చెరువు గండి (నవల)

చెరువు గండి తెలుగు నవల. ఆనాటి రాయలసీమ గ్రామజీవన పరిస్థితులు నవలలో వాస్తవికంగా చిత్రించబడినవి. అనంతపురం మాండలిక పదాలు నవలలో పరిచయం చేయబడ్డాయి.[1]

వివరాలు మార్చు

ప్రొఫెసర్ వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఆచార్యుడుగా పనిచేసిన కాలంలో, ఆంధ్రదేశ గ్రామీణ సమాజాన్ని నిశితంగా అధ్యయనం చేశాడు. ఆ అనుభవం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కార్యక్రమాన్ని గ్రామగ్రామాన అమలు చేసినప్పటి అనుభవాల నేపథ్యంలో "చెరువు గండి" నవల రచించాడు.

నేపథ్యం మార్చు

గ్రామీణ దళితబాలిక ఎర్రమ్మ పదేళ్ల జీవితంతో నవల ఆరంభించి ఆమె వృద్ధాప్యం వరకు, భారతదేశం స్వతంత్రం ఆయిన నాటినుంచి, నక్షల్.బరి ఉద్యమం ముగిసేవరకు జరిగిన సంఘటనల నేపథ్యంలో, దళిత మహిళల జీవితాలను, భూస్వాములు, రాజకీయ అవకాశవాదులు ఎంఎల్ఏలు, మంత్రులు దళితులపట్ల అనుచితంగా, అమానవీయంగా వ్యవహరించిన తీరును వాస్తవికంగా ఈ నవలలో చిత్రించాడు.

కథ సంగ్రహం మార్చు

ఎవరో విడిచిపెట్టిన అనాథబాలుణ్ణి, గుడిపూజారి కాపాడి పెంచిపెద్దచేస్తే, అతడే గ్రామప్రజల మానప్రాణ ధనధాన్యాలను హరించే దోపిడీదారుగా మారుతాడు. ఆనాటి గ్రామీణవ్యవస్థలో అన్నిరకాలా భూస్వాముల దోపిడికి ఈ నవల అద్దంపట్టింది. నా పొలం, నాపశువులు, నా భార్య అనే భావనకే చోటులేనంతటి దౌర్జన్యాలు సాగుతాయి. నవలా నాయిక ఎర్రమ్మ పెనిమిటిని, కుమారుణ్ణి పోగొట్టుకొంటుంది. చివరకు 'అన్నల' సహకారంతో భూస్వామిని మట్టుపెట్తుంది. తర్వాత భూస్వామి కుమారుడిలో పరివర్తన కలిగి, వృద్ధురాలు ఎర్రమ్మ సలహాతో అతడు తన సంపదను అహింసామార్గంలో గ్రామాభివృద్ధికి వెచ్చించడానికి పూనుకొనడంతో నవల ముగుస్తుంది.

మూలాలు మార్చు

  1. "Cheruvu Gandi". www.logili.com (in ఇంగ్లీష్). Retrieved 2023-07-15.