చెలికాని అన్నారావు

చెలికాని అన్నారావు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పనిచేశాడు. ఈయన 1908, సెప్టెంబరు 8 న విజయనగరం జిల్లాలోని బొబ్బిలి రాజవంశంలో జన్మించాడు.

అన్నారావు 1930 లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాల నుండి రసాయన శాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. ముంబైలోని లక్ష్మీరంగం కాపర్ మైన్స్ లిమిటెడ్ సంస్థకు, మద్రాసు కమర్షియల్ కార్పొరేషన్ కు డైరెక్టరుగా పనిచేశాడు. 1933 లో తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారిగా చేరాడు. అన్నారావు టి.టి.డి.లో పేష్కారుగా, పర్సనల్ అసిస్టెంటు కమీషనరుగా పదవీ బాధ్యతలు స్వీకరించాడు. స్వామివారి దర్శనానికి వచ్చే యాత్రికులకు విశేషమైన సౌకర్యాలు కల్పించడం ఈయన తోనే ఆరంభమయింది. ఈయన దేవస్థానంలో ఉద్యోగులకు ప్రభుత్వోద్యోగులతో సమానమైన జీతాలు, సౌకర్యాలను కల్పించి, చక్కని క్రమశిక్షణ అలవర్చాడు. అమెరికా, ఇతర దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాల స్థాపనకు ఆయన ఎంతో కృషిచేశాడు.

మూలాలు

మార్చు
  • 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.