ఛత్రపతి సాహు మహరాజ్
ఛత్రపతి సాహు మహరాజ్ (1874 జూన్ 26 - 1922 మే 6) మరాఠాల భోంస్లే రాజవంశానికి చెందిన ఒక రాజు. ఆయనని ఛత్రపతి రాజర్షి సాహూ, సాహు IV, రాజర్షి సాహూ మహారాజ్, కొల్హాపూర్ సాహూ అని కూడా పిలుస్తారు.[4] ఆయన భారత రాచరిక రాష్ట్రమైన కొల్హాపూర్ మొదటి మహారాజు (1900-1922).[5][6][7] ఛత్రపతి సాహు మహరాజ్ ప్రజాస్వామ్యవాది. ఆయన సంఘ సంస్కర్త. అతని పాలనలో నిమ్న కులాలు, కులేతర సమూహాలకు రిజర్వేషన్ వ్యవస్థ, కులం మరియు మతంతో సంబంధం లేకుండా విద్యకు ప్రాప్యతను విస్తరించడం వంటి ప్రగతిశీల విధానాలను అమలు చేయడం జరిగింది.[8][9]
సాహు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
మహరాజా | |||||||||||||
![]() Portrait సుమారు 1912 | |||||||||||||
కొల్హాపూర్ మహారాజు | |||||||||||||
Reign | 1894–1922 | ||||||||||||
Coronation | 1894 | ||||||||||||
Predecessor | శివాజీ VI | ||||||||||||
Successor | రాజారామ్ III | ||||||||||||
జననం | యశ్వంతరావు ఘాట్గే[1] 1874 జూన్ 26 కాగల్, కొల్హాపూర్ రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం మహారాష్ట్ర, భారతదేశం)[2] | ||||||||||||
మరణం | 1922 మే 6 బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా | (వయసు 47)||||||||||||
| |||||||||||||
House | భోస్లె | ||||||||||||
రాజవంశం | మరాఠా | ||||||||||||
తండ్రి | జైసింగరావు (ఆబాసాహెబ్) ఘట్గే | ||||||||||||
తల్లి | రాధాబాయి | ||||||||||||
మతం | హిందూత్వం |
వ్యక్తిగత జీవితం సవరించు
1891లో సాహూ లక్ష్మీబాయి నీ ఖాన్విల్కర్‌ను (1880–1945) వివాహం చేసుకున్నాడు. ఆమె బరోడాకు చెందిన ఒక మరాఠా కులీనుడి కూతురు. లక్ష్మీబాయి, సాహూ లకు నలుగురు సంతానం.
- రాజారామ్ III, తన తండ్రి తర్వాత కొల్హాపూర్ మహారాజుగా నియమితులయ్యారు.
- రాధాబాయి 'అక్కాసాహెబ్' పవార్, దేవాస్ మహారాణి (సీనియర్) (1894–1973).
- మహారాజ్‌కుమార్ శివాజీ (1899–1918).
- రాజకుమారి ఔబాయి (1895); చిన్నప్పుడే చనిపోయింది.
