చెంగావి
చెంగావి ఒక గడ్డి రకము. ఇది పశువులకు పోషక సంవర్ధమైన శ్రేష్ఠమైన పశుగ్రాసముగా భావిస్తారు[1]. దీనినే వివిధ ప్రాంతాలలో చెంగలి, చెంగల, చెంగాలి అని కూడా పిలుస్తారు. మొక్క కొంచెము ఎరుపుగా ఉంటుంది. ఆకుల అంచుల్లో నూగు ఉంటుంది. ఎర్ర చెంగలి, గుడ్డి చెంగలి, దుబ్బ చెంగలి, నీరు చెంగలి ఇందులోని రకాలు.[2]
చెంగావి రంగు
మార్చుచెంగావి రంగు చీర తెలుగు సాహిత్యంలో ఎంత భాగమై పోయిందంటే అనేక సినిమా పాటలలో దీని ప్రస్తావన ఉంది. అందులో కొన్ని
- 1973 లో విడులైన బంగారు బాబు చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీల పై చిత్రీకరించిన చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది.
- 1979 లో విడులైన తూర్పు వెళ్లే రైలు చిత్రంలో ఆరుద్ర రచించిన చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మా అనే పాట
- చిరంజీవి చిత్రం ఘరానా మొగుడులోని బంగారు కోడి పెట్ట వచ్చెనండి, హె పాపా హె పాపా హె పాప, చెంగావి చీర గుట్టు చూసుకోండి.
- ఎస్వీ కృష్ణారెడ్డి యొక్క గన్ షాట్ చిత్రంలోని చెంగావి చీరలు పోయె...