జగత్‌సింగ్‌పూర్
జగత్‌సింగ్‌పూర్ ఒడిషా రాష్ట్రంలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఉన్న పట్టణం. ఇది జగత్‌సింగ్‌పూర్ జిల్లాకు ప్రధాన కార్యాలయం కూడా. ఇది 1993 ఏప్రిల్ 1 న ఈ జిల్లా ఏర్పడింది. గతంలో ఇది కటక్ జిల్లాలో ఒక ఉపవిభాగంగా ఉండేది. పారాదీప్ పోర్ట్, చమురు శుద్ధి కర్మాగారం, ఎరువుల కర్మాగారం జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఉన్నాయి. దేవి, అలకా, బిలుఖై, కుసుమి, హన్సువా, కువాన్రియా, లునిఝరా నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి
జగత్‌సింగ్‌పూర్ | |
---|---|
— పట్టణం — | |
దేశం | India |
రాష్ట్రం | ఒడిశా |
జిల్లా | జగత్‌సింగ్‌పూర్ |
Named for | జగత్ సింగ్ |
జనాభా (2011) | |
- మొత్తం | 51,688 |
భాషలు | |
- అధికారిక | ఒరియా |
Time zone | IST (UTC+5:30) |
Vehicle registration | OD-21 |
భౌగోళిక శాస్త్రం
మార్చుజగత్సింగపూర్ 20°16′N 86°10′E / 20.27°N 86.17°E వద్ద , సముద్రమట్టం నుండి 15 మీటర్ల ఎత్తున ఉంది.
రవాణా
మార్చుజగత్సింగ్పూర్ పట్టణం నుండి 10 కి.మీ. దూరంలో ఉన్న గోరఖ్‌నాథ్ స్టేషన్ సమీప రైల్వే స్టేషను.[1] సమీప విమానాశ్రయం భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం . బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పారాదీప్‌కి చార్టర్ ఎయిర్ సర్వీస్‌ను పవన్ హన్స్ అందిస్తుంది. జగత్‌సింగ్‌పూర్ ఇతర నగరాలతో రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పట్టణం నుండి ఒడిషాలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు బస్సు సేవలను నిర్వహిస్తోంది.
జనాభా వివరాలు
మార్చుజగత్సింగ్పూర్ పట్టణాన్ని 21 వార్డులుగా విభజించారు. సెన్సస్ ఇండియా 2011 విడుదల చేసిన నివేదిక ప్రకారం జగత్‌సింగ్‌పూర్ మునిసిపాలిటీలో 33,631 జనాభా ఉంది. అందులో 17,239 మంది పురుషులు కాగా 16,392 మంది మహిళలు ఉన్నారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 2859. ఇది జగత్‌సింగ్‌పూర్ మొత్తం జనాభాలో 8.50%. జగత్‌సింగ్‌పూర్ మున్సిపాలిటీలో, లింగ నిష్పత్తి 951. పిల్లల్లో లింగ నిష్పత్తి దాదాపు 961గా ఉంది. పట్టణంలో అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 89.32%. పురుషుల్లో అక్షరాస్యత 93.45% కాగా స్త్రీలలో ఇది 84.98%.[2]
మూలాలు
మార్చు- ↑ Indian Rail. "Indian Rail Info". Retrieved 2016-05-03.
- ↑ Census 2011. "Jagatsinghpur Municipality census data 2011". Retrieved 2016-04-28.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)