చెన్నకేశవాలయం (మాచెర్ల)

(చెన్నకేశవాలయం నుండి దారిమార్పు చెందింది)
మాచర్ల చెన్నకేశవాలయం

పల్నాటి ప్రజల కొంగుబంగారమైన మాచెర్ల చెన్నకేశవుని ఆలయనిర్మాణకాలంపై సంధిగ్ధత ఉంది. క్రీ.శ. 1111లో చాగి మొదటి జేతరాజు హయాంలో నిర్మించబడి, క్రీ.శ.1132 ప్రాంతంలో బ్రహ్మనాయనిచేత చెన్నకేశవాలయంగా మార్చబడినట్లు భావించబడుతోంది. గర్భాలయపు ఉత్తరపు గోడలో శైవాలయపు చిహ్నమైన పానవట్టం కన్పించడం విశేషం. ఆలయం ఎదురుగావున్నరంగమంటపం నాలుగు స్తంభాలపై రామాయణ, భారత, భాగవతాంశాలను రమణీయశిల్పాలుగా మలిచారు. దక్షిణంగా ఆదిత్యేశ్వరాలయం, దానికెదురుగా చారిత్రకమైన నాగస్థంబ శిలాశాసనం ఉన్నాయి. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పౌర్ణమినుండి ఆరు రోజులపాటు జరిగే తిరునాళ్ళకు భక్తులు అధికసంఖ్యలో హాజరవుతారు.

గమనిక: ఇక్కడున్న బొమ్మ ఒక '3డి'చిత్రం. దీనిని ఎడమవైపు ఎరుపు, కుడివైపు నీలం అద్దాల కళ్ళజోడుతో చూస్తే విశేషంగా వుంటుంది. అలంకరణకుపయోగించే పారదర్శక జిలుగు కాగితంతో ఇలాంటి కళ్ళజోడు తేలిగ్గా తయారుచేసుకోవచ్చు.

చెన్నుని రథోత్సవం
చెన్నకేశవాలయంలో విష్ణువు శిల్పం
రంగమంటపము యొక్క స్తంభముపై రావణవధ శిల్పచిత్రీకరణ