చేత్‌రామ్ జాతవ్

భారతీయ స్వాతంత్య్ర సమరయోధుడు

చేత్‌రామ్ జాతవ్ 1857 భారత స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధుడు. అతను 1857 మే 26 న వాయువ్య ప్రావిన్సుల (ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ) లోని ఎటా జిల్లా, సోరో ప్రాంతంలో తిరుగుబాటులో చేరాడు. కంపెనీ వారు అతడిని చెట్టుకు కట్టేసి కాల్చి చంపారు. [1]

చేత్‌రామ్ జాతవ్
పౌరసత్వంభారతీయుడు
వృత్తిపాటియాలా మహారాజా సైన్యంలో సైనికుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య సమరం

జీవితం మార్చు

ప్రజల్లో ఉన్న మౌఖిక కథల ప్రకారం, ఒకరోజు వీపుపై సింహాన్ని మోసుకుపోతున్న వ్యక్తిని పాటియాలా మహారాజా చూశాడు. ఆ వ్యక్తి ఆ సింహాన్ని ఆయుధం లేకుండా చంపినట్లుగా రాజుకు తెలిసింది. రాజు అతన్ని తన సైన్యంలో చేరమని అడిగిన మీదట అతను సైన్యంలో చేరాడు. ఆ వ్యక్తి పేరే చేత్‌రామ్ జాతవ్. ఈస్టిండియా కంపెనీ వారు ప్రజలను వేధించడం చూసి, చేత్‌రామ్ వారితో పోరాడాడు. కంపెనీ వారు అతడిని అరెస్టు చేసి చెట్టుకు కట్టేశారు.  జాతవ్ మరణ పరిస్థితులను అలహాబాద్‌లోని జిబి పంత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కు చెందిన సబాల్టర్న్ చరిత్రకారుడు బద్రి నారాయణ్ తివారీ వెలికితీసాడు. కానీ చరిత్ర అతన్ని మరచి పోయినట్లు కనిపిస్తోంది. [1] ఇతర వనరులు కూడా తివారీ పరిశోధననే పునరుద్ఘాటించాయి. [2] [3] [4] 1990 లో డిసి దినకర్ రాసిన రచన స్వతంత్రతా సంగ్రామ్ మే అచ్చుతోన్ కా యోగ్దాన్ నుండి ఈ పరిశోధకులు సమాచారం తీసుకున్నారు. [5]

ప్రజాబాహుళ్య సంస్కృతిలో మార్చు

1857 తిరుగుబాటులో పోరాడి మరణించిన జాతవ్‌ను మరికొందరినీ బహుజన్ సమాజ్ పార్టీ, దళిత వీరత్వానికి చిహ్నాలుగా స్వీకరించింది. [6] తివారీ ప్రకారం, దళిత మేధావులు, స్థానిక నాయకులు, చరిత్రలు, పురాణాలు, ఇతిహాసాలను ఉపయోగించి అట్టడుగు దళితులను సమీకరించడానికి ప్రయత్నిస్తున్న బిఎస్‌పికి 1857 లో తిరుగుబాటులో పాల్గొన్న ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల మౌఖిక చరిత్రలో అనేక వనరులు కనిపించాయి. ఈ హీరోల కథలను తిరిగి తిరిగి చెప్పడం, స్మారక చిహ్నాలను నిర్మించడం, ప్రజల మనస్సులో వారి జ్ఞాపకాలను ప్రతిష్ఠించడానికి వారి కథలపై ఆధారపడి పదేపదే వేడుకలు నిర్వహించడం వగైరాలు ఆ పార్టీ రాజకీయ వ్యూహం. జాతి నిర్మాణంలో దళితులు గణనీయమైన పాత్ర పోషించారనే విధంగా ఈ కథలను వివరించేవారు. [5]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Tiwari, Badri Narayan (2006). Women Heroes and Dalit Assertion in North India: Culture, Identity and Politics. SAGE. p. 99. ISBN 9780761935377. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "tiwari" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. "Dalits took part in 1857 revolt: Study". Rediff. PTI. 10 November 2005. Retrieved 2016-09-21.
  3. Bates, Crispin, ed. (2013). "Identity and Narratives". Mutiny at the Margins: New Perspectives on the Indian Uprising of 1857. SAGE Publications India. p. 22. ISBN 978-8-13211-864-0.
  4. Hunt, Sarah Beth (2014). Hindi Dalit Literature and the Politics of Representation. Routledge. p. 130. ISBN 978-1-31755-952-8.
  5. 5.0 5.1 Tiwari, Badri Narayan (2007). "Identity and Narratives: Dalits and memories of 1857" (PDF). University of Edinburgh: Mutiny at the Margins Conference: 13, 27, 33. Archived from the original (PDF) on 2021-10-06. Retrieved 2021-10-06. {{cite journal}}: Cite journal requires |journal= (help) ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "conference" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  6. Tiwari, Badri Narayan (2014). Kanshiram: Leader of the Dalits. Penguin UK. p. 113. ISBN 978-9-35118-670-0.