బంజారా హిల్స్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య కేంద్రం.

బంజారా హిల్స్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక వాణిజ్య కేంద్రం, నగరంలోని అత్యంత సంపన్నమైన పొరుగు ప్రాంతాలలో ఇదీ ఒకటి.[1] ఇది జూబ్లీ హిల్స్‌కు సమీపంలో ఉంది. గతంలో ఈ ప్రాంతం అడవితో నిండివుండేది. నిజాం రాజవంశానికి చెందిన కొద్దిమంది మాత్రమే ఇక్కడ నివసించేవారు. ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా పట్టణ వాణిజ్య కేంద్రంగా మార్చబడింది. ఇక్కడ ఉన్నత స్థాయి హోటళ్ళు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్‌లు, ప్రపంచ సంస్థల కార్యాలయ భవనాలు ఉన్నాయి. బంజారా హిల్స్ లోని రోడ్లకు నెంబర్లు (రహదారి సంఖ్యలు) ఉన్నాయి. ఈ సంఖ్యలు 1 నుండి ప్రారంభమై 14 వద్ద ముగుస్తాయి.

బంజారాహిల్స్(Banjara Hills)
బంజారాహిల్స్(Banjara Hills) is located in Telangana
బంజారాహిల్స్(Banjara Hills)
బంజారాహిల్స్(Banjara Hills)
బంజారాహిల్స్(Banjara Hills) is located in India
బంజారాహిల్స్(Banjara Hills)
బంజారాహిల్స్(Banjara Hills)
Coordinates: 17°24′54″N 78°26′24″E / 17.415°N 78.440°E / 17.415; 78.440
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాహైదరాబాదు
మెట్రోపాలిటన్ ప్రాంతంహైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం
Government
 • Bodyహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జనాభా
 • Total1,50,000
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
Time zoneUTC+5:30 (భారత కాలమానం)
పిన్ కోడ్
500 034
Vehicle registrationటిఎస్-09
లోక్‌సభ నియోజకవర్గంసికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం
శాసనసభ నియోకవర్గంఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ

ఎకనామిక్ టైమ్స్ మ్యాగజైన్ [2] ప్రకారం ఈ ప్రాంతం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పరిగణించబడుతోంది. ఎకనామిక్ టైమ్స్ అంచనా ప్రకారం 2011 సెప్టెంబరు 8 నాటికి, బంజారా హిల్స్‌లోని ఆస్తుల విలువ "96,000 కోట్ల రూపాయలు" కాగా, ఇది US $ 20.7 బిలియన్లకు సమానంగా ఉంది.

ఇక్కడ బంజారా చెరువు కూడా ఉంది.

చరిత్ర

మార్చు
 
ఆర్కిటెక్ట్ ముహమ్మద్ ఫయాజుద్దీన్ నివాసం, అల్హంబ్రా బంజారా హిల్స్ వద్ద రోడ్ నెంబర్ 10 లో ఉంది. ఇది 1986-87లో కూల్చివేయబడింది

చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలో ఉన్న మంత్రి నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ 1927లో మొట్టమొదటగా ఈ భూమిని కొనుగోలు చేశాడు. అతడు తన నివాసమైన బంజారా భవన్ (అంటోని గౌడే రచనలచే ప్రేరణ పొంది) ఇక్కడ నిర్మించుకున్నాడు. ఈ ప్రాంతానికి దాని అభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తిగా నవాబ్ పేరు పెట్టాలని నిజాం సూచించగా, ఈ ప్రాంతానికి దాని అసలు నివాసులైన బంజారాల పేరు పెట్టడం న్యాయమేనని నవాబ్ పేర్కొన్నాడు.[3]

బంజారా భవన్‌ను జవాహర్ లాల్ నెహ్రూ, రవీంద్రనాధ టాగూరు వంటి వారు కూడా సందర్శించారు.[4][5]

మెహదీ నవాజ్ జంగ్ గౌరవార్థం బంజారా హిల్స్ లోని రోడ్ నంబర్ 1 ను ఇప్పుడు మెహదీ నవాజ్ జంగ్ రోడ్ అని పిలుస్తున్నారు.[6]

బంజారా హిల్స్ ప్రాంతం హోటళ్ళు, రెస్టారెంట్లు, పెద్ద షాపింగ్ మాల్స్ కు పేరొందిన ప్రాంతం. ఇక్కడ తాజ్ దక్కన్, తాజ్ బంజారా, తాజ్ కృష్ణ, వంటి స్టార్ హోటళ్ళు, అనేక రెస్టారెంట్లు ఉన్నాయి. జివికె వన్, సిటీ సెంటర్, మిడ్‌టౌన్, ఓహ్రిస్, అల్కాజార్ ప్లాజా, జింగ్ డిజైన్స్ వంటి పెద్ద మాల్‌లతోపాటు అనేక రిటైల్ వ్యాపార సంస్థలు కూడా ఉన్నాయి. బంజారా హిల్స్ ప్రాంతంలో వాణిజ్య లక్ష్మి సైబర్ సెంటర్ అనే ఎత్తైన భవనం కూడా ఉంది.

