జక్కంపూడి రాజా ఇంద్రవందిత్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]

జక్కంపూడి రాజా
జక్కంపూడి రాజా


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - 3 జూన్ 2024
ముందు పెందుర్తి వెంకటేష్
తరువాత బత్తుల బలరామకృష్ణ
నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1989
రాజానగరం, తూర్పు గోదావరి జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జక్కంపూడి రామ్మోహనరావు, జక్కంపూడి విజయలక్ష్మి[1]
జీవిత భాగస్వామి రాజశ్రీ
బంధువులు జక్కంపూడి గణేష్ (తమ్ముడు)
నివాసం రాజానగరం

జననం, విద్యాభాస్యం

మార్చు

జక్కంపూడి రాజా 1989లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పు గోదావరి జిల్లా, రాజానగరంలో జక్కంపూడి రామ్మోహనరావు, జక్కంపూడి విజయలక్ష్మి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి జక్కంపూడి రామ్మోహనరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు, రవాణా శాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశాడు. జక్కంపూడి రాజా గీతం యూనివర్సిటీ దూర విద్య ద్వారా ఎంబీఏ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

మార్చు

జక్కంపూడి రాజా తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు.[4] ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజానగరం నియోజకవర్గం నుండి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ పై 31772 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5] జక్కంపూడి రాజా ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా 29 జూలై 2019న నియమితుడయ్యాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. Sakshi (18 April 2014). "బరిలో విద్యాధికులు". Archived from the original on 7 జనవరి 2022. Retrieved 7 January 2022.
  2. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  3. Sakshi (18 March 2019). "తూర్పు గోదావరి వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రొఫైల్స్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  4. The New Indian Express (6 October 2018). "Andhra Police foil YSRC youth wing president Jakkampudi Raja's hunger stir". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  5. Sakshi (2019). "Rajanagaram Constituency Winner List in AP Elections 2019". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.
  6. TV9 Telugu (19 July 2019). "ఏపీ కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌గా జక్కంపూడి రాజా". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Sakshi (29 July 2019). "కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా జక్కంపూడి రాజా". Archived from the original on 23 September 2021. Retrieved 23 September 2021.