వికీపీడియా:వర్గీకరణ
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
ఈ వికీపీడియా (పేరుబరి) వ్యాసం గత కాలపు ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసానికి అసమగ్ర అనువాదం. కావున కొన్ని చోట్ల ఎర్రలింకులు కనబడతాయి. ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి |
వర్గాలను సృష్టించడం, అమర్చుకోవడంపై మార్గదర్శకాలను ఈ వ్యాసంలో చూడవచ్చు.
వర్గాలను ఎప్పుడు వాడాలి
మార్చువ్యాసాల పేరుబరిలోని ప్రతీ పేజీ ఏదో ఒక వర్గం కిందకు రావాలి. వర్గాలు సభ్యులకు త్వరగా స్ఫురించే విధంగా, వారి ఆలోచనా విధానానికి అనుగుణంగా ఉండాలి. ఉదాహరణకు:
- వ్యాసం: విజయవాడ
- అర్ధవంతమైన వర్గం:
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాలు]]
- ఇలాంటి వర్గం పెద్దగా ఉపయోగం లేదు:
[[వర్గం:వ తో మొదలయ్యే పట్టణాలు, నగరాలు]]
ఫలానా వర్గం సరైనదేనా అన్న విషయం తేల్చుకోడం ఇలాగ:
- ఆ వర్గం యొక్క విషయం గురించి వివరిస్తూ ఓ పది వాక్యాలు రాయగలమా?
- ఆ వర్గం నుండి వ్యాసానికి వెళ్ళి, ఆ వ్యాసం చదవగానే, వర్గ విషయానికి, వ్యాసానికి మధ్య సంబంధం తెలిసిపోతోందా (అంటే వర్గ విషయం గురించి వ్యాసంలో ఎక్కడైనా వచ్చిందా?
పై ప్రశ్నల్లో ఏ ఒక్క దానికైనా “లేదు” అనే సమాధానం వస్తే, ఆ వర్గం సరైనది కాదు అని అర్ధం చేసుకోవచ్చు.
ఒకే వ్యాసం చాలా వర్గాలకు సంబంధించి ఉండవచ్చు. అయితే, వ్యాసంలోని వర్గాల సంఖ్య పరిమితంగా ఉండాలి. సాధారణంగా వ్యాసం ఒక వర్గం, దాని ఉపవర్గం రెండింటిలోనూ ఉండరాదు. ఉదాహరణకు గుంటూరు పై వ్యాసం ఆంధ్రప్రదేశ్ లోను దాని ఉపవర్గం ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు అనే రెండింటిలోను ఉండరాదు.
వ్యాసాలను ఇతర విధాలుగా వర్గీకరించే విధానాల కొరకు వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు చూడండి.
ఏ వర్గానికీ చేర్చబడకుండా ఉన్న వ్యాసాలకు {{వర్గంలో చేర్చాలి}}
అనే టాగు తగిలిస్తే, ఇతర సభ్యులు తగువిధమైన చర్య తీసుకోవడానికి వీలుగా ఉంటుంది.
వర్గాలు vs జాబితాలు vs వరుస పెట్టెలు
మార్చువికీపీడియా:వర్గాలు, జాబితాలు, వరుస పెట్టెలు చూడండి.
వ్యక్తులపై వ్యాసాలకు సంబంధించిన వర్గాలు
మార్చువర్గాలకు నిర్దుష్ట వర్గవృక్షం ఉండదు
మార్చుఒక వ్యాసం ఎన్ని వర్గాలకిందకైనా రావచ్చని అనుకున్నాం గదా.. అలాగే, ఒక వర్గం అనేక ఇతర మాతృవర్గాల కిందకు రావచ్చు కూడా. అంటే, ఒక వర్గానికి చాలా ఉపవర్గాలున్నట్లే, ఒక ఉపవర్గానికి చాలా మాతృవర్గాలుండవచ్చు. కాబట్టి, వర్గాలకు ఒక వంశవృక్షమంటూ నిర్దుష్టంగా ఉండదు.
వర్గాలను ఎలా సృష్టించాలి
మార్చువర్గాన్ని సృష్టించడం చాల తేలిక. వ్యాసంలో అడుగున, కింద చూపిన విధంగా ఒక లింకును రాయడమే.
