జనతా హోటల్

అన్వర్ రషీద్ తీసిన 2012 చిత్రం
(జనతా హోటల్‌ నుండి దారిమార్పు చెందింది)

జనతా హోటల్‌ 2018లో విడుదలైన తెలుగు సినిమా.[1] మలయాళంలో 2012లో ఉస్తాద్ హోటల్ పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో జనతా హోటల్‌ పేరుతో ఎస్.కె. పిక్చర్స్ బ్యానర్ పై సురేష్ కొండేటి నిర్మించాడు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌  హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అన్వర్ రషీద్ దర్శకత్వం వహించగా సెప్టెంబర్ 14, 2018న విడుదలైంది.

జనతా హోటల్‌
దర్శకత్వంఅన్వర్ రషీద్
రచనఅంజలి మీనన్
నిర్మాతసురేష్ కొండేటి
తారాగణందుల్కర్ సల్మాన్, నిత్యామీనన్‌
ఛాయాగ్రహణంఎస్.లోకనాథన్
కూర్పుప్రవీణ్ ప్రభాకర్
సంగీతంగోపీ సుందర్
నిర్మాణ
సంస్థ
ఎస్.కె. పిక్చర్స్
విడుదల తేదీ
2018 సెప్టెంబరు 14 (2018-09-14)
సినిమా నిడివి
150 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

ఫైజల్ (దుల్కర్ సల్మాన్) సంపన్న కుటుంబానికి చెందిన అబ్బాయి, అతనికి చెఫ్ కావాలని ఆశ. స్విట్జర్లాండ్‌ వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాని తండ్రికి అబద్దం చెప్పి చెఫ్ కోర్స్ చేసి ఇండియా వస్తాడు. తన సొంత ఊరు వెళతాడు. అక్కడ తన తాత నడుపుతున్న హోటల్‌కి వెళతాడు. ఆ హోటల్ కథ ఏంటి ? చెఫ్ కావాలనుకునే ఫైజల్ ఆ హోటల్ యజమానిగా బాధ్యతలు చేపడతాడా ? విదేశాలు తిరిగి వెళ్లిపోతాడా? అనుకోకుండా పరిచయమైన షహానా (నిత్యామీనన్) కారణంగా ఫైజల్ జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: ఎస్.కె. పిక్చర్స్
  • నిర్మాత: సురేష్ కొండేటి
  • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: అన్వర్ రషీద్
  • సంగీతం: గోపీ సుందర్
  • సినిమాటోగ్రఫీ: ఎస్.లోకనాథన్
  • మాటలు: సాహితి

మూలాలు మార్చు

  1. Sakshi (10 July 2018). "జనతా హోటల్‌". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.
  2. The Times of India (12 September 2018). "Janatha Hotel". Archived from the original on 7 October 2021. Retrieved 7 October 2021.