చేరామన్ జామా మస్జిద్
చేరామన్ జామా మస్జిద్ లేదా చేరామన్ జుమా మస్జిద్ (Cheraman Jum'ah Masjid (మలయాళం: ചേരമാൻ ജുമാ മസ്ജിദ്) (ఉర్దూ - چیرامن جامع مسجد ) భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) చేరామన్ జమా మసీదు కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్ జిల్లా లోని చిన్న పట్టణం కొడంగళూర్, మలబార్ తీరంలో ఉంది..[1] ==తొలిచరిత్ర== సా.శ. 629లో నిర్మించబడ్డ చేరామన్ జమా మసీదు భారతదేశంలోనే మొట్ట మొదటి ముస్లింల ప్రార్థనా మందిరంగా పరిగణించబడుతుంది. చేరామన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. సా.శ. 629 లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదుగా నమోదు చెందింది.
Cheraman Juma Masjid | |
---|---|
The renovated Cheraman Juma Masjid | |
ప్రదేశం | On the Paravur - Kodungalloor Road, NH-17, Methala, Kodungalloor Taluk |
నిర్మాణ సమాచారం | |
నిర్మాణ శైలి | Traditional temple architecture |
మలిచరిత్ర
మార్చుచరిత్రానుసారం సా.శ. 1341 లో వచ్చిన వరద ఈ మసీదుని చాలా మేరకు ధ్వంసం చేసింది. నేడు మనం చూస్తున్న చేరామన్ జమా మసీదు కొత్తగా కట్టబడింది. మసీదు నిర్మాణం గుర్తించ తగ్గది. హిందూ దేవాలయాల శైలి, ఆకృతిని అనుసరిస్తుంది. మసీదు మధ్యలో ఒక నూనె దీపం వెలుగుతూ ఉంటుంది. మంగళప్రదమైన రోజుల్లో మత విశ్వాసాలకి అతీతంగా ప్రజలందరూ ఈ దీపం కొరకు నూనె తెస్తారు. మసీదులో పెట్టబడిన ఇత్తడి నూనె దీపాలు నిర్మాణ సౌందర్యానికి మరింత వన్నె తెస్తాయి. అద్భుతమైన చెక్కడాలు గల నూకమాను (రోజ్ వుడ్) వేదిక మిక్కిలి ఆకర్షణీయంగా ఉంటుంది. మక్కా నించి తెప్పించబడినిదిగా నమ్ముతున్న పాల రాయి ముక్క మసీదులో ఉంచబడింది. చేరామన్ జమా మసీదు భారతదేశం లోని మహమ్మదీయ చరిత్రలో ప్రముఖ భూమిక పోషిస్తుంది. కొడంగలూర్ వెళ్ళిన యాత్రికులు దీనిని తప్పక సందర్శించాలి .
సందర్శకులు
మార్చుదేశవిదేశాలకు చెందినా అనేక సందర్శకులు ఈ మస్జిద్ ను సందర్శించడానికి వస్తారు. భారత మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం కూడా సందర్శించారు.[2]
ఇవీ చూడండి
మార్చుబయటి లింకులు
మార్చుమూలాలు
మార్చు- ↑ Kerala Tourism - Official Website Cheraman Juma Masjid Archived 2014-12-14 at the Wayback Machine
- ↑ Staff Reporter. "Kalam to visit oldest mosque in sub-continent". The Hindu [Chennai, Tamil Nadu] 23 Jul, 2005: Kerala - Thrissur. Web [1] Archived 2006-11-10 at the Wayback Machine