అంబేద్కర్‌తో అనుబంధం సవరించు
కళాకారులు దత్తోబా పవార్, డిట్టోబా దాల్వీ ద్వారా సాహుమహారాజ్‌ను డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు పరిచయం చేశారు. భీంరావు గొప్ప తెలివితేటలు, అంటరానితనం గురించి అతని విప్లవాత్మక ఆలోచనలు మహారాజును ఎంతగానో ఆకట్టుకున్నాయి. 1917-1921 సమయంలో ఇద్దరూ అనేక సార్లు కలుసుకున్నారు. 'కుల ఆధారిత రిజర్వేషన్' అందించడం ద్వారా కుల విభజన ప్రతికూలతలను తొలగించడానికి సాధ్యమైన మార్గాలను పరిశీలించారు. వారు 21-22 మార్చి 1920 సమయంలో అంటరానివారి అభ్యున్నతి కోసం ఒక సమావేశాన్ని నిర్వహించారు. సమాజంలోని వేర్పాటు వర్గాల అభ్యున్నతికి కృషి చేసే నాయకుడు అంబేద్కర్ అని నమ్మినందున షాహూ అంబేద్కర్‌ను ఛైర్మన్‌గా చేశారు. అంతేకాకుండా రూ. 2,500, అంబేద్కర్ కు అందించారు. 31 జనవరి 1921న తన వార్తాపత్రిక ‘మూక్‌నాయక్’ను ప్రారంభించినప్పుడు, ఆ తర్వాత కూడా సాహు మరింత సహకారం అందించారు. వారి అనుబంధం 1922లో సాహూ మరణించే వరకు కొనసాగింది.[10]
మరణం సవరించు
సాహు 1922 మే 6న బొంబాయిలో మరణించాడు. అతని తరువాత అతని పెద్ద కుమారుడు రాజారాం III కొల్హాపూర్ మహారాజుగా నియమితుడయ్యాడు. వారసత్వాన్ని కొనసాగించడానికి సమర్థ నాయకత్వం లేకపోవడంతో షాహూ ప్రారంభించిన సంస్కరణలు క్రమంగా మసకబారడం ప్రారంభించాయి.[11]
స్మారక చిహ్నాలు సవరించు
మీడియాలో సవరించు
స్టార్ ప్రవా(Star Pravah)లో సాహు IV సీరియల్ 2019లో ప్రసారమైంది. ఇది భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ గురించిన కథ.
చిత్రమాలిక సవరించు
-
1894లో కొల్హాపూర్ మహారాజు
-
ప్యాలెస్ సేవకులతో సాహూ మహారాజ్
-
కొల్హాపూర్ మహారాజుతో సహా రెసిడెన్సీలో సమూహం
-
సాహూ ఛత్రపతి మహారాజ్ కుస్తీ పోటీలు వీక్షిస్తున్న దృశ్యం
-
2009 ఫిబ్రవరి 17న న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్
మూలాలు సవరించు
- ↑ "Chhatrapati Shahu Maharaj's Birth Anniversary: All You Need to Know About the Erstwhile King of Kolhapur". News18 (in ఇంగ్లీష్). 26 June 2020. Retrieved 2022-01-05.
- ↑ "Ahead of the curve: Revisiting Chhatrapati Shahu Maharaj's 1902 decision to reserve jobs for backward castes - Art-and-culture News , Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 26 July 2021. Retrieved 2022-01-05.
- ↑ 3.0 3.1 "'सर्वांगपूर्ण राष्ट्रपुरुष' राजर्षी शाहू महाराज यांची आज जयंती". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2022-01-05.
- ↑ "'सर्वांगपूर्ण राष्ट्रपुरुष' राजर्षी शाहू महाराज यांची आज जयंती". Maharashtra Times (in మరాఠీ). Retrieved 2022-01-04.
- ↑ "Shahu Chhatrapati Biography – Shahu Chhatrapati Life & Profile". Cultural India. Retrieved 15 May 2016.
- ↑ "Chatrapati Shahu Maharaj (Born on 26th June)". Mulnivasi organiser. 15 December 1749. Retrieved 15 May 2016.
- ↑ Date, Vidyadhar (22 July 2002). "Gov seeks total make-over of Chhatrapati Shahu Maharaj's image". The Times of India. TNN. Retrieved 15 May 2016.
- ↑ Ghadyalpatil, Abhiram (2018-08-10). "Rajarshi Shahu Chhatrapati of Kolhapur, a reformer ahead of his time". Livemint. Retrieved 2018-09-09.
- ↑ "Rajarshi Shahu Chhatrapati of Kolhapur, a reformer ahead of his time". The Siasat Daily (in బ్రిటిష్ ఇంగ్లీష్). 10 August 2018. Retrieved 2018-09-09.
- ↑ "Shahu Chhatrapati Biography – Shahu Chhatrapati Life & Profile". Cultural India. Retrieved 15 May 2016.
- ↑ "Shahu Chhatrapati Biography – Shahu Chhatrapati Life & Profile". Cultural India. Retrieved 15 May 2016.
- ↑ "President unveils statue of Shahu Maharaj in Parliament". Hindustan Times. No. Feb 17 2009. PTI. 2009.
- ↑ "Statue of Shahuji Maharaj unveiled | India News - Times of India". The Times of India.
- ↑ "President unveils the statue of Rajarshi Chhatrapati Shahu Maharaj". pib.gov.in. Retrieved 2020-03-02.