జగ్గయ్యపేట పురపాలక సంఘం
జగ్గయ్యపేట పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మున్సిపాలిటీ. ఇది జగ్గయ్యపేట పట్టణానికి పరిపాలన సంస్థ. ఈ పురపాలక సంఘం విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలోని, జగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.
జగ్గయ్యపేట | |
స్థాపన | 1982 |
---|---|
రకం | స్థానిక సంస్థలు |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | జగ్గయ్యపేట |
కార్యస్థానం | |
సేవలు | పౌర సౌకర్యాలు |
అధికారిక భాష | తెలుగు |
ప్రధానభాగం | పురపాలక సంఘం |
జాలగూడు | అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చు1982 సంవత్సరంలో 3 వ గ్రేడ్ మున్సిపాలిటీగా స్థాపించబడింది.ఈ మునిసిపాలిటీలో 27 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీని పూర్వనామము బేతవోలు. రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు తన తండ్రి పేర కట్టించిన పట్టణమిది. ఈయన గొప్ప శివ భక్తుడు. నేటికి దాదాపు 180 ఏళ్ళ క్రితం, ఈ ప్రదేశాన్ని రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు పరిపాలించేవాడు.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం 53,530 జనాభా ఉండగా అందులో పురుషులు 26,484, మహిళలు 27,046 మంది ఉన్నారు.అక్షరాస్యత 79.15% ఉండగా అందులో పురుష జనాభాలో 84.88%, స్త్రీ జనాభాలో 73.59% అక్షరాస్యులు ఉన్నారు.0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5533 ఉన్నారు.ఈ పురపాలక సంఘంలో మొత్తం 13,670 గృహాలు ఉన్నాయి.[1]
ప్రస్తుత చైర్పర్సన్, వైస్ చైర్మన్
మార్చుప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా తన్నేరు నరసింహారావు పనిచేస్తున్నాడు.[2] వైస్ చైర్మన్‌గా మహ్మద్ అక్బర్ పనిచేస్తున్నాడు.[2]
పట్టణంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- వరసిద్ధి విఘ్నేశ్వరస్వామివారి దేవాలయం
- చంద్రమౌళీశ్వరస్వామివారి దేవాలయం (పెద్ద శివాలయం).
- దుర్గా మల్లేశ్వరస్వామివారి దేవాలయం.
మూలాలు
మార్చు- ↑ "Jaggaiahpet Municipality City Population Census 2011-2020 | Andhra Pradesh". www.census2011.co.in. Archived from the original on 2019-12-31. Retrieved 2020-07-01.
- ↑ 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.