ఛాయా ఘోష్

పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకురాలు

ఛాయా ఘోష్ (1940, ఆగస్టు 15 - 2010, ఫిబ్రవరి 12) పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకురాలు, మంత్రి, ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు.

ఛాయా ఘోష్ 1940, ఆగస్టు 15న పశ్చిమ బెంగాల్ లో జన్మించింది.

రాజకీయ జీవితం

మార్చు

ఛాయా ఘోష్ 1977, 1982, 1991, 2001లో ముర్షిదాబాద్ శాసనసభ నియోజకవర్గం) నుండి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయింది.[1] 1991 నుండి 1996 వరకు సహాయ మంత్రిగా,[2] 2001 నుండి 2005 వరకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు మంత్రిగా ఉన్నది.[3]

తరువాతి జీవితం

మార్చు

గతంలో స్కూల్ టీచర్ అయిన ఛాయా ఘోష్ ను హేమంత బోస్ రాజకీయాల్లోకి తీసుకొచ్చాడు. తన జీవిత చరమాంకంలో ఫార్వర్డ్ బ్లాక్‌తో విభేదించింది. 2006 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు, ఫార్వర్డ్ బ్లాక్ ఆమెకు టిక్కెట్ నిరాకరించింది. ఆమె ఇండియన్ పీపుల్స్ ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరింది.[2][3]

ఛాయా ఘోష్ వయస్సు సంబంధిత సమస్యలతో 2010, ఫిబ్రవరి 12న మరణించింది. ఈమె తరపు లాయర్ భర్త. ఈమె ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టింది. [2] [3]

మూలాలు

మార్చు
  1. "58 - Murshidabad Assembly Constituency". Partywise Comparison Since 1977. Election Commission of India. Retrieved 2010-09-26.
  2. 2.0 2.1 2.2 "West Bengal ex-minister Chhaya Ghosh passes away". The Hindu 12 February 2010. Retrieved 2010-10-01.
  3. 3.0 3.1 3.2 "West Bengal ex-minister Chhaya Ghosh dead". DNA Daily News Analysis. Retrieved 2010-10-01.
"https://te.wikipedia.org/w/index.php?title=ఛాయా_ఘోష్&oldid=4222838" నుండి వెలికితీశారు