జగన్నాథ దేవాలయం, హైదరాబాదు

జగన్నాథ దేవాలయం భారతదేశం లోని తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఒడిషాకు చెమైన సముదాయంచే నూతనంగా కట్టించబడిన జగన్నాథ స్వామికి చెందిన దేవాలయం. ఈ దేవాలయం బంజారా హిల్స్ రోడ్ నెం. 12 లో నెలకొని ఉంది. ఇచట ప్రతీ సంవత్సరం రధయాత్ర సందర్భంగా అనేక వేలమంది భక్తులు హాజరవుతారు.[1] ఈ దేవాలయం 2009లో నిర్మింపబడింది.

జగన్నాథ దేవాలయం, హైదరాబాదు
జగన్నాథ దేవాలయం, హైదరాబాదు
పేరు
స్థానం
దేశం:India
రాష్ట్రం:Telangana
జిల్లా:Hyderabad
ప్రదేశం:Road 12, Banjara Hills
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:Jagannath
ప్రధాన పండుగలు:Rath Yatra
ఆలయాల సంఖ్య:Five
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
2009
దేవాలయ బోర్డు:Kalinga Cultural Trust, Hyderabad
వెబ్‌సైటు:http://shrijagannathtemplehyderabad.com

విశిష్టతలు

మార్చు

ఈ దేవాలయం పూరి లో నెలకొని ఉన్న జగన్నాథ దేవాలయం నకు ప్రతిరూపంగా భావిస్తారు. అదే విధమైన రూపకల్పన చేయబడిన దేవాలయంగా చెప్పబడుతుంది. ఈ దేవాలయంలో ప్రముఖ ఆకర్షణ భాగం "శిఖరం". ఇది 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న ఈ దేవాలయం సేండ్ స్టోన్ తో కట్టబడింది. ఈ నిర్మాణానికి అవసరమైన సుమారు 600 టన్నుల రాయిని ఒడిశా నుండి తేవడం జరిగింది. 60 మంది శిల్పులు ఈ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో విగ్రహాలు లక్ష్మీదేవి, శివుడు, గణేష, హనుమాన్, నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ రకమైన శిల్పాలు మానవుని అంతర్గత భావాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. దేవాలయంలో ప్రవేశం తర్వాత అంతర్గత భావాలను బయట ఉంచేందుకు సూచిస్తాయి.

గర్భగుడిలో జగన్నాథస్వామి తన సన్నిహితులైన భలభద్రుడు, సుభద్రాదేవి లతో కలసి ఉన్నాడు.

మూలాలు

మార్చు
  1. "Over 6,000 devotees attend Jagannath Rath Yatra". New Indian Express. 22 June 2012. Archived from the original on 14 ఆగస్టు 2014. Retrieved 29 July 2014.

మూస:India-hindu-temple-stub