జక్కంపూడి రామ్మోహనరావు
జక్కంపూడి రామ్మోహనరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కడియం శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 2004 నుండి 2009 వరకు ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రిగా పని చేశాడు.
జక్కంపూడి రామ్మోహనరావు | |||
| |||
రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 - 2009 | |||
నియోజకవర్గం | కడియం శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 6 ఆగష్టు 1953 ఆదుర్రు గ్రామం, మామిడికుదురు మండలం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 9 అక్టోబర్ 2011 రాజమండ్రి | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
తల్లిదండ్రులు | పేద వీరయ్య, సీతారత్నం | ||
జీవిత భాగస్వామి | జక్కంపూడి విజయలక్ష్మి | ||
సంతానం | జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ | ||
నివాసం | రాజానగరం |
రాజకీయ జీవితం
మార్చుజక్కంపూడి రామ్మోహనరావు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐ.ఎన్.టి.యూ.సి జిల్లా అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 1989లో కడియం నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 1994లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.
జక్కంపూడి రామ్మోహనరావు 1999 ఎన్నికల్లో కడియం నియోజకవర్గం నుండి పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004లో జరిగిన ఎన్నికల్లో గెలిచి వై.యస్. రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన అనారోగ్యంతో మూడేళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి 15 డిసెంబర్ 2010న కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు.
మరణం
మార్చుజక్కంపూడి రామ్మోహనరావు షుగర్ వ్యాధితో బాధపడుతూ 9 అక్టోబర్ 2011న రాజమండ్రిలో మరణించారు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ The Hindu (10 October 2011). "Former Minister Jakkampudi dead" (in Indian English). Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.
- ↑ "Rammohan Rao Cremated With State Honours". Outlook. 10 అక్టోబరు 2011. Archived from the original on 11 అక్టోబరు 2011. Retrieved 11 అక్టోబరు 2011.
- ↑ The New Indian Express (10 October 2011). "Former Minister Jakkampudi is dead". Archived from the original on 20 January 2022. Retrieved 20 January 2022.