జనార్ధనస్వామి ఆలయం
జనార్ధనస్వామి ఆలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ధవళేశ్వరం ఆలయం ఉంది.
జనార్ధనస్వామి ఆలయం | |
---|---|
భౌగోళికాంశాలు : | 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E |
పేరు | |
ప్రధాన పేరు : | జనార్ధనస్వామి ఆలయం |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | తూర్పు గోదావరి |
ప్రదేశం: | రాజమహేంద్రవరం ధవళేశ్వరం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | జనార్ధనస్వామి ఆలయం |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | ఒకటి |
ఆలయ చరిత్ర
మార్చుధవళగిరి కొండమీద స్వామివారు కృతయుగంలో వెలిసారు. ఇక్కడ అమృత సరస్సు అనే పెద్ద చెరువు వుండేది. కృతయుగంలో బ్రహ్మ దగ్గర ఉన్న వేదాలను ఓ రాక్షసుడు ఎత్తుకుపోగా బ్రహ్మ విష్ణువుని ప్రార్ధిస్తే, శ్రీహరి ఆరాక్షసుడ్ని సంహరించి వేదాలను తిరిగి తీసుకొస్తాడు.ఈ వేదాలను రక్షించమని అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాను అని చెప్పాతాడు.శ్రీ హరి వేదాలను తీసుకొని అమృత సరస్సులో దాచి, ఒడ్డున కూర్చుని తపస్సు చేసుకుంటు ఉండిపోయాడు.అడవి కావడంతో రాక్షసులు ఎక్కువుండేవారు.ఈ రాక్షసులంతా అమృత సరస్సులో నీరు త్రాగి అమరులైపోతున్నారు.వారితో పాటు ఆ నీరు త్రాగిన ప్రజలు కూడా అమరులైనరు. అందువల్ల పాపుల భారాన్ని మోయడం భూదేవికి కష్టమైపోయి శ్రీ హరిని ప్రార్థించాడు.శ్రీహరి ఆ సరస్సుని ఓ కొండగా మార్చి, దాని మీదే తన తపస్సు చేశాడు అలా శిలగామారి జనార్దనుడిగా వెలిశాడు. ఇక్కడ స్వామి వారు పూజలు లేక, ఎండకు ఎండి, వానకు తడుస్తుండగా, నారదమహర్షి ఇక్కడకొచ్చి స్వామివార్ని చూసి అర్చిస్తాడు. నారదుని కోరికమీదకు దేవతలు ఇక్కడి కొండలో గుహని తొలిచి ఇవ్వగా, నారదుడు ఆ గుహలో ఉండి, తపస్సు చేసుకుంటూ స్వామివారిని పూజిస్తూ ఉండిపోయాడు.[1]
ఉత్సవాలు
మార్చుప్రతి సంవత్సరం స్వామి వారికి కల్యాణం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. భీష్మ ఏకాదశి దినమున జరుగు ఈ ఉత్సవం చుట్టు పక్కల జిల్లాల నుండి కూడా భక్తులను ఆకర్షిస్తుంది. ఆ రోజు జరుగు రథోత్సవం చాలా బాగుంటుంది. దీనినే తీర్థం అని కూడా అంటారు. మొదట్లో 5 రోజులు జరిగేదని పెద్దలు చెపుతారు. ప్రస్తుతం 2 రోజులకు జరుగుతున్నాయి.
మూలాలు
మార్చు- ↑ ఎన్. ఎస్, నాగిరెడ్డి (2003). తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి.