రాజస్థాన్
రాజస్థాన్ (Rajasthan) (राजस्थान) భారత దేశంలో వైశాల్యం ప్రకారం అతి పెద్ద రాష్ట్రం. రాజస్థాన్ కు పశ్చిమాన పాకిస్తాన్ దేశం ఉంది. ఇంకా నైఋతిన గుజరాత్, ఆగ్నేయాన మధ్య ప్రదేశ్, ఈశాన్యాన ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాన పంజాబు రాష్ట్రాలు రాజస్థాన్ కు హద్దులు. మొత్తం రాజస్థాన్ వైశాల్యం 3లక్షల 42వేల చదరపు కి.మీ. (1,32,139 చదరపు మైళ్ళు)
రాజస్థాన్ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
జైపూర్ - 26°54′N 75°48′E / 26.90°N 75.80°E |
పెద్ద నగరం | జైపూర్ |
జనాభా (2001) - జనసాంద్రత |
56,473,122 (8వ స్థానం) - 165/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
342,236 చ.కి.మీ (1వ స్థానం) - 33 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[రాజస్థాన్ |గవర్నరు - [[రాజస్థాన్ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
1956-11-01 - ప్రభారావ్ - అశోక్ గెహ్లాట్ - ఒకే సభ (200) |
అధికార బాష (లు) | హిందీ, రాజస్థానీ గుజరాతీకూడా మాట్లాడుతారు |
పొడిపదం (ISO) | IN-RJ |
వెబ్‌సైటు: www.rajasthan.gov.in |

రాజస్థాన్ రాష్ట్రంలో ప్రధానమైన భౌగోళిక అంశం థార్ ఎడారి. ఆరావళీ పర్వత శ్రేణులు రాజస్థాన్ భూభాగాన్ని మధ్యగా విడగొడుతున్నాయి. ఈ పర్వతాలు ఋతుపవనాలను అడ్డుకోవడం వల్ల పశ్చిమ ప్రాతంలో వర్షపాతం దాదాపు శూన్యం. అందువల్ల అది ఎడారిగా మారింది. మరొప్రక్క దట్టమైన అడవులతో గూడిన రణథంబోర్ నేషనల్ పార్క్ (పులులకు సంరక్షణాటవి), ఘనా పక్షి ఆశ్రయం, భరత్ పూర్ పక్షి ఆశ్రయం ఉన్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరం.
చరిత్రసవరించు
రాజపుత్రులచే పాలింపబడింది గనుక రాజస్థాన్ "రాజపుటానా" రాష్ట్రంగా వ్యవహరించేవారు. రాజస్థాన్ చరిత్రలో ఎక్కువకాలం యుద్ధప్రియులైన చిన్న చిన్న రాజపుత్ర వంశపు రాజుల పాలనలో సాగింది. ఈ ప్రాంతాన్ని బయటివారెవరూ పూర్తిగా ఆక్రమించలేకపోయారు. అయితే వేరు వేరు ఒడంబడికలద్వారా బ్రిటిష్ పాలకులు మాత్రం పెత్తనం చలాయించారు. ఈ విధమైన చరిత్ర వల్ల రాజస్థాన్ లో చాలా చారిత్రిక నిర్మాణాలు, కోటలు, సంస్కృతి విలక్షణంగా నిలబడ్డాయి. అందువల్లనే అక్కడ అభివృద్ధి కొరవడిందనీ, సమాజంలో అసమానతలు ప్రబలి ఉన్నాయనీ, స్త్రీలు బాగా వెనుకబడ్డారనీ కొదరి వాదన.
కోటలుసవరించు
రాజస్థాన్ లో ఎన్నో కోట కట్టడాలు ఇప్పటికీ క్షత్రియుల రాచరికానికి, చరిత్రకి అద్దంపడుతుంటాయి.
అచల్గర్ కోట: మౌంట్ అబూకి 11 కి. మీ. దూరంలో ఈ కోటను పరమార వంశస్థులు కట్టారు. తరువాత 1452లో ఈ కోటకు రాణా కుంభ అనే రాజు అచల్గర్ అని పేరు పెట్టాడు. ఈ కొటలో 1513 లో కట్టబడిన జైన్ దేవాలయాలు కూడా ఉన్నాయి.
