కొలువుతీరుట ఇందలి కథ.    

ప్రహ్లాద చరిత్ర

మార్చు

ప్రహ్లాద చరిత్ర : భాగవతమున ప్రసద్దిమయిన కథను స్వతంత్రమగు యక్షగానముగా విజయరాఘవుడు రచించెను .ఇందు హాస్యము మెండు.పాత్రలకు తగిన భాష ఉపయోగింపబడినది .ఇందలి ఆస్థాన సంతోషి విదూషకుని పాత్రవంటిది. ఇతనికి సంభాషణలు ఉండవు.కానీ ఇష్టమువచ్చినపుడు హాస్యముగా మాటలాడవచ్చును .

         “సలాము సలామయా దానవలామ!” అని అన్యాభాషాపదములు కూడా ఇందు ప్రయోగింపబడినవి.

         పూతనాహరణము: ఇదికూడ భాగవతప్రసిద్దము, అయినను స్వతంత్రమగురీతిని యక్షగానముగ రచించెను. ఇందు ఆనాటి పౌరోహిత్యము, ఇతర సమకాలీన విషయములు సున్నితముగా వివరింపబడినవి.

విప్రనారాయణ చరిత్ర : ఇది వైష్ణవ భక్తుని కథ. పండెండ్రుమంది ఆళ్వారులలో విప్రనారాయణుడు ఒకడు. ఇతనిని తొండరడిప్పొడి ఆళ్వారు అనికూడా అందరు . ఇతని చరిత్ర మును పూర్వము చదలవాడ మల్లన్న. సారంగుతమ్మయ్యలు ప్రబుతములుగా రచించరి . విజయరాఘవనాయకుడు దీనిని యక్షగానముగా తీర్చిదిద్దేను . ఈ విప్రనారాయణ కథ విజయరాఘవుని  కాలములోనే గుడిలోనే  జరిగినట్లును, చోళరాజే విజయరాఘవుడుగ అవతరించినట్లును కల్పింపబడినది . ఈ యక్షగానమండలి విశేషము చూర్ణిక.సమాసములులేని చిన్ని చిన్ని పదములతో కూడిన వచనరచననే చూర్ణిక అంటారు .ఈ యక్షగానమున ఇది సంస్కృత భాషలో సంభాషనారూపముగ ప్రయోగింపబడింది.ఈ యక్షగానమున తెలుగు సంస్కృతములేకాక తమిళము కన్నడము కూడా ప్రయోగింపబడినది . ఈనాటి వచనగీతములవంటి మాటలు కూడా ఉన్నాయి.

                                     “ మీతో మాకేటి  మాటలు

                                       వినబ్రాతిగాడు మీ పాటలు

                                       భవనంబులు పర్ణశాలలు

                                       మా పాటలు హరిమీద ఏలలు “      

ఈ విధముగ నూతన ప్రక్రియగా ఈ కావ్యము రూపుదిద్దుకొనినది.

రఘునాథాభ్యుదయము: ఇది విజయరాఘవునిచే యక్షగానముగాను ద్విపదకావ్యముగాను రచించబడినది .రెండింటియందును కథ సమానమే.ఇతని తండ్రి రచించిన అచ్యుతాభ్యుదయమువలే  ఈ కావ్యమున దినచర్య, కొలువు దీరుట మొదలగు రఘునాథుని విషయములు ఇందు వర్ణింపబడినవి .ఈ యక్షగానమున రామభద్రాంబ మధురవానుల ఆశుకవితా విశేషములు వర్ణింపబడినవి .

విజయరాఘవుని ఆస్థానములో చెంగల్వకాళకవి, కామరసు  వేంకటపతి, కోనేటి దీక్షితకవి, పురుషోత్తమ దీక్షితుడు మొదలగునవి  కవులతోపాటు పసుపులేటి రంగాజమ్మ అను కవియిత్రి కూడా కలదు .[3]

మూలాలు

మార్చు
  1. "The Hindu : Entertainment Chennai / Heritage : The colourful world of the Nayaks". web.archive.org. 2007-12-06. Archived from the original on 2007-12-06. Retrieved 2021-10-09.
  2. Krishnaswami Aiyangar, Sakkottai (1919). Sources of Vijayanagar history. University of California Libraries. [Madras] : The University of Madras.
  3. "Vijaya Raghava Nayak", Wikipedia (in ఇంగ్లీష్), 2021-04-21, retrieved 2021-08-30