[[వర్గం:''వర్గంపేరు'']]
ఉదాహరణకు చెరువులు అనే వర్గాన్ని సృష్టించి రామప్ప చెరువు అనే వ్యాసాన్ని అందులో చేర్చడం ఎలాగో చూడండి. "రామప్ప చెరువు" వ్యాసపు మార్చు పేజీకి వెళ్ళి, అక్కడ వ్యాసం అడుగున (ఇతర భాషా లింకులకు పైన ) కింది లింకును చేర్చండి.
[[వర్గం:చెరువులు]]
పై లింకు వ్యాసంలో ఎక్కడా కనపడదు. కానీ పేజీ అడుగున ఒక పెట్టెలో వర్గం:చెరువులు అనే లింకు కనుపడుతుంది. వర్గం:చెరువులు అనే పేజీలో ఈ వర్గానికి చెందిన అన్ని వ్యాసాలను అక్షర క్రమంలో చూపిస్తుంది. ఈ పేజీలో పై వ్యాసం కూడా కనిపిస్తుంది. ముందుముందు ఆ వర్గంలో చేర్చే వ్యాసాలను ఆటోమాటిక్‌గా అక్షర క్రమంలో చూపిస్తూ ఉంటుంది.
ఉపవర్గాలను సృష్టించడం
మార్చుఉపవర్గాలను సృష్టించేందుకు, వర్గం పేజీలో దాని మాతృవర్గం పేరును కింది విధంగా చేర్చండి.
[[వర్గం:మాతృవర్గం పేరు]]
ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు వర్గాన్ని ఆంధ్రప్రదేశ్ వర్గానికి ఉపవర్గంగా చేర్చాలంటే-
[[:వర్గం:ఆంధ్రప్రదేశ్]]
వర్గం పేజీలో అడుగున [[:వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు]]
అని రాస్తే చాలు.
ఉపవర్గాల సమూహాలు చెయ్యడం
మార్చువర్గాలలో 200 అంశాల కంటే ఎక్కువ చేర్చలేము. ఆది దాటితే, మొదటి 200 అంశాలే కనిపిస్తాయి. అప్పుడు అన్నిటినీ సులభంగా చూడటానికి TOC (విషయ సూచిక) ను చేర్చండి, ఇలాగ:
{{CategoryTOC}}
– అంకెలతో మొదలుపెట్టి, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది{{CatAZ}}
- అంకెలు లేకుండా, అక్షరక్రమంలో విషయసూచిక వస్తుంది
వర్గం పెద్దదైపోయినపుడు మరో మార్గం ఏమిటంటే, ఉపవర్గాలను సృష్టించడం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు అనే వర్గం బాగా పెద్దదైపోతే, (ఆ అవకాశం ఎంతైనా ఉంది!) దానిలో కోస్తా, రాయలసీమ, తెలంగాణా అని మూడు ఉపవర్గాలుగానీ, మరో రకంగాకానీ ఉపవర్గాలు సృష్టించడమే!
వర్గ సభ్యత్వం, సృష్టి
మార్చువర్గానికి వివరణ రాసేటపుడు దానిని ఒక మాతృవర్గానికి చేర్చండి. వీలైతే, కనీసం రెండు మాతృవర్గాలకు దానిని చేర్చాలి.
వికీపీడియా పేరుబరి
మార్చువికీపీడియా పేరుబరికి సంబంధించిన వర్గాలను వ్యాసపు చర్చా పేజీకి మాత్రమే చేర్చాలి. ఎందుకంటే, ఇవి రచయితలకు సంబంధించినవే కాని వికీపీడియా శోధనకు అవసరం లేదు!
సభ్యుని పేరుబరి
మార్చుసభ్యుని పేరుబరికి సంబంధించిన వర్గాలను వికీపీడియాకు సంబంధించిన వర్గాలకు మాత్రమే చేర్చాలి. అంతేకాని, వ్యాసాలకు సంబంధించిన వర్గాలకు చేర్చరాదు. అంటే, సభ్యుడు తన సభ్యునిపేజీని ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు అనే వర్గంలో చేర్చరాదు. దానిని వికీపీడియనులుఅనే వర్గంలోకి చేర్చవచ్చు.
ఏదైనా వ్యాసాన్ని మీ పేరుబరి లోకి కాపీ చేసుకున్నట్లైతే (ఏ కారణం చేత నయినా సరే) దానిని వర్గాలనుండి తొలగించి వేయాలి.
సాధారణ నామకరణ విధానాలు
మార్చు- ప్రామాణిక నామకరణ విధానాలు వర్తిస్తాయి.
