జగదీశ్ ముఖి భారత దేశానికి చెందిన రాజకీయ నాయకుడు, అసోం గ‌వ‌ర్న‌ర్‌గా 2017 అక్టోబరు 10 నుండి - 2023 ఫిబ్రవరి 14 వరకు పనిచేసారు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు. ఇంతకు పూర్వం అండమాన్ నికోబర్ దీవులకు లెఫ్టినెంట్ గవర్నరుగా సేవలందించాడు.[1]

జగదీశ్ ముఖి
జగదీశ్ ముఖి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2017 అక్టోబరు 10
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు బన్వారిలాల్ పురోహిత్

నాగాలాండ్ గవర్నరు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2021 సెప్టెంబరు 17
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు ఆర్.ఎన్. రవి

మిజోరం గవర్నరు
పదవీ కాలం
2019 మార్చి 8 – 2019 అక్టోబరు 25
అధ్యక్షుడు రామ్‌నాథ్‌ కోవింద్‌
ముందు కుమారన్ రాజశేఖరన్
తరువాత పి.ఎస్ శ్రీధరన్ పిళ్ళై

అండమాన్ నికోబార్ దీవుల 13వ లెఫ్టినెంట్ గవర్నర్
పదవీ కాలం
2016 ఆగస్టు 22 – 2017 అక్టోబరు 7

వ్యక్తిగత వివరాలు

జననం (1942-12-01) 1942 డిసెంబరు 1 (వయసు 82)
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు జాతీయ ప్రజాస్వామ్య కూటమి
నివాసం రాజ్ భవన్, గుహవటి

ప్రారంభ జీవితం

మార్చు

ముఖి 1942 డిసెంబర్ 1న ఒక హిందూ కుటుంబంలో జన్మించాడు.[2] 1965 లో రాజస్థాన్ రాష్ట్రం ఆళ్వార్ జిల్లా లోని రాజ్ రిషి కళాశాల నుండి బి.కామ్, ఆ తరువాత 1967లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి ఏం. కామ్ పట్టా పొందాడు. రాజకీయాల్లోకి రాకముందు ఇతను ఢిల్లీ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల అయిన షహీన్ భగత్ సింగ్ కళాశాలలో ప్రొఫెసర్ గా ఉండేవాడు. 1995 అక్టోబర్ లో కురుక్షేత్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి పట్టా పొందాడు.[3]

ముఖి 1970 లో ప్రేమగౌర్ ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

మూలాలు

మార్చు
  1. "jagdish mukhi given additional charge of mizoram until the appointment of P S Sreedharan Pillai as the new governor". uniindia. Retrieved 8 March 2019.
  2. "Jagdish Mukhi Biography". elections.in.
  3. "Jagdish Mukhi Sworn In As Lieutenant Governor Of Andaman And Nicobar". NDTV.com. 22 August 2016.

బయటి లంకెలు

మార్చు