జటాసింహనంది ( సంస్కృతం : जटासिंहनन्दि), జటాసింహ నంది లేదా జటిల ముని (जटिलमुनि) అని కూడా పిలువబడే ఒక జైన సంస్కృత కవి. ఇతను 6వ-9వ శతాబ్దం CE కాలంలో జీవించాడని నమ్ముతారు. [1] అతను ఆధునిక భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో నివసించాడు. [2] 8వ శతాబ్దానికి చెందిన ఉద్యోతనసూరి రచించిన కువలయమాలయము నందు జటాసింహనంది ప్రస్తావన చేసినాడు. అదే కాలానికి చెందిన పున్నాట జైనసేనాచార్యుడు రచించిన హరివంశపురాణంలో కూడా ఈయన ప్రస్తావన కలదు.

జటాసింహనంది అనేక కావ్య కవితా రచనల రచయిత, ఇందులో వరాంగచరితం యొక్క సాహస కథనం కూడా ఉంది. [1] ఇది నిశ్చయంగా స్థాపించబడనప్పటికీ, అతను అశ్వఘోషచే శైలీకృతంగా ప్రభావితమై ఉండవచ్చు. [2] ఇందు 31 సర్గలు కల కావ్యము. ఇందులో జైనధర్మ ప్రచారము వివరించబడినది. ధర్మార్ధకామ మోక్ష అను నాలుగు పురుషార్ధాలు ఇందులో తెలుపబడినాయి.వరాంగచరితం వరాంగ రాజకుమారుడి చరితం. ధర్మసేనుడనే రాజు వినీతదేశం పరిపాలించేవాడు. ఆతను పుత్రుడు వరాంగుడు. వరాంగుడు తమ్ముడు సుషేణుడు. అతడు వరాంగుడుకి చెడు వ్యసనాలు అలవాటు చేసి ఒకనాడు ఒక దుష్ట అశ్వారోహణం ద్వారా వరాంగడుని కొండపైనుంచి తొసేస్తాడు. క్రిందపడిన వరాంగుడు దైవవశాత్తు బ్రతికి, సేవకుని వేషంతో అనేక ప్రదేశాలు అనేక సంవత్సరాలు తిరుగుతాడు. లలితపురంలో చివరకు నివసిస్తాడు. మధురాధిపతి లలితపురాన్ని ఆక్రమించుకో దలచినప్పుడు వరాంగుడు తన వీరత్వంతో యుద్ధం చేసి లలిత పురాన్ని సుస్థిరపరుస్తాడు. సంతోషంతో లలితపురం రాజు వరాంగుడుకి తన కూతురినిచ్చి పెళ్ళి చేస్తాడు. అక్కడే వినీతపురాన్ని పాలిస్తున్న వృద్ధరాజు ధర్మసేనుడు వకులాధిపతి తన రాజ్యాన్ని ఆక్రమిస్తున్నాడని తనని నివరాంచుటకు వరాంగుడు సహాయం కోరుతాడు. అప్పుడు వరాంగుడు తన సహాయంతో వినీతపురాన్ని రక్షిస్తాడు. తన పుత్రుడుని ధర్మసేనుడి తరువాత రాజుగా పేర్కొంటాడు. కొంతకాలం ధర్మ పాలనా చేసి రాజ్యపాలనపై విరక్తి పొంది పుత్రులకు రాజ్యభారాన్ని అప్పగించి మునిధీక్షను స్వీకరిస్తాడు. ఇదే వరాంగచరితం కావ్య సారాంశం.

ఇది కూడ చూడు

మార్చు

ప్రస్తావనలు

మార్చు
  1. 1.0 1.1 Nagendra Kumar Singh (2001), Encyclopaedia of Jainism, Volume 1, Anmol Publications Pvt Ltd, ISBN 81-261-0691-3, ... To the 7th century we can assign another poem written by a Digambara poet viz. the Varangacarita of Jatasimhanandi ... the Varangacarita and its author Jata Simhanandi ... The poem Varangacarita runs to 31 chapters and describes the vicissitudes of the life of prince Varanga ... ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "singh2001" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  2. 2.0 2.1 Anthony Kennedy Warder (1994), Indian kāvya literature: The ways of originality (Bāna to Dāmodaragupta), Volume 4, Motilal Banarsidass Publishers, ISBN 978-81-208-0449-4, ... the Chalukya Empire of Karnataka belongs a Jaina dharma novel, the Varangacarita by Jatasimhanandin (or Jatila or Jatacarya ... commemorated in the Koppala inscription) ... Though a fiction (the names of the hero and of several other characters are obviously fictitious) ... had read and enjoyed Asvaghosa's works and wished to give the Jainas a counterpart ... ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "warder1994" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు