చేతివాటం
చేతివాటం (ఆంగ్లం: Handedness) అనేది మానవులలో సున్నితమైన పనులు చేయడంలో కుడి, ఎడమ చేతుల మధ్య వ్యత్యాసం ఉండడం. కుడి చేతితో పనులు సులువుగా చేసుకొనే వారిని కుడి చేతివాటం కలవాడు అంటారు. అలాగే ఎడమ చేతితో చేసుకొనే వారిని ఎడమ చేతివాటం వాడు అంటారు. చాలా తక్కువమంది రెండు చేతులతో ఒకే విధంగా పనిచేసుకోగలవారుంటారు. వారిని సవ్యసాచి అంటారు. అయితే ఒక వ్యక్తి ఏ చేతివాటం కలవాడో తెలుసుకోవడానికి సాధారణంగా వారు ఏ చేతితో రాస్తారో అనేదాని మీద నిర్ణయిస్తారు.
చేతివాటాలు-రకాలు
మార్చు- కుడి చేతివాటం చాలా సాధారణం. వీరు కుడి చేతితో సునాయాసంగా పనిచేయగలరు.
- ఎడమ చేతివాటం కొద్ది మందిలో కనిపిస్తుంది. వీరు ఎడమ చేతితో సునాయాసంగా పనిచేయగలరు. ఒక అంచనా ప్రకారం ఇంచుమించు 8-15% మంది ప్రపంచ జనాభాలో ఎడమ చేతివాటం కనిపిస్తుంది.[1]
- మిశ్రమ చేతివాటం కలవారు కొన్ని పనులు ఎడమ చేతితోను మరికొన్ని పనులు కుడి చేతితోను చేయడానికి అలవాటు పడతారు.
- సవ్యసాచిత్వం చాలా అరుదైనది. వీరు ఎంత సున్నితమైన పనైనా రెండు చేతులతో ఒకే ప్రావీణ్యతతో చేయగలుగుతారు. భారత పురాణాలలో అర్జునుడు సవ్యసాచిగా పేర్కొంటారు.
ఎడమ చేతివాటం ఉన్న ప్రముఖులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Hardyck C, Petrinovich LF (1977). "Left-handedness". Psychol Bull. 84 (3): 385–404. doi:10.1037/0033-2909.84.3.385. PMID 859955.