జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే

జగదభి రాముడు శ్రీరాముడే, రఘుకుల సోముడు ఆ రాముడే పాట లవకుశ (1963) సినిమా కోసం సముద్రాల రాఘవాచార్య రచించిన గీతం. దీనిని లవకుశులుగా నటించిన మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం లపై చిత్రికరించారు. ఈ గీతాన్ని పి.లీల, పి.సుశీల, వైదేహి, పద్మ మల్లిక్లు మధురంగా గానం చేయగా ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్ని అందించారు.

నేపథ్యం మార్చు

లవకుశులు వాల్మీకి రచించిన రామాయణాన్ని గానం చేస్తూ అయోధ్య చేరతారు. అక్కడ రాజవిధిలో గానం చేస్తున్న వీరిని గురించిన సమాచారాన్ని రాజరికంలో చేరుస్తారు. ఆ విధంగా అంతఃపురం చేరి రామాయణాన్ని గానం చేస్తారు.

పాట మార్చు


జయ జయరామ్ జయ రఘురామ్

వాల్మీకి:
జగదభిరాముడు శ్రీరాముడే
రఘుకుల సోముడు ఆ రాముడే

జనకుని మాటల తలపై నిలిపీ
తన సుఖముల విడి వనితామణితో
వనముల కేగిన ధర్మావతారుడు ||జగదభి||


లవకుశ:
కరమున ధనువు శరములు దాలిచి (3)
ఇరువది చేతులు దొరనే కూలిచి
సురలను గాచిన వీరాధి వీరుడు ||జగదభి||

జంట:
ఆలూ మగలా అనురాగాలకు (2)
పోలిక సీతారాములె యనగా (2)
వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు ||జగదభి||

సీత:
నిరతము ధర్మము నెరపీ నిలిపీ (2)
నరులకు సురులకు తరతరాలకూ
ఒరవడియైన వర యుగపురుషుడు ||జగదభి||


బృందము:
ఇనకుల మణి సరితూగే తనయుడు
అన్నయు ప్రభువు లేనేలేడని ||ఇన||
జనులు భజించే పురుషోత్తముడు ||జగదభి||
జయ జయరామ్ జయ రఘురామ్

సాహిత్య సౌరభాలు మార్చు

శ్రీరాముని సకల గుణగణాలను వాల్మీకి, లవుడు, కుశుడు, సీతాదేవితో పాటు ఆశ్రమంలోను మునులందరు కొనియాడినట్లు సీనియర్ సముద్రాల ఈ పాటను చిత్రించారు. శ్రీరాముని ధర్మావతారునిగా, వీరాధివీరునిగా, ప్రేమావతారునిగా పేర్కొన్నారు. "ఇరువది చేతుల దొర" అని రావణాసురుని అచ్చమైన తెలుగులో సంబోధించారు.[1] పాటలో "ర" ప్రాస రామనామ రామణీయకతను ధ్వనిస్తుంది. కానడ రాగంలో దీనిని కమనీయంగా స్వరపరచారు.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. లవకుశ (1963), జీవితమే సఫలము: సీనియర్ సముద్రాల సినీ గీతాలకు సుమధుర వ్యాఖ్య, మూడవ సంపుటము, డా. వి.వి.రామారావు, క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2011, పేజీ:140-151.

బయటి లింకులు మార్చు