సంస్కృతిసవరించు
రాజస్థాన్ లో ఇప్పటికీ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎక్కువగా ఉంది. ఆక్కడి స్త్రీలు ఆచారాలను, సంప్రదాయలను గౌరవిస్తారు, తూచా తప్పకుండా పాటిస్తారు. భారత దేశంలో విడాకుల సంఖ్య అతి తక్కువగా ఉన్న 2, 3 రాష్ట్రాలలో రాజస్థాన్ ఒకటి. దేశంలో ఇతర రాష్ట్రాలలో కాకుండా అక్కడి స్త్రీలు బయటకు ఒంటరిగా వెళ్ళుట, ఫ్యాషన్ గా ఉండుట కనిపించరు. సినిమా, మీడియా ప్రభావం అతి తక్కువగా ఉండటం, పురుషుల కట్టుబాట్ల పట్టింపు దీనికి కారణాలుగా చెప్పవచ్చు. అక్కడ ఇద్దరి వ్యక్తుల మధ్య వాగ్వివాదాలు అతి తక్కువ. పోలీసులు సాధారణంగా రోడ్ల పై కనిపించరు.
జిల్లాలుసవరించు
రాజస్థాన్ లో 33 జిల్లాలు ఉన్నాయి.
రాజస్థాన్ జిల్లాలుసవరించు
సంఖ్య | కోడ్ | జిల్లా | ముఖ్య పట్టణం | జనాభా
(2011) |
విస్తీర్ణం (కి.మీ.²) | జన సాంద్రత (/కి.మీ.²) |
---|---|---|---|---|---|---|
1 | AJ | అజ్మీర్ | అజ్మీర్ | 25,84,913 | 8,481 | 305 |
2 | AL | ఆల్వార్ | ఆల్వార్ | 36,71,999 | 8,380 | 438 |
3 | BI | బికనీర్ | బికనీర్ | 23,67,745 | 27,244 | 78 |
4 | BM | బార్మర్ | బార్మర్ | 26,04,453 | 28,387 | 92 |
5 | BN | బన్‌స్వార | బన్‌స్వార | 17,98,194 | 5,037 | 399 |
6 | BP | భరత్‌పూర్ | భరత్‌పూర్ | 25,49,121 | 5,066 | 503 |
7 | BR | బరన్ | బరన్ | 12,23,921 | 6,955 | 175 |
8 | BU | బుంది | బుంది | 11,13,725 | 5,550 | 193 |
9 | BW | భిల్వార | భిల్వార | 24,10,459 | 10,455 | 230 |
10 | CR | చురు | చురు | 20,41,172 | 16,830 | 148 |
11 | CT | చిత్తౌర్‌గఢ్ | చిత్తౌర్‌గఢ్ | 15,44,392 | 10,856 | 193 |
12 | DA | దౌసా | దౌస | 16,37,226 | 3,429 | 476 |
13 | DH | ధౌల్‌పూర్ | ధౌల్‌పూర్ | 12,07,293 | 3,084 | 398 |
14 | DU | దుంగర్‌పూర్ | దుంగర్‌పూర్ | 13,88,906 | 3,771 | 368 |
15 | GA | శ్రీ గంగానగర్ | శ్రీ గంగానగర్ | 19,69,520 | 10,990 | 179 |
16 | HA | హనుమాన్‌గఢ్ | హనుమాన్‌గఢ్ | 17,79,650 | 9,670 | 184 |
17 | JJ | ఝున్‌ఝును | ఝున్‌ఝును | 21,39,658 | 5,928 | 361 |
18 | JL | జలోర్ | జలోర్ | 18,30,151 | 10,640 | 172 |
19 | JO | జోధ్‌పూర్ | జోధ్‌పూర్ | 36,85,681 | 22,850 | 161 |
20 | JP | జైపూర్ | జైపూర్ | 66,63,971 | 11,152 | 598 |
21 | JS | జైసల్మేర్ | జైసల్మేర్ | 6,72,008 | 38,401 | 17 |
22 | JW | ఝలావర్ | ఝలావర్ | 14,11,327 | 6,219 | 227 |
23 | KA | కరౌలి | కరౌలి | 14,58,459 | 5,530 | 264 |
24 | KO | కోట | కోట | 19,50,491 | 5,446 | 374 |
25 | NA | నాగౌర్ | నాగౌర్ | 33,09,234 | 17,718 | 187 |
