చేతి పంపు
చేతి పంపులు అనగా మానవుని చేతితో పనిచేసే పంపులు, వీటిని ద్రవాలు లేక గాలిని ఒక చోటి నుండి మరొక చోటికి తరలించడానికి మానవశక్తి, యాంత్రిక అనుకూలతతో ఉపయోగిస్తారు. వివిధ రకాల పరిశ్రమలలో, సముద్రాలలో, నీటిపారుదల వ్యవస్థలో, విరామ కర్యాకలాపాల కొరకు ప్రపంచంలోని ప్రతి దేశంలో వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
అందుబాటులో అనేక రకాల చేతి పంపులు ఉన్నాయి, ప్రధానంగా పిస్టన్ మీద పనిచేసేది. వ్యతిరేక దిశలో చెక్ వాల్వ్ సూత్రంతో ఒక గదిని ప్రవేశించడం, నిష్క్రమించునట్లుగా పంపును పనిచేయిస్తారు.
రకములు
మార్చుచూషణ, లిఫ్ట్ చేతి పంపులు
మార్చుచూషణ, లిఫ్ట్ అనునవి ప్రవాహులను పంపింగ్ చేయుటలో ముఖ్యమైనవి. చూషణ అనునది పంప్ చేయవలసిన ప్రవాహికి, పంపు మధ్య భాగానికి మధ్య నిలువుగా ఉన్నదూరం, అదేవిధంగా లిఫ్ట్ అనగా పంపు మధ్య భాగానికి, నిర్గమ స్థానానికి మధ్యనున్న నిలువు దూరం. ఒక చేతిపంపు 7 మీటర్ల లోతు న గల వాతావరణ పీడనానికి పరిమితంగా పీల్చుకుంటుంది.[1] చేతిపంపు ప్రవాహికి కొంత ఎత్తుకు లిఫ్ట్ చేయటం దాని సామర్థం పై ఆధారపడి ఉంటుంది.
సిఫాన్స్
మార్చునీరు ఎల్లప్పుడూ పల్లం వైపు వస్తుంది. ఈ నియమం ఆధారంగా కొన్ని ప్లాస్టిక్ లేదా రబ్బరు బల్బు తో కూడిన ప్లాప్ వాల్వులు సాధారణ పంపులు వాటి ప్రతి చివర ఖాళీ ప్రవాహి లేదా వాటర్ కేన్స్ నుండి టాంక్స్ కు కలుపబడి ఉంటాయి. ఒకసారి బల్బు ప్రవాహితో నిండిన యెడల ఆ ప్రవాహి అధిక ఎత్తునుండి అల్ప స్థానానికి వస్తుంది.
లిఫ్ట్ శ్రేణి
మార్చుచేతి పంపులలోని వివిధ రకాల లిప్ట్ శ్రేణి క్రింద ఇవ్వబడింది:
రకం | శ్రేణి |
---|---|
సక్షన్ పంపులు | 0 – 7 మీటర్లు |
తక్కువ లిఫ్ట్ పంపులు | 0 – 15 మీటర్లు |
ప్రత్యక్ష చర్య పంపులు | 0 – 15 మీటర్లు |
మాధ్యమిక లిఫ్ట్ పంపులు | 0 – 25 మీటర్లు |
హై లిఫ్ట్ పంపులు | 0 – 45 మీటర్లు, లేదా అంతకు పైన |
చిత్రమాలిక
మార్చు-
చేతితో పచిచేసే నీటిపంపు "స్లోవేకియాలో"(నడిచే బీం పంప్)
-
1939 లో ఒక్లహామాలో ఒక బాలుడు తోడుతున్న హ్యాండ్ పంపు
-
1942 లో టెన్నెస్సీ లో ఒక విభాగంలో నీటి సప్లై విధానము .
-
ఇంగ్లాండ్ నందలి నోర్ఫోర్క్ లో గ్రామ పంఫు.
-
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పునర్నిర్మాణములో ఉపయోగించే చేతిపంపు.
-
బెర్లిన్ లోని చేతితో పనిచేసే నీటి పంపు.
-
లైబీరియా లోని గ్రామీణ చేతిపంపు.
-
బెల్జియం లోని పట్టణ నీటిపంపు.
-
లీప్జిగ్ లోని చేతి పంపు.
-
బెల్జియం లోని గ్రామీణ చేతిపంపు
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Water lifting devices". Fao.org. Retrieved 2013-12-31.