దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ భారతీయ సినీ నటుడు, మలయాళ, తమిళ భాషల సినిమాల్లో కథానాయకునిగా ప్రఖ్యాతుడు. దుల్కర్ ప్రఖ్యాత మలయాళ నటుడు మమ్ముట్టి కొడుకు. సెకండ్ షో (2012) అన్న మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. అన్వర్ రషీద్ దర్శకత్వం వహించిన ఆయన రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ (2012) జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ ప్రజాదరణ పొందిన వినోద చిత్రంగా పురస్కారం లభించింది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన వాయై మూడి పేశవుం (2014) తో తమిళ సినిమా పరిశ్రమలో ప్రవేశించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ తొలిచిత్ర నటుడు పురస్కారాన్ని రెండుసార్లు 2012లో సెకండ్ షో సినిమాకి మలయాళంలోనూ, 2014లో వాయై మూడి పేశవం సినిమాకి తమిళంలోనూ అందుకున్నారు.[2] 2015లో చార్లీ నటనకు కేరళ రాష్ట్ర సినిమా పురస్కారాల్లో ఉత్తమ నటుడు అవార్డు పొందారు.
దుల్కర్ సల్మాన్ | |
---|---|
జననం | 28 July 1986[1] | (age 38)
విద్యాసంస్థ | పర్డ్యూ విశ్వవిద్యాలయం |
వృత్తి | సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, వ్యాపారస్తుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2012 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | అమల్ సూఫియా (వివాహం.2011) |
తల్లిదండ్రులు | మమ్ముట్టి సల్ఫాత్ |
ప్రారంభ జీవితం
మార్చుదుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు మమ్ముట్టి, సల్ఫాత్ లకు జన్మించారు. కొచ్చి, కేరళలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసి చెన్నైలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసం చేశారు. అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో వ్యాపార నిర్వహణలో డిగ్రీ పొందారు.[3] చెన్నైకు చెందిన ఆర్కిటెక్ట్ అమల్ సూఫియాను 2011 డిసెంబరు 22న వివాహం చేసుకున్నారు.[4][5]
సినీ కెరీర్
మార్చుదర్శకుడు శ్యాంప్రసాద్ రీతు సినిమాలో దుల్కర్ కు ఓ పాత్ర చేసేందుకు అవకాశం ఇచ్చారు. ఆపైన తమిళ దర్శకుడు ఎన్.లింగుస్వామి తన తొలి మలయాళం సినిమాలో పాత్ర ఇచ్చారు. ఐతే సల్మాన్ ఆ అవకాశాలను నిరాకరించారు. సినిమాలకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు సినిమాల గురించి స్వల్పకాలపు కోర్సు చేశారు.[3]
2011లో, దుల్కర్ తన స్నేహితుడు శ్రీనాథ్ రాజేంద్రన్ తొలి సినిమా సెకండ్ షోలో నటించేందుకు అంగీకరించారు, ఆ సినిమాలో గ్యాంగ్ స్టర్ పాత్రను పోషించారు. సెకండ్ షో సినిమా విజయవంతమై 100 రోజులు పూర్తిచేసుకుంది.[6] రెండవ సినిమా ఉస్తాద్ హోటల్ 2012లో మలయాళ సినిమా రంగంలో ప్రధానమైన వ్యాణిజ్యపరమైన విజయం పొందడమే కాక విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. సెకండ్ షో సినిమాకి ఉత్తమ తొలిచిత్ర నటునిగా పురస్కారాన్ని పొంది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్రానికి నామినేట్ అయ్యారు.[7][8]
అతని మూడవ చిత్రం తీవ్రం క్రైమ్ థ్రిల్లర్లో భార్య మృతికి కక్ష తీర్చుకునే పాత్రలో నటించారు, ఆ సినిమా 2012 నవంబరు 16. ఇతడు అతిథి పాత్రలో నటించిన మలయాళ సినిమా అన్ మరియ కలిప్పిలను తెలుగులో పిల్ల రాక్షసిగా విడుదలైంది.
దుల్కర్ శ్రీనాథ్ రాజేందర్ దర్శకత్వంలో కురుప్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కేరళలోని సుకుమార కురుప్ అనే నేరస్తుడి జీవిత కథ ఆధారంగా రూపొందించబడినది.[9] మహానటి తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో సినిమా చేస్తున్నారు.[10]
తెలుగులో అనువాదమై సినిమాలు
మార్చు- కురుప్ (2021)
- ఓకే బంగారం గా అనువాదమైన చిత్రం ఓ కాదల్ కన్మణి
- కనులు కనులను దోచాయంటే
- పరిణయం
- జనతా హోటల్
- హే సినామికా(2022)
- సెల్యూట్ (2022)
- అందమైన జీవితం
- కింగ్ ఆఫ్ కొత్త (2023)
తెలుగు సినిమాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Happy Birthday Dulquer Salmaan: 'OK Kanmani' Actor Thanks Fans For Wishes. International Business Times (28 July 2015). Retrieved on 11 October 2015.
- ↑ "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. 27 June 2015.
- ↑ 3.0 3.1 ""Like father, like son"". Archived from the original on 2013-03-28. Retrieved 2016-04-23.. Malayala Manorama 26 December 2011. Retrieved 16 January 2012.
- ↑ Kurian, Shiba (15 January 2012) "Mollywood celebs's honeymoon diaries" Archived 2013-12-03 at the Wayback Machine. The Times of India. Retrieved on 12 January 2012.
- ↑ "Mammootty's son gets married". Rediff.com 23 December 2011. Retrieved on 12 January 2012.
- ↑ Second Show celebrates 100 days Archived 2014-10-22 at the Wayback Machine. Sify.com (19 June 2012). Retrieved on 18 June 2013.
- ↑ Singh, L Romal M (9 October 2012) I prefer being behind the camera: Littil Swayamp – Entertainment – DNA. Dnaindia.com. Retrieved on 18 June 2013.
- ↑ Malayalam films strike gold at the National Awards – Rediff.com Movies. Rediff.com (20 March 2013). Retrieved on 18 June 2013.
- ↑ "Kurup Telugu Teaser: Dulquer Salmaan plays India's most wanted criminal". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-03-28. Retrieved 2021-03-28.
- ↑ "Dulquer Salmaan Telugu Dubbed Movies List Till 2021". Tollywood Ace (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-07-31.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 10TV (7 May 2020). "ఎన్నాళ్లో వేచిన ఉదయం.. దుల్కర్ తెలుగు సినిమా." (in telugu). Archived from the original on 8 May 2022. Retrieved 8 May 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)