ఈ ప్రాంతంలో ఉన్న జలగం వెంగళరావు ఉద్యానవనంకు చాలామంది స్థానికులు జాగింగ్ కోసం, విశ్రాంతి కోసం క్రమం తప్పకుండా వస్తారు. రోడ్ నెంబరు 12లోని 400 సంవత్సరాల పురాతన స్వయంభు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం హరినామ సంకీర్తనలకు పేరొందింది. రోడ్ నెంబరు 1, రోడ్ నెంబరు 3లలో అనేక వ్యాపారాలు ఉన్నాయి. 2010లో రోడ్ నంబరు 1లో లామకాన్ అనే సాంస్కృతిక కేంద్రం ప్రారంభించబడింది. రోడ్ నెంబరు 3లో ముఫాఖం జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల కూడా ఉంది. నగరంలోని అతిపెద్ద క్యాంపస్‌లలో ఈ కళాశాల ఒకటి. కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద ఉన్న కెబిఆర్ పార్క్ రోడ్ నెంబరు 3కి సమీపంలోనే ఉంది.

ఆసుపత్రులు

మార్చు
  • బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి
  • ఒమేగా ఆసుపత్రి
  • కేర్ ఆసుపత్రి
  • స్టార్ ఆసుపత్రి [7]
  • ఎల్బిట్ డయాగ్నోస్టిక్స్
  • సూర్య ఫెర్టిలిటీ సెంటర్ [8]
  • సెంచరీ ఆసుపత్రి
  • విరించి ఆసుపత్రి
  • రెయిన్ బో ఆసుపత్రి
  • ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
  • ఆశా ఆసుపత్రి
  • నోవా ఐవిఎఫ్ ఫెర్టిలిటీ ఆసుపత్రి

రవాణా

మార్చు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బంజారా హిల్స్ మీదుగా దిల్‍సుఖ్‍నగర్, కోఠి, ఘటకేసర్, ఖైరతాబాదు వంటి ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[9] కొత్త ఫ్లైఓవర్లు నిర్మించడంతో ఈ శివారు వైపు ట్రాఫిక్ రద్దీ తగ్గింది. ఖైరతాబాద్‌లో సమీప ఎంఎంటిఎస్ రైలు స్టేషను ఉంది.

ప్రాంతాలు

మార్చు

ఇక్కడికి సమీపంలో సోమాజీగూడ, ఎర్రమంజిల్ కాలనీ, వెంకటరమణ కాలనీ, ఆనంద్ నగర్, శ్రీనగర్ కాలనీ, జిఎస్ కాలనీ, నవీన్ నగర్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.

ఆదివాసి-బంజారా భవనాలు

మార్చు

బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 10లో 50 కోట్ల రూపాయలతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కుమ్రం భీమ్‌ ఆదివాసీ, సంత్‌ సేవాలాల్‌ బంజారా భవనాలను 2022 సెప్టెంబరు 17న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. రాష్ట్రంలోని గోండు, కోయ, పర్దాన్‌, థోటి, నాయక్‌పోడ్‌, చెంచు వంటి 10 ఆదివాసీ తెగల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆదివాసి-బంజారాల ఆత్మగౌరవ ప్రతీకలుగా జీ ప్లస్‌ వన్‌ విధానంలో నిర్మించిన ఈ భవనాల్లో వేర్వేరుగా 1000 మంది కూర్చొనేలా ఆడిటోరియం, 250 మందికి సరిపోయే డైనింగ్‌ హాల్స్‌, వీఐపీ లాంజ్‌లు, ఫొటోగ్రఫీ, కళాకృతులు, పెయింటింగ్స్‌, బంజారా భవన్‌లో లంబాడీల జీవన విధానం, సంస్కృతిని తెలిపే విధంగా గ్యాలరీలు వంటివి ఏర్పాటు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.[10][11]

మూలాలు

మార్చు
  1. "Banjara Hills Locality". www.onefivenine.com. Retrieved 2021-02-09.
  2. "Check out India's most expensive boulevard". timesofindia-economictimes. Retrieved 2021-02-09.
  3. Luther, Narendra (2015-09-09). "The man who gave Hyderabad its 'Banjara Hills', Nawab Mehdi Nawaz Jung". The News Minute. Retrieved 2021-02-09.
  4. Venkateshwarlu, K. (August 16, 2011). "Another heritage landmark razed". The Hindu. Retrieved 2021-02-09.
  5. Shahid, Sajjad. "Will no one question the 'tyrant'? - Times of India". The Times of India. Retrieved 2021-02-09.
  6. Kurup, Sonia Krishna. "Roads in Banjara Hills are oddly numbered, not named - Times of India". The Times of India. Retrieved 2021-02-09.
  7. "Best Multi Specialty Hospital in Hyderabad". Retrieved 2021-02-09.
  8. "Best IVF Centre in Hyderabad - IUI - ICSI/IVF - Egg Donation - Surrogacy - Surya Fertility Centre - Dr Sunitha Illinani". Archived from the original on 2021-02-25. Retrieved 2021-02-09.
  9. "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-02-09.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. telugu, NT News (2022-09-17). "ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌". Namasthe Telangana. Archived from the original on 2022-09-17. Retrieved 2022-09-17.
  11. "ఆత్మగౌరవ భవనాలు అభివృద్ధికి వేదికలు". EENADU. 2022-09-18. Archived from the original on 2022-09-18. Retrieved 2022-09-18.