చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం

చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం ప్రపంచంలోనే అతిపెద్దదైన గుర్రపు విగ్రహము. ఇది మంగోలియా దేశంలో ఉన్నది.

చెంఘీజ్ ఖాన్ గుర్రపు విగ్రహం
Genghis Khan Equestrian Statue
Чингис хааны морьт хөшөө
ప్రదేశంఎర్డేన్, టోవ్ ప్రోవిన్స్, మంగోలియా
రూపకర్తD. Erdembileg (Sculptor), J. Enkhjargal (architect)[1]
రకంగుర్రపు విగ్రహము
మెటీరియల్ (పదార్థం)ఉక్కు[2]
ఎత్తు40 metres (130 ft)
పూర్తయిన తేదీ2008
అంకితం చేయబడినదిచెంఘీజ్ ఖాన్

విశేషాలుసవరించు

 • దీనిని చూడ్డానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇది మంగోలియాలోని ఉలాన్ బాటర్ ప్రాంతంలో కొలువై ఉంది.
 • ప్రపంచంలోనే అతి ఎత్తయిన 'ఈక్వెస్త్ట్రెన్ స్టాట్యూ ' ఇదే. అంటే రౌతుతోఉన్న గుర్రమని అర్థం. దీనిపై మంగోలియాను పాలించిన ప్రముఖ చక్రవర్తి చెంగిస్ ఖాన్ పేద్ద విగ్రహం ఉంటుంది. చేతిలో బంగారు కొరడా మరింత ఆకర్షణీయంగా మిరుమిట్లు గొలుపుతుంది.
 • ఇది మామూలు విగ్రహాల్లా కాకుండా మరింత భిన్నంగా ఉంటుంది. బయటి నుంచి చూసి మురిసిపోవడమే కాదు, ఒక భవంతిపై నిర్మించిన ఈ గుర్రం కడుపులోకి ఎలివేటర్ సాయంతో వెళ్లి మొత్తం సరదాగా తిరిగేయొచ్చు.
 • ఈ విగ్రహం ఎంత ఎత్తు 40 మీటర్లు. అంటే 130 అడుగులకు పైనే. దాదాపు పదంతస్తుల భవనంతో సమానం అనుకోవచ్చు.
 • పూర్తిగా స్టెయిన్‌లెస్ స్టీలుతో తయారు చేసిన ఈ భారీ విగ్రహం నిర్మాణానికి 250 టన్నుల స్టీలు ఉపయోగించారు. అందుకే పగలు కన్నా రాత్రి విద్యుత్ దీపాలతో మరింత మెరిసిపోతూ కనిపిస్తుంది.
 • నిర్మాణానికి రెండేళ్లు పట్టింది. 2006లో పనులు మొదలైతే 2008లో పూర్తయ్యాయి.
 • చెంఘీజ్ ఖాన్ స్టాట్యూ కాంప్లెక్స్‌లో భాగంగా మంగోలియాకు చెందిన 'ది జెన్కో టూర్ బ్యూరో ' సంస్థ వాళ్లు దీనిని నిర్మించారు.
 • చుట్టూ దుకాణాలతో ఎప్పుడూ పర్యాటకుల సందడితో ఈ ప్రాంతమంతా కళకళలాడుతూ ఉంటుంది.
 • కొండపై విశాల స్థలంలో ఉండే ఈ విగ్రహం దగ్గరికి వెళ్లడానికి మెట్లు ఉంటాయి.

మూలాలుసవరించు

 1. The Chinggis Khan Statue Complex Mongolian National Tourism Organization
 2. [1] touristinfocenter

బయటి లంకెలుసవరించు