- పొడి పదాలు, పొట్టి పదాలు వాడవద్దు. ఉదాహరణ: ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు అని పేరు పెట్టాలి, ఆం ప్ర న & ప అని పెట్టవద్దు.
- ఉప వర్గాల పేర్లకు వర్గం పేరును కలిపి వర్గ వృక్షాన్ని సూచించనక్కర్లేదు (ఉదాహరణ: మరణాలు-ఆత్మహత్యలు అని పేరుపెట్టనక్కర్లేదు. ఆత్మహత్యలు అని పెడితే సరిపోతుంది. ఈ వర్గం మరణాలు వర్గం లోకి చేరుతుంది.)
- వర్గం పేరు స్వయం బోధకంగా ఉండాలి అదొక్కటే చూస్తే అదేంటో తెలిసిపోవాలి. ఆంధ్రప్రదేశ్ లోని నగరాలు, పట్టణాల వర్గానికి పేరు నగరాలు పట్టణాలుఅని పెడితే సుబోధకంగా ఉండదు, ఆ వర్గం లోని పేజీలు ఏ రాష్ట్రం లోవో తెలియదు. అందుచేత ఆంధ్రప్రదేశ్ నగరాలు పట్టణాలు అనే పేరు పెట్టాలి. ఇది వర్గవృక్షాన్ని సూచించినట్లు కాదు.
- ఒక టాపిక్ గురించిన వర్గమైతే దాని పేరు ఏకవచనంలో ఉండాలి. ఉదాహరణ: మొలక, వృక్షశాస్త్రం, ఆంధ్రప్రదేశ్ వగైరా. సాధారణంగా ఈ పేరుతో వికీపీడియా వ్యాసం ఉంటుంది.
- వర్గం ఒక బహువచన అంశాలకు చెందినదైతే దాని పేరు బహువచనంలో ఉండాలి. ఉదాహరణకు అంధ్రప్రదేశ్ జిల్లాలు, మెదక్ జిల్లా మండలాలు మొదలైనవి.
- వర్గాల పేర్లలో ప్రముఖ, ముఖ్యమైన, సుప్రసిద్ధ మొదలైన విశేషణాలు వాడరాదు.
వర్గాల అవసరాలు, ఉపయోగాలు
మార్చుశోధన
మార్చుసభ్యులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదకేటపుడు వర్గాలు సహాయపడతాయి.
వర్గాలకు లింకులు ఇవ్వడం
మార్చుఒక పేజీని ఫలానా వర్గానికి ఎలా చేర్చాలో చూశాము. కాని, అలా కాకుండా, ముందు ఒక కోలను పెట్టి ఆ వర్గపు పేజీకి లింకు ఇవ్వవచ్చు, ఇలాగ: [[:వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు]]
. అది ఇలా కనిపిస్తుంది - వర్గం:ఆంధ్రప్రదేశ్ నగరాలు, పట్టణాలు
వర్గాల దారి మార్పు
మార్చువికీపీడియా స్వరూపం చెడకుండా వుండటానికి, విషయ నిర్వహణ సరిగా చేయకుండా వుండటానికి వర్గాల దారిమార్పు చెయ్యకూడదు. మీకు కావలసిన వర్గం పేరు కాకుండా వేరే పేరుతో వర్గం వుంటే దానిలో ఎక్కువ విషయాలు లేక ఉపవర్గాలు వుంటే చర్చించి, ఆ విషయాలు,ఉపవర్గాలన్నిటిని అంగీకారం కుదిరిన పేరుగల వర్గంలోకి మార్చి, పాత వర్గాన్ని తొలగించాలి.
వర్గాలను క్రమానుగంగా పేర్చడం (సార్టింగ్)
మార్చువర్గాల విషయంలో పైపు ("|") కు అర్ధం, ఇతర సందర్భాల్లో అర్ధం కంటే విభిన్నంగా ఉంటుంది. వర్గం లింకులో పైపు తరువాత ఉండే భాగం వర్గాన్ని సార్టింగ్ చెయ్యడానికి ఉపయోగపడుతుంది. అయితే, ఈ భాగం పేజీలో కనపడదు.
ఉదాహరణ: [[:వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవనరులు]]
లాగా రాస్తే ఆంధ్రప్రదేశ్ జలవనరులు అనే ఈ వర్గం దాని మాతృవర్గంలో ఆ కింద వస్తుంది. అదే [[:వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవనరులు|జలవనరులు]]
అని రాస్తే ఆంధ్రప్రదేశ్ జలవనరులు వర్గం దాని మాతృవర్గంలో జ కింద వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్ నగరాలు వంటి ఆంధ్రప్రదేశ్ పేరుతో మొదలయ్యే అనేక వర్గాలను తగు విధంగా పేర్చక పోతే, అవన్నీ కట్టగట్టుకుని వాటి మాతృవర్గంలో ఆ కిందకే చేరుతాయి.
