చొప్పకట్ల చంద్రమౌళి


చొప్పకట్ల చంధ్రమౌళి[1] ఆధునిక తెలుగు సాహిత్యంలో విశిష్ట స్థానం పొంది 70వ దశకంలో యువకులను వెన్నుతట్టి ప్రోత్సహించినాడు.ఒక తరానికి ప్రేరణగా నిలిచాడు.

జననం మార్చు

పూర్వ కరీంనగర్ జిల్లా ప్రస్తుత రాజన్న సిరిసిల్లా లో గల ధార్మిక క్షేత్రం ఆయినా వేములవాడలో సనాతన సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు.ఉపాధ్యాయుడిగా చేస్తూ విద్యార్థులకు గొప్పగా జ్ఞానాన్ని పంచాడు.

సామాజిక ప్రస్థానం మార్చు

1946లో జి.చంద్రమౌళి ,పురాణం రామ చంద్రంలతో కలిసి "ప్రగతి" పేరు మీద సైకో స్టైల్డ్ పత్రిక నడిపారు.తర్వాత 1970 లో ఆగస్ట్ 15 న 'సాహితీ మిత్ర బృందం ' సంస్థ ఏర్పాటు చేసి వేములవాడలో ముమ్మరంగా కార్యక్రామలు నిర్వహించారు. ఆధునిక భావాలతో చైతన్యవంతమైన సమాజం కోసం పరితపించారు.[2]

పట్టపగలే చీకటి రాజ్యం చేస్తుంది

మట్టి దీపాలు ఐనా పెట్టండి

దీపం పెట్టేవాడు లేని ఇల్లాలు వుంది దేశం

మనస్సులోని తమస్సును కాల్చడానికి

చిరు దివియనైనా వెలిగించండి

అని గొప్ప సమతా భావాల్ని వెలిగించిన గొప్ప ఆధునిక కవి ,రచయిత,ఒక తరానికి ప్రేరణగా అభ్యుదయ భావాలతో తన రచనలతో చైతన్యవంతం చేశాడు.

సాహితీ కార్యక్రమాల నిర్వహణతో పాటు ఆయన నిరంతర కవితా సృజనకారుడు.1960 కాలంలో కరీంనగర్ జిల్లాలో ఎక్కడ కవి సమ్మేళనం జరిగిన వారి అధ్యక్షతన జరిగేవి,అనేక కవితలతో పాటు కథలు కూడా రాసేవారు,ఆయన కవితలు ఆ కాలంలోనే అనేక పత్రికలలో ప్రచురితం అవడంతో పాటు రేడియోలో కూడా ప్రసారమయ్యేవి.

1971 లో చొప్పకట్ట చంద్రమౌళి ప్రచురించిన 'సమతా దీపాలు' కవితా సంకలనం కాళోజీ ఆవిష్కరించాడు.అప్పుడే ఆయన కవిత్వం ఆధునిక భావాలతో ఇమిడి ఉంది.

చంద్రుని కి నివేదిక మార్చు

జీవనం ఎదగని నీలోని ఏడారులలో

సమతా వయాగరాలను పారించు

మంతా కుసుమ సౌరభాల స్వేచ్చా విహరాన్ని అరికట్టే

దానవతా శక్తుల పై వరుడా వై నారీ పారించు

దేవుడు కూడా సిగ్గిలునట్టు మానవాత శక్తిని నింపుకుని

తరించు '...అంటాడు.

మూలాలు మార్చు

  1. తెలంగాణ తేజోమూర్తులు. హైదరబాద్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ. 17 డిసెంబరు 2017. p. 608. ISBN 978-81-936345-7-8.
  2.   https://te.wikipedia.org/wiki/తెలంగాణ_రాష్ట్ర_భాషా_సాంస్కృతిక_శాఖ. వికీసోర్స్.