కరీంనగర్
కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఒక నగరం. ఇది ఒక ప్రధాన పట్టణ సముదాయం, కరీంనగర్ జిల్లాకు ప్రధాన పరిపాలనా కేంద్రం, రాష్ట్రంలో ఐదవ అతి పెద్ద నగరం.కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ చేత పాలించబడుతుంది.ఇది గోదావరి ఉపనది అయిన మానేర్ నది ఒడ్డున ఉంది.
కరీంనగర్ | |
---|---|
పట్టణం | |
![]() ఎల్గాండల్ కోట | |
ముద్దుపేరు(ర్లు): గ్రానైట్స్ నగరం | |
నిర్దేశాంకాలు: 18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.12417°ECoordinates: 18°26′13″N 79°07′27″E / 18.43694°N 79.12417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కరీంనగర్ |
ప్రాంతం | దక్కను |
స్థాపితం | 1905 |
పేరు వచ్చినవిధం | సయ్యద్ కరీముల్లా షా ఖాద్రి |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | మ్యునిసిపల్ కార్పొరేషన్ |
• నిర్వహణ | కరీంనగర్ నగరపాలక సంస్థ |
• మేయర్ | సునీల్ రావు (తెలంగాణ రాష్ట్ర సమితి) |
విస్తీర్ణం | |
• పట్టణం | 40.50 కి.మీ2 (15.64 చ. మై) |
విస్తీర్ణపు ర్యాంకు | 5th (state) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 275 మీ (902 అ.) |
జనాభా | |
• పట్టణం | 297,447 |
• ర్యాంకు | 178వ (భారతదేశం) 5వ (తెలంగాణ) |
• సాంద్రత | 7,300/కి.మీ2 (19,000/చ. మై.) |
• మెట్రో ప్రాంతం | (SUDA) |
పిలువబడువిధం (ఏక) | కరీంనగరీయులు |
భాషలు | |
• అధికార | తెలుగు, ఉర్దూ |
కాలమానం | UTC+5:30 (భా.ప్రా.స) |
పిన్‌కోడ్ | 505001 to 505010 |
టెలిఫోన్ కోడ్ | 91-878- |
ISO 3166 కోడ్ | IN-TG |
వాహనాల నమోదు కోడ్ | TS–02 / AP-15 (పాత సంఖ్య)[3] |
లింగ నిష్పత్తి | 981.4 ♀/♂ |
అక్షరాస్యత | 89.9 |
ప్లానింగ్ ఏజెన్సీ | శాతవాహన పట్టణ అభివృద్ధి సంస్థ |
జాలస్థలి | Karimnagar Municipal Corporation |
పేరు వెనుక చరిత్రసవరించు
ఈ నగరానికి సయ్యద్ కరీముద్దీన్ పేరు పెట్టారు.అతనిని స్థాపకుడిగా భావిస్తారు. పురాతన కాలము నుండి వేద అభ్యాసన కేంద్రంగా ప్రసిద్ధిపొందింది. పూర్వం ఈ ప్రాంతానికి 'సబ్బినాడు' అనే పేరు ఉంది, కరీంనగర్, శ్రీశైలంలలో దొరికిన కాకతీయ రాజులు ప్రోల, ప్రతాపరుద్రుని శాసనాలు ఈ ప్రాంత ఘనమైన చరిత్రకు నిదర్శనాలు.మరొక వాదన కరినగరం, కరి అనగా ఏనుగు, ఏనుగులు తిరిగే నగరం కావున ఈ నగరానికి కరినగరం అని పేరు వచ్చింది, కాలక్రమేణా కరీంనగర్ అని పిలువబడుతుంది అంటారు.
భౌగోళిక స్థితిసవరించు
కరీంనగర్ జిల్లా తూర్పున మధ్యప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ సరిహద్దులో నిజామాబాద్ జిల్లా, వరంగల్, మెదక్ దక్షిణాన, ఆదిలాబాద్ జిల్లా ఉత్తర దిశలలో సరిహద్దులుగా ఉన్నాయి.జిల్లా అక్షాంశాల 17 ° 50 ', 19 ° 05'N, పొడవు 78 ° 29', 80 ° 22'E మధ్య ఉంటుంది.
జనాభా, పరిశ్రమలుసవరించు
ఇది 1991, 2011 మధ్యకాలంలో గత రెండు దశాబ్దాల్లో జనాభా పెరుగుదల రేటు 45.46%, 38.87%ను నమోదు చేసింది, [4] ఇది తెలంగాణలోని ప్రధాన నగరాల్లో అత్యధిక వృద్ధి రేటు.కరీంనగర్ పట్టణం తెలంగాణా యొక్క ఉత్తర జిల్లాలకు ప్రధాన విద్యా, ఆరోగ్య కేంద్రంగా ఉంది.ఇది ఒక ప్రధాన వ్యాపార కేంద్రం, గ్రానైట్, ఆగ్రో-ఆధారిత పరిశ్రమలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.[5][6] ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ముఖ్య నగర స్మార్ట్ సిటీ మిషన్ కింద ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటానికి వంద భారతీయ నగరాలలో ఇది ఒకటిగా ఎంపికైంది.[7]
దేవాలయాలుసవరించు
ఈ గ్రామంలోని పాతబజార్ లో కాకతీయుల కాలంలో నిర్మించిన గౌరీశంకరాలయం ఉంది.[8]
గ్రామ ప్రముఖులుసవరించు
- జయశ్రీ రాచకొండ: న్యాయవాది, సినిమా నటి.[9]
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 "Basic Information of Municipality". Karimnagar Municipal Corporatio. Archived from the original on 24 మే 2016. Retrieved 16 May 2016. Check date values in:
|archive-date=
(help) - ↑ "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 1 August 2014.
- ↑ "District Codes". Government of Telangana Transport Department. Retrieved 4 September 2014.
- ↑ http://www.censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_Karimnagar.pdf
- ↑ https://www.deccanchronicle.com/nation/current-affairs/150516/granite-factories-flourish-in-karimnagar.html
- ↑ https://www.thehindu.com/todays-paper/tp-national/tp-telangana/industrial-policy-a-shot-in-the-arm-for-karimnagar/article7314798.ece
- ↑ https://www.thehindu.com/news/cities/Hyderabad/Karimnagar-replaces-Hyderabad-in-Smart-City-plan/article14426535.ece
- ↑ ఈనాడు, రాజన్న సిరిసిల్లా జిల్లా (4 March 2019). "కాకతీయుల కళా వైభవం". Archived from the original on 4 March 2019. Retrieved 5 March 2019.
- ↑ సాక్షి, సినిమా (11 March 2020). "అన్నిపాత్రల్లో వి'జయ'మే." Sakshi. Archived from the original on 20 July 2020. Retrieved 20 July 2020.