ఏదైనా వ్యాసం ఆ వర్గం లోని ప్రధాన వ్యాసం అయితే దాన్ని అన్ని వ్యాసాల కంటే పైన చూపించవచ్చు. అందుకుగాను, పైపు తరువాత భాగానికి ముందు ఒక స్పేసు పెడితే సరిపోతుంది, ఇలాగ:
[[:వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవనరులు| ]]
.
ఏదైనా వ్యాసం - ప్రధాన వ్యాసం కానిది - ఆ వర్గంలో ప్రముఖమైనది అంచేత అది మిగతావాటికంటే ప్రముఖంగా కనిపించాలి అని భావిస్తే దాన్ని వర్గం పేజీలో ప్రధాన వ్యాసం కింద చూపించవచ్చు. అందుకుగాను, పైపు తరువాత పేరుకు ముందు ఒక చుక్క పెట్టాలు, ఇలాగ: [[:వర్గం:ఆంధ్రప్రదేశ్ జలవనరులు|*జలవనరులు]]
. ఈ విధంగా ఎన్ని పేజీలనైనా ప్రముఖంగా కనిపించేలా చెయ్యవచ్చు.
సంవత్సరం వర్గాలు
మార్చుసంవత్సరాల వర్గాలకు (వర్గం:2004 లాగా) సంబంధించి, ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయి:
- అన్ని అంశాలు కూడా విషయాన్ని బట్టే సార్టింగు చెయ్యాలి. ఉదాహరణ: 2004 లో తెలుగు సినిమాలు అనే వ్యాసం ఈ వర్గం లోకి ఇలా చేర్చాలి:
[[వర్గం:2004|తెలుగు సినిమాలు]]
అలాగే 2004 లో తీవ్రవాద చర్యలు అనే వ్యాసం వర్గంలోకి ఇలా చేరాలి:[[వర్గం:2004|తీవ్రవాద చర్యలు]]
- సంవత్సరం గురించిన వ్యాసమే అయితే (2004 లాగా), ఇలా రాయాలి:
[[వర్గం:2004|*]]
. స్పెషలు కారెక్టరు వలన ఇది అన్నిటికంటే పైన చేరుతుంది. - సంవత్సరంలోని నెలలను (ఉదా: జూన్ 2004), వర్గం లోకి చేర్చేటపుడు మొదటి విభాగంలో తేదీ క్రమంలో ఉంచాలి ఇలాగ:
[[వర్గం:2004|*2004-06]]
.
వర్గాలకు ఇతర భాషా లింకులు
మార్చువ్యాసాల్లో లాగానే ఇతర భాషా లింకులు ఇక్కడా పనిచేస్తాయి.
వర్గాల విలీనం
మార్చువికీపీడియా:వర్గాల చర్చలు చూడండి. ఇది వికీపీడియా: పైవికీపీడియా బాట్ వుపయోగించి చేయటం సులువు.
ఇంకా చూడండి
మార్చు- వర్గీకరణ ఉపకరణం హాట్‌కేట్
- వికీపీడియా:Browse - A navigation page that includes links to high-level categories
- m:Help:Category
- వికీపీడియా:Category
- వికీపీడియా:Categorisation FAQ
- m:Categorization requirements (original guidelines for category proposals and implementations)
- వర్గం:Knowledge representation - Material related to concept categorization.
- వికీపీడియా:Categories for deletion
- వికీపీడియా:Categorization policy is a proposal to restrict category creation to admins.
వర్గాల శోధన
మార్చు- వర్గం:Orphaned categories - మాతృవర్గం అవసరమైన వర్గాల వర్గం.
- ప్రత్యేక:వర్గాలు - ప్రస్తుతం ఉన్న వర్గాలను అక్షర క్రమంలో చూపిస్తుంది.
- వర్గం:Categories - List of top-level categories. Requires this category be defined on the top of a tree.
- వర్గం:Fundamental - Fundamental knowledge categories.
- ప్రత్యేక:Uncategorizedpages - వర్గీకరణ జరగని పేజీల జాబితా.
- ప్రత్యేక:Uncategorizedcategories - వర్గీకరణ జరగని వర్గాల జాబితా.