26 | PA | పాలీ | పాలీ | 20,38,533 | 12,387 | 165 |
27 | PG | ప్రతాప్‌గఢ్ | ప్రతాప్‌గఢ్ | 8,68,231 | 4,112 | 211 |
28 | RA | రాజ్‌సమంద్ | రాజ్‌సమంద్ | 11,58,283 | 3,853 | 302 |
29 | SK | సికార్ | సికార్ | 26,77,737 | 7,732 | 346 |
30 | SM | సవై మధోపూర్ | సవై మధోపూర్ | 13,38,114 | 4,500 | 257 |
31 | SR | సిరోహి | సిరోహి | 10,37,185 | 5,136 | 202 |
32 | TO | టోంక్ | టోంక్ | 14,21,711 | 7,194 | 198 |
33 | UD | ఉదయ్‌పూర్ జిల్లా | ఉదయ్‌పూర్ | 30,67,549 | 13,430 | 242 |
ప్రసిద్ధులైన వారుసవరించు
రాజస్థాన్ చరిత్ర, సాహిత్యం ఎన్నో వీరగాధలతో నిండి ఉన్నాయి. ఎందరో త్యాగశీలురూ, ధైర్యశాలురూ చరిత్రలో గుర్తుండిపోయారు. వారిలో కొందరి పేర్లు
రాజకీయ నాయకులూసవరించు
గణాంకాలుసవరించు
మందిరాలుసవరించు
భారతదేశంలో చాలా పవిత్రంగా భావించే హిందూ, జైన మందిరాలు కొన్ని రాజస్థాన్‌లో ఉన్నాయి:
- బ్రహ్మ మందిరం: ఆజ్మీర్ వద్ద పుష్కర్‌లో ఉంది. సృష్టికర్త బ్రహ్మను పూజించే మందిరం ఇదొక్కటే.
- అచలేశ్వర్ మహాదేవ మందిరం: మౌంట్ అబూ వద్ద అచల్‌ఘర్‌లో ఉన్న శివాలయం. ఈ మందిరం ప్రత్యేకత ఏమంటే ఇక్కడ శివలింగం బదులు శివుని మడమ శిల్పం, ఇత్తడి నంది విగ్రహం ఉన్నాయి.
- ఆదినాధ్ మందిరం: ఉదయపూర్ సమీపంలో రిఖాబ్‌దేవ్ వద్ద నున్న జైన మందిరం. 15వ శతాబ్దంలో నిర్మితం. బిజోలియా మందిరాలు: బుంది వద్ద బిజోలియాలో ఉన్న మందిరాల సమూహం. దాదాపు 100 మందిరాలలో మూడు మాత్రమే ఇప్పుడు మిగిలి ఉన్నాయి.
- నాథ్‌ద్వారా : ఉదయ్‌పూర్‌కు 48 కి.మీ. దూరాన ఉన్న రాజసమండ్ జిల్లాలో ఉన్న శ్రీనాధ్‌జీ మందిరం. పుష్టిమార్గం అనుసరించేవారికి పూజాస్థలం.
- అంబికామాత మందిరం: ఉదయపూర్‌కు 50 కి.మీ. దూరంలో మౌంట్ అబూ వద్ద జగత్ గ్రామంలో ఉన్న దుర్గాదేవి మందిరం.
సమస్యలుసవరించు
- నీటి కొరత రాజస్థాన్ లో తీవ్రమైన సమస్య.
ఇవీ చూడండిసవరించు
వనరులుసవరించు
- Gahlot, Sukhvirsingh. 1992. RAJASTHAN: Historical & Cultural. J. S. Gahlot Research Institute, Jodhpur.
- Somani, Ram Vallabh. 1993. History of Rajasthan. Jain Pustak Mandir, Jaipur.
- Tod, James & Crooke, William. 1829. Annals & Antiquities of Rajasthan or the Central and Western Rajput States of India. 3 Vols. Reprint: Low Price Publications, Delhi. 1990. ISBN 81-85395-68-3 (set of 3 vols.)
బయటి లంకెలుసవరించు
- రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం - అధికారిక వెబ్-సైట్
- Tourism Department of Rajasthan Archived 2015-06-08 at the Wayback Machine - Tourism Home Page
- రాజస్థాన్ ట్రావెల్