జగమే మాయ బ్రతుకే మాయ పాట 1953 లో విడుదలైన దేవదాసు సినిమా కోసం సముద్రాల రచించారు. ఈ గీతాన్ని ఘంటసాల వెంకటేశ్వరరావు హృద్యంగా గానం చేయగా సి.ఆర్. సుబ్బరామన్ సంగీతాన్ని అందించారు.

నేపథ్యంసవరించు

దేవదాసు పార్వతి చిన్ననాటి నుండి ప్రేమించుకుంటారు. లండన్ లో పైచదువుల తర్వాత తిరిగివచ్చిన దేవదాసు పార్వతిని పెళ్ళిచేసుకోవాలనుకుంటాడు. పెద్దల అంగీకారం లభించని కారణం వారు ప్రేమికులు గానే మిగిలిపోతారు. పార్వతిని మరచిపోలేని దేవదాసు మధ్యానికి బానిసై ఆరోగ్యాన్ని పాడుచేకుంటాడు. అలాంటి మానసిక పరిస్థితిలో జీవితం మీద వైరాగ్యంతో తత్వాల్ని జీవిత సత్యాల్ని రంగరించి విషాదంగా ఆలపిస్తాడు.

పాట లో కొంత భాగంసవరించు

పల్లవి :

జగమే మాయ బ్రతుకే మాయ

వేదాలలో సారమింతేనయా ఈ వింతే నయా ||| జగమే మాయ |||

చరణం 1 :

కలిమీలేములు కష్టసుఖాలు

కావడిలో కుండలనీ భయమేలోయి

కావడి కొయ్యేనోయ్ కుండలు మన్నేనోయ్

కనుగొంటే సత్యమింతేనోయి ఈ వింతేనోయి ||| కావడి కొయ్యేనోయ్ ||| ||| జగమే మాయ |||

బయటి లింకులుసవరించు