చెన్నారావుపేట మండలం

తెలంగాణ, వరంగల్ జిల్లా లోని మండలం


చెన్నారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాకు చెందిన మండలం[1] ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 42 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం నర్సంపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  11  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

చెన్నారావుపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, చెన్నారావుపేట స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, చెన్నారావుపేట స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, చెన్నారావుపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°52′59″N 79°52′13″E / 17.883026°N 79.870162°E / 17.883026; 79.870162
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం చెన్నారావుపేట
గ్రామాలు 14
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,013
 - పురుషులు 26,747
 - స్త్రీలు 26,266
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.25%
 - పురుషులు 57.25%
 - స్త్రీలు 30.81%
పిన్‌కోడ్ 506332

మండల జనాభా

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త వరంగల్ జిల్లా పటంలో మండల స్థానం

2011భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 53,013 - పురుషులు 26,747 - స్త్రీలు 26,266. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 100 చ.కి.మీ. కాగా, జనాభా 41,260. జనాభాలో పురుషులు 20,798 కాగా, స్త్రీల సంఖ్య 20,462. మండలంలో 10,715 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. లింగాపురం
  2. అక్కలచేడు
  3. కోనాపురం
  4. చెన్నారావుపేట
  5. ఉప్పరపల్లి
  6. జల్లి
  7. అమీనాబాద్
  8. లింగగిరి
  9. ఎల్లాయిగూడెం
  10. తిమ్మరాయునిపహాడ్
  11. పాపయ్యపేట

మూలాలు

మార్చు
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లింకులు

మార్చు